India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోల్‌కతాలో ట్రైనీ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన కారణంగా రేపు ఉ.6 గంటల నుంచి ఆదివారం ఉ.6 గంటల వరకు దేశవ్యాప్తంగా వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు IMA వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించింది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా వైద్యులు నిరసనలతో 24 గంటలు పాటు వైద్య సేవలు నిలిచిపోనున్నాయి.
రైలు ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు శుక్రవారం విజయనగరం రైల్వే పోలీసులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన బలిరెడ్డి సురేష్ (26) పెద్దామనాపురంలోని తన నాన్నమ్మ ఇంటికి వెళుతుండగా పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొట్టిందని తెలిపారు. దీంతో అతను తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు చెప్పారు. ఫిర్యాదు మేరకు బొబ్బిలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాచిపెంట మండలం రాయిమానుగెడ్డ ఉద్ధృతంగా ప్రవహించడంతో ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. సారాయివలస ఏకలవ్య పాఠశాలలో ఉపాధ్యాయులుగా మహేశ్, ఆర్తీ పనిచేస్తున్నారు. విధులు ముగించుకొని బైక్‌పై వస్తుండగా మార్గ మధ్యలో గడ్డ ఉద్ధృతంగా ప్రవహించడంతో నదిలో కొట్టుకుపోయారు. ఆర్తి మృతదేహం లభ్యం కాగా, మహేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈవీఎంలపై మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం సాలూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని మెజారిటీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, 2019లో చంద్రబాబు కూడా ఈవీఎంలను వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఈ సారి ఫలితాలు మరింత బలాన్ని చేకూర్చాయని, బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావాలన్నారు.
సీబీఎస్ఈ పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించాల్సిన ప్రయోగాత్మక పరీక్షను వాయిదా వేశామని డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈ నెల 19 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షల నిర్వహణకు నిర్ణయించామన్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా పాఠశాలలకు ఐచ్ఛిక సెలవు ఉన్నందున పరీక్షను వాయిదా వేశామని డీఈవో తెలిపారు.
విశాఖ స్థానిక సంస్థల MLCగా బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనమైంది. ఈ నేపథ్యంలో ఆయనకు అదనంగా మరో పదవి వస్తుందని YCPలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం శాసనమండలిలో లేళ్ల అప్పిరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ పదవిని బొత్సకు మారుస్తారని ప్రచారం జరుగుతోంది. సీనియర్ లీడర్ బొత్స ప్రతిపక్ష నేతగా ఉంటే అధికార పార్టీని దీటుగా ఎదుర్కోగలరని వైసీపీ భావిస్తోందట. అదే జరిగితే జగన్‌కు లేని ప్రతిపక్ష హోదా ఆయనకు వస్తుంది.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం పోలీసుశాఖకు చెందిన హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర శేఖరరావుకు, కేంద్ర హోంశాఖ ఇండియన్ పోలీసు మెడల్ ప్రకటించింది. దేశంలో వివిధ రాష్ట్రాలలో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సేవలను గుర్తిస్తూ, ఇండియన్ పోలీసు మెడల్ (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీసు) పతకాలను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం ఆయన్ను అభినందించారు.
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా మండల కేంద్రమైన తెర్లాంలో స్థానిక అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో, 200 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పాల్గొని గ్రామంలో భారత్ మాతా కీ జై అంటూ స్వాతంత్ర్య నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. “ శివాజీ చేతిలో కత్తిని చూడు- భారతదేశం సత్తా చూడు” అనే నినాదాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
పార్వతీపురం మన్యం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ఆమె మాట్లాడారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. వెనుకబడి ఉన్న జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు.
జిల్లాలో పనిచేస్తున్న పలువురు ఎస్ఐలు బదిలీ అయ్యారు. బొండపల్లి ఎస్ఐ లక్ష్మణరావుకు గజపతినగరం, గజపతినగరం ఎస్ఐ మహేశ్‌కు బొండపల్లి, విజయనగరం పీటీసీ ఎస్ఐ సాయికృష్ణకు గంట్యాడ(డెప్యూటేషన్), విజయనగరం 2టౌన్ ఎస్ఐ రాజేశ్‌కు బూర్జవలస, బాడంగి ఎస్ఐ జయంతికి పెదమానాపురం, సంతకవిటి ఎస్ఐ షేక్ శంకర్‌కు వంగర, పూసపాటిరేగ ఎస్ఐ సన్యాసినాయుడుకు డెంకాడకు బదిలీ చేస్తూ SP వకుల్ జిందాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.