WestGodavari

News May 25, 2024

ఏలూరు అత్యాచార ఘటనపై స్పందించిన షర్మిల

image

ఏలూరు జిల్లా మండవల్లిలో టెన్త్ విద్యార్థినిపై క్లాస్ రూంలోనే తోటి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. దీనిపై ‘X’ వేదికగా వైఎస్.షర్మిల స్పందించారు. ‘లండన్‌లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న CM జగన్‌కు రాష్ట్రంలో మహిళల ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవా..?. ఈ ఘటనపై మీ మహిళా మంత్రులు , నాయకులు సిగ్గుతో తల దించుకుంటారో, సిగ్గు లేకుండా మిన్నకుండుపోతారో..? ప్రజలు గమనిస్తున్నారు’ అని అన్నారు.

News May 25, 2024

5 రోజుల పాటు చేబ్రోలు రైల్వేగేటు మూసివేత

image

చేబ్రోలు రైల్వే గేటును ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మూసివేయనున్నారు. ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ కారణంగా తాత్కాలికంగా గేటును మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. కాబట్టి దూబచర్ల, జంగారెడ్డిగూడెం వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News May 24, 2024

ప.గో.: బ్యాంకులో మహిళకు గుండెపోటు.. కుప్పకూలి మృతి

image

తణుకు పట్టణంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆవరణలో ఓ మహిళ గుండెపోటుతో మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఆలపాటి లక్ష్మీనారాయణమ్మ తన భర్తతో కలిసి శుక్రవారం నగదు లావాదేవీల నిమిత్తం బ్యాంకుకు వచ్చారు. ఈ క్రమంలో లక్ష్మీనారాయణమ్మ (55) గుండెపోటుతో బ్యాంకులోనే కుప్పకూలి మృతి చెందారు.

News May 24, 2024

భీమవరం: కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకిన స్టూడెంట్

image

భీమవరంలోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి అదే కాలేజ్ భవనం పైనుంచి దూకేసిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. మొదటి నుంచి చదువులో ప్రతిభ కనబరుస్తూ వచ్చిన అతడి ప్రవర్తనలో ఇటీవల మార్పు వచ్చింది. రోజులాగే బుధవారం కళాశాలకు వెళ్లిన విద్యార్థి.. హఠాత్తుగా భవనం పైనుంచి దూకేశాడు. తీవ్రగాయాలు కాగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా.. దీనిపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

News May 24, 2024

ప.గో: ఓట్ల లెక్కింపు.. 1PMకు తొలి ఫలితం!

image

ఓట్ల లెక్కింపుపై ఉమ్మడి ప.గో.లో ఉత్కంఠ నెలకొంది. ప.గో జిల్లాలో తొలి ఫలితం నరసాపురం కాగా.. ఏలూరు జిల్లాలో ఏలూరు అసెంబ్లీ ఫలితం ఫస్ట్ వెల్లడికానుంది. నియోజకవర్గానికి 14 టేబుల్స్‌ చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు-16 రౌండ్లు, ఉంగుటూరు-16, కైకలూరు-18, దెందులూరు-18, చింతలపూడి-21, పోలవరం-22, నూజివీడు-22 రౌండ్లలో ఫలితాలు తేలనున్నాయి. తొలి ఫలితం 1PM, తుది ఫలితం 6PMకు వెల్లడికానున్నట్లు తెలుస్తోంది.

News May 24, 2024

ఏలూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం గండిగూడెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న పాల వ్యాన్‌ను ద్విచక్రవాహనం వెనకనుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. కాగా.. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. 

News May 24, 2024

ఎన్నికల కేసుల నుంచి చింతమనేనికి ఊరట

image

ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో నిందితుడిగా ఉన్న దెందులూరు మాజీ MLA చింతమనేని ప్రభాకర్‌కు తాత్కాలిక ఊరట లభించింది. జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జూన్ 4న కౌంటింగ్ ఉన్నందున అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలన్న పిటిషనర్ల అభ్యర్థనతో న్యాయస్థానం ఏకీభవించింది. వారి కదలికలపై పోలీసులతో నిఘా ఉంచాలని ఈసీని కోర్టు ఆదేశించింది.

News May 24, 2024

గంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలి: ఏలూరు డీఈవో

image

ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసిన 50 పరీక్ష కేంద్రాలలో టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని డీఈవో అబ్రహం తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 11,500 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఈ నేపథ్యంలోనే ఏలూరులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదులు ఉంటే నెం.8121840400కు ఫోన్ చేయాలన్నారు. గంట ముందు పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని విద్యార్థులకు సూచించారు.

News May 24, 2024

ప.గో: సప్లిమెంటరీ పరీక్షలు.. 30ని ముందే అనుమతి

image

ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు అధికారులు పలు సూచనలు చేశారు. ఏలూరు జిల్లాలో ఈ పరీక్షలకు 27 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇంటర్-8,664 మందికి ఉ.9గంటల నుంచి మ.12 వరకు, సెకండ్ ఇంటర్-4,133 మందికి మ.2:30 నుంచి సా.5: 30 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 30 నిమిషాల ముందే కేంద్రంలోకి అనుమతి ఇస్తామన్నారు. ఫిర్యాదులుంటే 08812 230197కు ఫోన్ చేయాలన్నారు.

News May 24, 2024

ప.గో.: సరిగ్గా 11 రోజులు.. ఉత్కంఠ

image

ఎన్నికల ఫలితాలకు సరిగ్గా నేటి నుంచి 11 రోజులు ఉంది. ఒక్కోరోజు గడుస్తున్నా కొద్దీ అభ్యర్థులు సహా.. పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో ఎక్కడ చూసినా ఫలితాలపైనే చర్చ జరుగుతోంది. పలుచోట్ల ఎవరికి వారు గెలుపుపై అంచనాలు వేస్తూ బెట్టింగులు వేస్తున్నారు. మరి మన ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో ఎవరు గెలుస్తారో చూడాలి. మరోవైపు అధికార యంత్రాంగం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద నిరంతరం భద్రత చర్యలు తీసుకుంటోంది.