Vizianagaram

News January 10, 2026

ఉపాధి పనులు ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలి: మంత్రి కొండపల్లి

image

విజయనగరం జిల్లాలో గ్రౌండింగ్ అయిన ఉపాధి హామీ పనులన్నింటినీ ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. తన కాంప్ కార్యాలయంలో ఉపాధి హామీ, పంచాయతీ రాజ్ అధికారులతో శనివారం సమీక్షించారు. స్మశానాలు లేని గ్రామాలు, SC కాలనీలకు స్మశానాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. గ్రామ పంచాయతీ భవనాలు, గోశాలల పనులు వేగవంతం చేసి బిల్లులు వెంటనే అప్‌లోడ్ చేయాలని సూచించారు.

News January 10, 2026

VZM: సంక్రాంతి సందడి.. కిక్కిరిసిన బస్సులు

image

సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో హాస్టల్స్‌లో ఉన్న విద్యార్థులు తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు కూలి పనుల నిమిత్తం వెళ్లిన వారు స్వగ్రామాలకు వస్తున్నారు. దీంతో రైళ్లు, బస్సులు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ముఖ్యంగా VZM – VSKP రూట్లో రద్దీ ఎక్కువగా ఉంది. పండగ సందర్భంగా అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

News January 10, 2026

VZM: పోలీసు కుటుంబాలతో సంక్రాంతి సంబరాలు

image

ఈనెల 13న జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీసు కుటుంబాలతో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ముగ్గుల పోటీలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భోగి మంటలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీసు మహిళా ఉద్యోగినులు ప్రత్యేకంగా పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ బహుమతులు పొందవచ్చు అన్నారు. ఆరోజు ఉదయం 8 గంటలకు ముగ్గుల సామగ్రితో మైదానంలో హాజరు కావాలని ఎస్పీ ఆహ్వానించారు.

News January 9, 2026

100% ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటించాలి: VZM కలెక్టర్

image

విజయనగరం జిల్లాలోని అన్ని గ్రామాలను నిర్దేశిత గడువులో 100% ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓడీఎఫ్ డిక్లరేషన్‌లో వెనుకబడి ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పెండింగ్‌లో ఉన్న వెరిఫికేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. గతంలో నీటి సమస్యలు, వ్యాధులు ఉన్న గ్రామాలపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను శుక్రవారం కోరారు.

News January 9, 2026

VZM: ‘ఉపాధి హామీ పని దినాలు పెరుగుతాయి’

image

వీబీ జీ రామ్ జీ ద్వారా గ్రామీణ ప్రజలకు విస్తృత ఆర్థిక లబ్ధి చేకూరుతుందని MGNREGS డైరెక్టర్ షణ్ముఖ్ తెలిపారు. స్థానిక ఓ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఈ పథకం అమలుకు విజయనగరం జిల్లాను పైలట్‌గా ఎంపిక చేసినట్లు చెప్పారు. ఉపాధి హామీ పనిదినాలు 100 నుంచి 125కి పెరుగుతాయన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

News January 9, 2026

VZM: ‘పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ త్వరగా పూర్తి చేయాలి’

image

జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు, తహశీల్దార్లతో శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం సాయంత్రానికి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కనీసం 80% పాసుపుస్తకాల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.

News January 9, 2026

VZM: ‘పీహెచ్‌సీల్లో వైద్య‌సేవ‌లు మెరుగుప‌డాలి’

image

విజయనరం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య‌సేవ‌ల‌ను మెరుగుప‌రిచి ఓపిని పెంచాల‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి ఆయా శాఖాధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీ వైద్య సేవ‌ల‌పై కలెక్టర్ కార్యాల‌యం నుంచి శుకవ్రారం వీడియో కాన్ఫ‌రెన్స్‌తో స‌మీక్షించారు. ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ స‌ర్వేపైనా చ‌ర్చించారు. పీహెచ్‌సీల వైద్య‌సేవ‌ల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఓపిని రోజుకి 50కి పెంచాల‌ని ఆదేశించారు.

News January 8, 2026

నేరాల నియంత్రణకు సాంకేతికతను వినియోగించండి: SP

image

జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నేర సమీక్షను నిర్వహించారు. నేరాల నియంత్రణకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని ఎస్పీ దామోదర్‌ అధికారులను ఆదేశించారు. అన్ని కేసుల్లో ఈ-సాక్ష్య యాప్ వినియోగం, సీసీటీఎన్‌ఎస్‌లో వివరాల అప్‌లోడ్ తప్పనిసరి అన్నారు. ఎన్‌బీడబ్ల్యూ అమలు, గంజాయి అక్రమ రవాణా నియంత్రణ, సైబర్ నేరాలపై దృష్టి పెట్టాలన్నారు.

News January 8, 2026

వెట్టిచాకిరీ పూర్తిగా నిర్మూలించాలి: VZM కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో ఎక్కడా.. ఏ రూపంలోనూ వెట్టిచాకిరీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా స్థాయి వెట్టిచాకిరీ నిఘా, పర్యవేక్షణ కమిటీ తొలి సమావేశం బుధవారం జరిగింది. పిల్లలు, గిరిజనులు, వ్యవసాయ కూలీలతో వెట్టిచాకిరీకి తావులేకుండా నిఘా పెంచాలని ఆయన సూచించారు. వెట్టి నుంచి విముక్తి చేసిన వారికి బ్యాంకులు, DRDA ద్వారా ఆర్థిక సహాయం అందించి జీవనాధారం కల్పించాలన్నారు.

News January 8, 2026

వెట్టిచాకిరీ పూర్తిగా నిర్మూలించాలి: VZM కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో ఎక్కడా.. ఏ రూపంలోనూ వెట్టిచాకిరీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా స్థాయి వెట్టిచాకిరీ నిఘా, పర్యవేక్షణ కమిటీ తొలి సమావేశం బుధవారం జరిగింది. పిల్లలు, గిరిజనులు, వ్యవసాయ కూలీలతో వెట్టిచాకిరీకి తావులేకుండా నిఘా పెంచాలని ఆయన సూచించారు. వెట్టి నుంచి విముక్తి చేసిన వారికి బ్యాంకులు, DRDA ద్వారా ఆర్థిక సహాయం అందించి జీవనాధారం కల్పించాలన్నారు.