India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పెంచిన పింఛన్లను ప్రభుత్వం జులై నుంచి పంపిణీ చేస్తున్నందున పింఛన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులకు ఆదేశించారు. శనివారం కలెక్టర్ వెబెక్స్ ద్వారా పింఛన్ పంపిణీ ఏర్పాట్లపై ఆయన ఎంపీడీఓలతో సమీక్షించారు. 1వ తేది ఉదయం 6 గంటలకే పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని సూచించారు. మొదటిరోజు 90 శాతం పంపిణీ పూర్తి కావాలన్నారు.
వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ ప్రాతిపదికన నియామకాలు చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చలపతిరావు తెలిపారు. ఫిజికల్ ఎడ్యుకేషన్, లైబ్రేరియన్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తామన్నారు. అభ్యర్థులు జులై మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు కళాశాల ప్రిన్సిపల్‌కు అందజేయాలని ఆయన తెలిపారు.
భార్యపై హత్యాయత్నం చేసిన కేసులో టీచర్‌కు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానాను బొబ్బిలి కోర్టు విధించినట్లు కోర్టు సమన్వయ అధికారి ఏఎస్సై కొండలరావు తెలిపారు. మండలంలోని గజరాయునివలసకు చెందిన గుండెల సూరిబాబు టీచర్‌గా పని చేస్తున్నాడు. తన భార్యపై కత్తితో దాడి చేసిన ఘటనలో 2016లో కేసు నమోదయ్యింది. నేరం రుజువు కావడంతో సబ్ జడ్జి ఎస్.అరుణశ్రీ మూడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో పాముకాటుతో ఎక్కవ మంది మృతి చెందుతున్నారు. వర్షాలు పడుతుండడంతో రైతులు, వ్యవసాయ కూలీలంతా పొలం పనులకు వెళ్తూ అక్కడ పాముకాటుకు గురౌతున్నారు. 2014 నుంచి ఈ ఏడాది మే నెల వరకు 4,447 పాముకాటు కేసులు నమోదయ్యాయి. వీరిలో సుమారు 30% మృతిచెందారు. ప్రథమ చికిత్సపై అవగాహన లేకపోవడం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రధాన కారణాలు. జిల్లా ఆస్పత్రులలో వారానికి ఆరు పాముకాటు కేసులు నమోదౌతున్నాయి.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణచక్రవర్తిని, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయస్థానంలోని ఆయన ఛాంబర్‌లో కలిసి, పూలగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొద్దిసేపు జిల్లాకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆర్‌డిఓ ఎం.వి.సూర్యకళ కూడా తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆర్జేడీ విజయ భాస్కర్ అన్నారు. పార్వతిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంఈఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బడి బయట పిల్లలు బడికి వచ్చే చర్యలు చేపట్టాలని అందుకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయుల సమయపాలన ఎంఈఓ ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అలసత్వం వహిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మిగులు సీట్ల భర్తీకి నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ర్యాంకు కార్డులు ఆన్లైన్లో పొందుపరిచినట్లు ఆ పాఠశాలల జిల్లా కన్వీనర్ రమామోహిని తెలిపారు. 1:2 నిష్పత్తిలో విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలుస్తామన్నారు. ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న విద్యార్థులు జూలై 2, 3 తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు.
నెల్లిమర్ల మండలంలోని సారిపల్లికి చెందిన బోనుమహంతి విజయ్‌కుమార్(28) అనే యువకుడు కరెంట్ షాక్‌తో శుక్రవారం మృతి చెందాడు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో వైరింగ్ పని చేయడానికి వెళ్లిన విజయ్‌కుమార్‌కు ఇంటి పైనుంచి వెళ్తున్న హై టెన్షన్ వైరు తగలడంతో అక్కడికక్కడే పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. విజయ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విజయనగరం జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూ సేకరణకు అధికారులు సిద్ధమవుతున్నారు. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ప్రధానంగా జాతీయ రహదారుల నిర్మాణంపై చర్చ జరిగింది. పెదమానాపురం వద్ద గ్రామ కంఠానికి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉందని ఆర్డీవో సూర్యకళ కలెక్టర్ అంబేడ్కర్‌కు వివరించగా… వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన ఆదేశించారు.
ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్‌లు రాజీనామా చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో ఉండేవారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే AU వీసీ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేయగా.. ఆయన రాజీనామా చేశారు. ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా కిషోర్ బాబు బాధ్యతలు స్వీకరించారు.
Sorry, no posts matched your criteria.