Vizianagaram

News December 19, 2024

VZM: డిప్యూటీ సీఎం పర్యటన.. రూట్ మ్యాప్ ఇదే

image

<<14926757>>Dy.Cm పవన్ కళ్యాణ్ <<>>సాలూరు నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించనున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ఉ.9:30కి బయలుదేరి విజయనగరం బైపాస్, రామభద్రపురం, సాలూరు మీదుగా 12:30కు బాగుజోల గ్రామానికి చేరుకుంటారు. 12:30 ఫొటో ఎగ్జిబిషన్, 12:45 రూ.9 కోట్లతో బాగుజోల నుంచి సిరివర రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, 12:55 సమీప గ్రామాల పరిశీలన, 1:25 బాగుజోలలో మాటామంతి, 2:10 బాగుజోల నుంచి రిటన్ సాలూరు మీదుగా వైజాగ్ చేరుకుంటారు.

News December 19, 2024

VZM: డిప్యూటీ సీఎం పవన్ పర్యటనపై నో క్లారటీ..!

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో Dy.Cm పవన్ కళ్యాణ్ పర్యటనపై తర్జన భర్జన నెలకొంది. గురువారం సాయంత్రం భోగాపురం చేరుకుని PCOలతో మీటింగ్ ఏర్పాటు చేస్తారని తొలుత చర్చ జరిగింది. అయితే ఆ కార్యక్రమం క్యాన్సిల్ అయ్యింది. శుక్రవారం ఉదయం వైజాగ్ చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో విజయనగరం, గజపతినగరం, రామభద్రపురం, సాలూరు మీదుగా మక్కువ చేరుకుంటారని తెలుస్తోంది. కాగా దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు.

News December 19, 2024

ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం!

image

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.

● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.

News December 19, 2024

VZM: ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలు

image

ఈనెల 20 తేదీ నుంచి జనవరి 19 తేదీవరకు ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు విజయనగరం ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 ముఖ్య పట్టణాల్లో డెలివరీ సౌకర్యముందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయనగరంలో రేపు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సమీప బుకింగ్ కౌంటర్ నుంచి పది కిలోమీటర్ల వరకు 50 కిలోల బరువు గల పార్సిళ్లను ఇంటికే అందజేస్తారని చెప్పారు.

News December 19, 2024

విజయనగరం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్

image

బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. ఈక్రమంలో విజయనగరం జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరంలో 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నారు.

News December 19, 2024

భోగాపురానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం భోగాపురం రానున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో భాగంగా భోగాపురానికి నేడు రాత్రి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో చేయాల్సిన బందోబస్తు ఏర్పాట్లను డీఎస్పీ శ్రీనివాసరావు సిబ్బందితో ఇప్పటికే సమీక్షించారు. ప్రధాన కూడళ్ల వద్ద బందోబస్తు నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

News December 19, 2024

సంతకవిటి: ATM కార్డు మార్చి నగదు స్వాహా

image

సంతకవిటిలో ATM కార్డును మార్చి రూ. 2.17లక్షల సొమ్ము కాజేసిన ఘటనపై కేసు నమోదుచేసినట్లు SI గోపాలరావు తెలిపారు. పోలీసుల కథనం.. గడిముడిదాం వాసి గోపాలరావు పింఛను సొమ్ము డ్రా చేసివ్వమని మోహన్‌రావుకు కార్డు ఇచ్చాడు. మోహన్‌రావు సమీపంలో మరో వ్యక్తిని డబ్బులు డ్రా చేసివ్వమన్నాడు. అతను రూ.10వేలు డ్రా చేసి కార్డు మార్చి ఇచ్చి,పలు దఫాలుగా నగదు కాజేశాడు. బాధితుని ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టామన్నారు.

News December 19, 2024

VZM: జనవరి మొదటి వారంలో పారిశ్రామిక సదస్సు

image

జిల్లాలో పండించే వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ఆధారంగా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు యువ పారిశ్రామిక వేత్త‌ల‌ను ప్రోత్స‌హించేలా విధానాల‌ను రూపొందించాల‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ అధికారుల‌ను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని జిల్లా స్థాయి నైపుణ్యాభివృద్ధి క‌మిటీ స‌మావేశాన్ని అధికారులతో కలిసి నిర్వ‌హించారు. కలెక్టర్ మాట్లాడుతూ..ప్రాముఖ్యత కలిగిన ఉత్పత్తులకు జ‌న‌వ‌రిలో పారిశ్రామిక స‌ద‌స్సు నిర్వ‌హించాల‌ని సూచించారు.

News December 18, 2024

అధికార లాంఛనాలతో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు

image

మెరకముడిదాం మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బందపు ఈశ్వరప్రసాద్ గరివిడి మండలంలోని కాపుశంభాం జంక్షన్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. అంత్యక్రియలను మంగళవారం ఆయన స్వస్థలం భీమవరంలో అధికార లాంఛనాలతో జరిగాయి. జవాన్ ఈశ్వరప్రసాద్ భార్య వినూత్న తలకు, కాలికి గాయాలు కావడంతో ఆమె ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది.

News December 18, 2024

పూసపాటిరేగ: బంధువు ఇంట్లోనే చోరీ

image

బంధువు ఇంట్లోనే ఓ మహిళ చోరీ చేసింది. ఈ సంఘటన పూసపాటిరేగ మండలం సీహెచ్ అగ్రహారంలో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మొళ్లి సత్యం ఇంట్లో మూడు తులాల బంగారం, వెండీ, నగదు చోరీకి గురి అయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని సత్యం బంధువు అయిన మొళ్లి రామలక్ష్మి చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను విచారించగా తనే చేసినట్లు ఒప్పుకుంది.