India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాలకోడేరు మండలం మోగల్లులో అమెరికా పావురాలు సందడి చేస్తున్నాయి. గ్రామానికి చెందిన కంకిపాటి జోసఫ్ రెండు నెలల క్రితం తణుకు పట్టణం నుంచి రెండు పావురాలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. వాటిని అమెరికా పావురాలు అంటారని, ఎవరు దగ్గరకు తీసుకొన్నా వారితో మమేకం అవుతాయని ఆయన చెప్పారు. పెసలు, కొర్రలు వాటికి ఆహారంగా పెడుతున్నామని జోసేఫ్ వివరించారు.
ఉండ్రాజవరం మండలం సూర్యారావు పాలెం గ్రామంలో బుధవారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బాణసంచా తయారీ కేంద్రంలో పిడుగు పాటుపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఐదుగురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
ఉండ్రాజవరం మండలం సూర్యరావుపాలెం గ్రామంలో బుధవారం పిడుగుపాటుకు బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పండుగ సమయంలో ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
పెదవేగి మండలానికి చెందిన పదో తరగతి విద్యార్థినిపై వేధింపులకు పాల్పడుతున్న స్కూలు బస్సు డ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఏలూరు జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. పెదవేగి మండలానికి చెందిన బస్సు డ్రైవర్ వెంకటేశ్వరరావు బాలికను నిత్యం మానసికంగా వేధిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై మంగళవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
మొగల్తూరు మండలం మోడీ గ్రామానికి చెందిన మారెళ్ల రాంబాబు (48) హత్య కేసులో ఇద్దరిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. రాంబాబుకి జడ్డు నాయుడు, ఉంగరాల వీరన్నల మధ్య వివాదం చెలరేగడంతో ఆవేశానికి గురైన గురైన వారిద్దరూ రాంబాబును కొట్టారని తెలిపారు. ఈ ఘటనపై రాంబాబు భార్య వెంకట కుమారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరపరచగారిమాండ్ విధించారన్నారు.
ఏలూరు జిల్లాలో జనవరి, 2025 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో ఎస్ఎస్ఆర్ -2025 డ్రాఫ్ట్ పబ్లికేషన్ను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎస్ఎస్ఆర్ -2025లో భాగంగా 16,38,436 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఇందులో పురుష ఓటర్లు 7,99,781, మహిళలు 8,38,531, థర్డ్ జెండర్ ఓటర్లు 124 మంది ఉన్నారన్నారు.
చింతలపూడిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యానికి తల్లి, బిడ్డ మృతి చెందారు. బంధువుల కథనం ప్రకారం..ఈ నెల 27వ తేదీన వెంకటాపురం గ్రామానికి చెందిన కోడూరి పరిమళ కిరణ్ అనే గర్భవతి పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరింది. సిబ్బంది డెలివరీ చేయడంతో నవజాత శిశువు మృతి చెందింది. తల్లిని విజయవాడలో ఓ ఆసుపత్రికి తరలించగా వైద్యం పొందుతూ సోమవారం మృతి చెందింది. సంబంధిత అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు.
భీమవరానికి చెందిన యువకుడు యేసు భీమవరం నుంచి సైకిల్‌పై లద్దాక్‌కు 3500 కి.మీ. ప్రయాణించి ఎక్స్‌లో పోస్టు చేశారు. దానిపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘నేను ఇండియాకి వచ్చాక నిన్ను కలుస్తాను. సవాలుతో కూడిన నీ ప్రయాణం విజయవంతంగా ముగిసినందుకు అభినందనలు. ఇలాగే పట్టుదలతో నువ్వు లక్ష్యాన్ని చేరుకోవడాన్ని కొనసాగించు’ అని మంత్రి రిప్లై ఇచ్చారు.
ప.గో. జిల్లాలో కొద్ది రోజులుగా చిరుత సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ద్వారక తిరుమల, భీమడోలు మండలాల్లో 9 రోజుల క్రితం నుంచి చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు 5 సీసీ కెమెరాలు, 35 ట్రాప్ కెమెరాలు, బోన్లను సైతం ఏర్పాటు చేశారు. అయినా చిరుత చిక్కలేదు. ప్రస్తుతం చిరుత ఆ ప్రదేశాలలో ఉందా లేక వెళ్లిపోయిందా? అనేది అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది.
ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏలూరులోని ప్రభుత్వ డీఎల్టీసీ, ITI కళాశాలలో ఈనెల 30న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పి.రజిత తెలిపారు. ఈ జాబ్ మేళాలో 170 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీలలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 18 నుంచి 30 ఏళ్ల వయస్సు వారు అర్హులని తెలిపారు.
Sorry, no posts matched your criteria.