India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భీమవరం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఆర్ఓ ఉదయ భాస్కర్ రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తామని అన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, మున్సిపల్ కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా లక్కవరం పోలీసు స్టేషన్‌లో వైసీపీ నేతలపై కేసు నమోదైనట్లు ఎస్సై సుధీర్ తెలిపారు. వైసీపీ మండలాధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, మరో ముగ్గురిపై స్థానిక జనసేన నేత కంచర్ల మణికంఠ స్వామి ఫిర్యాదు చేయగా.. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలను దుర్భాషలాడటంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను దూషించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సై సుధీర్ తెలిపారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆదివారం చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. స్కూలు విద్యార్థులు డ్రాప్ అవుట్స్ లేకుండా చూడాలని స్కూలు ప్రధానోపాధ్యాయులకు తెలిపారు. పాఠ్య పుస్తకాలు సక్రమంగా పంపిణీ చేయాలని, మౌళిక వసతులు మెరుగు పరచాలని సూచించారు
జనాభా నియంత్రణకు ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై అవగాహన కల్పిస్తున్నా.. ఉమ్మడి ప.గో. జిల్లాలో ఆశించిన ఫలితాలు రావట్లే. ప్రధానంగా పురుషులు వేసక్టమీ ఆపరేషన్లకు ముందుకు రావట్లేదు.
☛ ప.గో. జిల్లాలో 2022 నుంచి ఇప్పటివరకు 12,352 మంది మహిళలు ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకోగా.. పురుషులు 108 మంది వేసక్టమీ చేయించుకున్నారు.
☛ ఏలూరు జిల్లాలో మహిళలు 10,224, పురుషులు 52మంది చేయించుకున్నారు.
ప.గో. వీరవాసరం మండలం తోలేరు పరిధి పడమటిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణం గత ప్రభుత్వంలో ప్రారంభించగా ఇంకా పూర్తికాలేదు. దీంతో స్థానికంగా ఉన్న రామాలయం వరండాలోనే విద్యార్థులకు బోధించాల్సిన పరిస్థితి. రూ.40 లక్షల వ్యయంతో చేపట్టిన పాఠశాల భవనం అందుబాటులోకి వస్తే ఈ ఇబ్బందులు తప్పనున్నాయి. MEO-2 శ్రీమన్నారాయణ మాట్లాడుతూ.. MLA దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
తాడేపల్లిగూడెం రామారావుపేటకు చెందిన మహ్మద్‌అలీ పెద్దమసీద్ కూడలిలోని ఓ దుకాణంలో రూ.400తో చికెన్ కొనుగోలుచేశాడు. ఇంటికెళ్లాక చూస్తే దుర్వాసన వచ్చింది. దీంతో షాప్‌కు వెళ్లి యజమానిని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించాడని బాధితుడు వాపోయాడు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదుచేయగా..తమ పరిధిలోకి రాదని చెప్పినట్లు సమాచారం. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ASR.రెడ్డిని వివరణకోరగా సదరు దుకాణాల్లో తనిఖీలు చేస్తామన్నారు.
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎవరిని నియమించాలన్న దానిపై కసరత్తు నడుస్తోంది. అయితే ఈ పదవిని జనసేన తీసుకునే విషయమై చర్చలు సాగుతున్నాయని ఆ పార్టీ అధినేత పవన్ తెలిపారు. అదే జరిగిదే తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్‌కు కేటాయిస్తారని టాక్. రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ రానున్నట్లు సమాచారం.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరం వద్ద శుక్రవారం నలుగురు యువకులు గల్లంతు కాగా అందరూ చనిపోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. పెదవేగి మండలం దుగ్గిరాలకు చెందిన 11 మంది యువకులు సముద్ర స్నానం కోసం రామాపురం వెళ్లారు. ఈ క్రమంలో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో తేజ(17), కిశోర్(18) అదే రోజు లభ్యం కాగా.. నితిన్ (18), అమల్ రాజు (18) మృతదేహాలు తాజాగా తీరానికి కొట్టుకొచ్చాయి. ఈ మేరకు కేసు నమోదైంది.
ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డీఎల్‌టీసీ సహాయ సంచాలకులు ఎస్.ఉగాది రవి తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాశ్ యోజన కింద ఫీల్డ్ టెక్నీషియన్-ఎయిర్ కండిషనర్ కోర్సులో 3 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పదో తరగతి, ఆ పైన ఉత్తీర్ణులైన వారు, 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు అర్హులని తెలిపారు. చివరి తేదీ 28-06-2024.
➤ ప.గో కలెక్టర్ సుమిత్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో టెక్నికల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్‌గా ఉన్న సి.నాగారాణి కలెక్టర్‌గా రానున్నారు. సుమిత్‌ను చిత్తూరు కలెక్టర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
➤ ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్‌ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా ఉన్న వెట్రీ సెల్వీ ఏలూరు కలెక్టర్‌గా రానున్నారు.
Sorry, no posts matched your criteria.