India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా ఈ నెల 16న విజయనగరం జిల్లాకు రానున్నారు. ఆగస్టు 15 నుంచి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 16న సిసోడియా జిల్లాకు విచ్చేసి రోజంతా వివిధ మండలాల్లో పర్యటిస్తారని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఎంపీడీఓలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించాలన్నారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తరాంధ్ర వైసీపీ కేడర్ నిరుత్సాహానికి గురైంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చింది. గెలవడడానికి బలమున్నా సరే టీడీపీ పోటీలో ఉంటే ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇదే సమయంలో బొత్సను వైసీపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. చివరకు పోటీ నుంచి కూటమి తప్పుకోవడంతో ఆయన గెలుపు లాంఛనం కానుంది. బొత్స లాంటి సీనియర్ నేత MLC అయితే YCPకి జోష్ వస్తుందా? మీ కామెంట్.
అరకు ఎంపీ తనూజా రాణి ఎన్నికను రద్దు చేయాలని బీజేపీ అభ్యర్థి గీత హైకోర్టును ఆశ్రయించారు. ఆమె ఎన్నికల అఫిడవిట్‌లో అవాస్తవాలు చూపారని ఆరోపించారు. ఓట్ల పరంగా రెండో స్థానంలో ఉన్న తనను ఎన్నికైనట్లు ప్రకటించాలన్నారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు తనూజాతో పాటు పదిమంది అభ్యర్థులకు, లోక్ సభ సెక్రటరీ జనరల్, అరకు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది.విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది.
విశాఖ జిల్లా కొండెంపూడిలో లైసెన్స్ లేని నాటు తుపాకీతో సంచరిస్తున్న విజయనగరం జిల్లా వాసులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై డి.ఈశ్వరరావు తెలిపారు. ఎల్.కోటకు చెందిన ఎం.సత్యనారాయణ నుంచి దాసరి సత్యారావు తుపాకిని కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. వీరిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. తుపాకీ, గంధకం, శురాకారం, నల్ల బొగ్గు, గన్ పౌడర్, సైకిల్ బాల్స్ స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ చెప్పారు.
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నిన్న నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2024 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆయన ఆస్తులు రూ.73.14 లక్షలు, అప్పులు రూ.95 లక్షలు మేర పెరిగాయి. మేలో ఆయన రూ.73.14 లక్షల విలువైన ఆస్తులు కొనుగోలు చేశారు.
భూ సంబంధిత సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించే లక్ష్యంతో ఆగస్టు 15 నుంచి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. జిల్లాలోని తాశిల్దార్లు, ఎంపిడిఓలు, ఇతర సిబ్బందితో కలెక్టరేట్లోని తన ఛాంబర్ నుంచి సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం గొప్ప ఆశయంతో, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ సదస్సులను విజయవంతం చేయాలన్నారు.
జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ ఆదేశాల మేరకు విజయనగరం వన్ టౌన్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా పశువుల కబేళాపై రైడ్ చేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంటోన్మెంట్ ఏరియాలో స్లాటర్ హౌస్‌లో ఈ తనిఖీలు జరిగాయి. 1100 కేజీల గోమాంసంతో పాటు 13 కోసిన, 37 జీవంతో ఉన్న ఆవులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈనెల 20న పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికుమార్ తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల డిగ్రీ, పీజీతో పాటు ఆక్వా కల్చర్, మైక్రో బయాలజీ చదువుకున్న వారు అర్హులన్నారు. ఆసక్తిగల వారు రెజ్యూమ్, విద్యార్హత సర్టిఫికెట్లు జిరాక్స్‌తో పాటు ఒక పాస్ పోర్టు సైజ్ ఫొటోతో ఉ.9 గంటలకు హాజరవ్వాలని సూచించారు.
గత ఆరు నెలలుగా నిలిపివేసిన గుంటూరు – రాయగడ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సర్వీస్‌లు పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. ఈ రైలు విజయనగరం, పార్వతీపురంతో పాటు పలు చోట్ల ఆగనుంది. రైలును పునరుద్ధరించడంతో జిల్లా వాసులకు, ముఖ్యంగా గిరిజన ప్రాంత వాసులకు ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. ఈ నిర్ణయంపై ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
విజయనగరం వాసి ఎం.వెంకటేశ్ 15 రోజులు కిందట తూ.గో జిల్లాకు చెందిన ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశామన్నారు. బాలికలను కాకినాడలోని హాస్టల్‌లో వదులుతానని తీసుకుపోయినట్లు వారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధవళేశ్వరం సీఐ గణేశ్ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. వారు నెల్లూరులో ఉన్నట్లు గుర్తించి నిందితుడికి అదుపులోకి తీసుకున్నట్లు సమచారం.
Sorry, no posts matched your criteria.