Vizianagaram

News July 9, 2024

బొబ్బిలి: ప్రేమ పేరుతో మోసం.. వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్ష

image

బొబ్బిలి గుడారి వీధికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి దాడితల్లి కాలనీకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను లోబరుచుకున్నడాని, ఆ తర్వాత పెళ్లికి నిరాకరించినట్లు యువతి 2016లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. తాజాగా నేరం రుజువు కావడంతో అతనికి ఉమెన్ కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.30వేల జరిమాన విధించినట్లు బొబ్బిలి సీఐ నాగేశ్వరరావు తెలిపారు.

News July 9, 2024

తిరుమల ఎక్స్‌ప్రెస్ రద్దు

image

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న ఆధునీకరణ పనుల కారణంగా విశాఖ నుంచి బయలుదేరే విశాఖ-కడప (17488) తిరుమల ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 5 నుంచి 10 వరకు, తిరుగు ప్రయాణం చేసే కడప-విశాఖ (17487) తిరుమల ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 6 నుంచి 11వ తేదీ వరకు రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజనల్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ తెలిపారు.

News July 9, 2024

VZM: ఇక గ్రామాల్లో చెత్త కనిపించదు

image

గ్రామాల్లో ఇక నుంచి చెత్త కనిపించకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీనికోసం పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేకంగా పీఆర్-1 యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా విజయనగరం జిల్లాలోని 27 మండలాల్లో ఉన్న 777 పంచాయతీలు, మన్యం జిల్లాలోని 15 మండలాల్లో ఉన్న 451 పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించనున్నారు.గ్రామీణ నీటి పధకాలు, కాలువలు, బ్లీచింగ్ వంటి వివరాలు యాప్ లో నమోదు చేస్తారు.

News July 9, 2024

విశాఖ-అరకు రహదారి విస్తరణకు గ్రీన్ సిగ్నల్..!

image

విశాఖ-అరకు జాతీయ రహదారి విస్తరణకు త్వరలో మోక్షం కలగనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని కొత్తవలస, శృంగవరపుకోట మీదుగా రహదారి విస్తరణ పనులు జరగనున్నాయి. గత ఏడాది విస్తరణ పనులు ప్రారంభించినప్పటికీ కేంద్రం ఆదేశాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా చంద్రబాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లడంతో సానుకూలంగా స్పందించారు.కొత్తవలస, ఎల్ కోట, వేపాడ, ఎస్ కోట మీదుగా 4 లైన్లకు విస్తరించనున్నారు.

News July 9, 2024

ఉమ్మడి జిల్లాలో మందకొడిగా ఖరీఫ్ సాగు

image

జులై మొదటి వారం గడుస్తున్నప్పటికీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఖరీఫ్ సేద్యం మందకొడిగా సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఆశాజనకంగా కురవకపోవడమే దీనికి కారణంగా రైతులు చెబుతున్నారు. అధికారిక గణంకాల ప్రకారం విజయనగరం జిల్లాలోని 4 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని 6 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టుల్లో నీరు లేని కారణంగా వరి సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News July 9, 2024

విజయనగరం జిల్లాలో నేడు కేంద్ర మంత్రి పర్యటన

image

విజయనగరం జిల్లాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం పర్యటించనున్నారు. భోగాపురం మండలంలో జరుగుతున్న అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను మధ్యాహ్నం రెండు గంటలకు రామ్మోహన్ నాయుడు పరిశీలించనున్నారు. విమానాశ్రయ నిర్మాణ పనుల పురోగతి, వేగవంతానికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి ఆరా తీయనున్నారు.

News July 9, 2024

VZM: రోడ్డు ప్రమాదంతో వ్యక్తి మృతి

image

వేపగుంట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్.కోట మండలం వెంకటరమణపేటకు చెందిన కృష్ణ(37) మృతి చెందాడు. విశాఖలోని ఆసుపత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు వెళ్తుండగా.. బైక్ అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రగా గాయపడ్డ అతనిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా.. కృష్ణ దంపతులకు రెండు నెలల క్రితమే కవల పిల్లలు(ఆడ, మగ)పుట్టారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

News July 9, 2024

VZM: జీఎంఆర్‌ను కలిసిన మంత్రి శ్రీనివాస్

image

రాజాంకు చెందిన జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంథి మల్లిఖార్జునరావును రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో సోమవారం ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా జిఎంఆ‌ర్‌ను మంత్రి శ్రీనివాస్ సత్కరించారు. తాను జీఎంఆర్ ఐటిలో ఇంజినీరింగ్ చదివిన రోజులను గుర్తు చేసుకున్నారు.

News July 8, 2024

VZM: జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీల్లో జిల్లాకు 3 కాంస్య పతకాలు

image

తమిళనాడు రాష్ట్రం సేలంలో నిర్వహించిన జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలో విజయనగరం జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. మూడు కాంస్య పతకాలు సాధించినట్లు రెజ్లింగ్ అధ్యక్షుడు వెంకట రమణ తెలిపారు. 57 కేజీల విభాగంలో పావని, 61 కేజీల విభాగంలో కరుణానిధి, 74 కేజీల విభాగంలో తిరుమల ప్రసాద్ కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. దీంతో క్రీడాకారులను అసోసియేషన్ సభ్యలు, బంధువులు, స్నేహితులు అభినందిస్తున్నారు.

News July 8, 2024

VZM: అక్ర‌మ మైనింగ్‌ను సహించేది లేదు: కలెక్టర్ అంబేడ్కర్

image

విజయనగరం జిల్లాలో ప‌లు మండలాలలో అక్ర‌మంగా గ్రావెల్‌, మ‌ట్టి త‌వ్వ‌కాలు జ‌రుగుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయ‌ని కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు. ఇక పై జిల్లాలో అక్ర‌మ మైనింగ్ జరిగిన స‌హించేది లేద‌ని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మార్వో, ఆర్డీవో అధికారులు నిఘా పెట్టి వాటిని నిరోధించాల‌న్నారు. భవిష్యత్తులో అక్ర‌మ మైనింగ్ జ‌రిగిన‌ట్లు ఫిర్యాదులు వ‌స్తే ‌ఎమ్మార్వోల‌నే బాధ్యుల‌ను చేస్తామ‌ని హెచ్చరించారు.