WestGodavari

News June 19, 2024

ప.గో: బ్యాక్‌లాగ్ అడ్మిషన్స్‌కు ప్రవేశ పరీక్ష

image

ప.గో జిల్లా నరసాపురం మండలంలో మహాత్మ జ్యోతిబాఫులే బీసీ గురుకుల పాఠశాల (బాలికలు)లో 6 నుంచి 9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను రిజర్వేషన్ అనుసరించి ఈనెల 20వ తేదిన 6, 8 తరగతులకు, 21వ తేదిన 7, 9 తరగతులకు రాత పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కన్వీనర్, ప్రిన్సిపల్ Ch.K.శైలజ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఆమె సూచించారు.

News June 18, 2024

ఏలూరు: కదులుతున్న రైలు నుంచి పడి దుర్మరణం

image

ఏలూరు జిల్లా భీమడోలు మండలంలోని పాతూరు రైల్వే గేట్ సమీపంలో మంగళవారం కదులుతున్న రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ నరసింహారావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు బిహార్ రాష్ట్రానికి చెందిన సుజన్ మహాల్దార్(24)గా గుర్తించామన్నారు. డెడ్‌బాడీని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

News June 18, 2024

ఇంటర్ సప్లీ ఫలితాల్లో ఏలూరు జిల్లాకు 19వ స్థానం

image

ఇంటర్ సెకండీయర్ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో ఏలూరు జిల్లా రాష్ట్రంలో 19వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3096 మంది పరీక్ష రాయగా, 1666 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 54 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఒకేషనల్ కోర్సులో ఏలూరు జిల్లా 11వ స్థానంలో నిలిచింది. మొత్తం 541 మంది పరీక్ష రాయగా, 322 మంది పాస్ అయ్యారు. 60 శాతం ఉత్తీర్ణత సాధించారు.

News June 18, 2024

కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరసాపురం MP

image

నరసాపురం MP భూపతిరాజు శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం దక్కిన విషయం తెలిసిందే. కాగా ఆయన నేడు ఢిల్లీలో మంత్రి బాధ్యతలు స్వీకరించారు. 1980 దశకంలో ఏఐఎస్‌ఎఫ్‌లో చేరి వామపక్ష విద్యార్థి నాయకుడిగా ప్రభుత్వ వ్యతిరేఖ విధానాలపై పోరాడారు. ఆ తర్వాత బీజేపీలో చేరి వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన తాజాగా నరసాపురం నుంచి 2,76,802 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే.

News June 18, 2024

ఏలూరు: చేతబడి నెపం.. కత్తితో దాడి

image

పోలవరం మండలం ఎల్లండిపేటలో కత్తిపోట్లు కలకలం రేపాయి. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలోని కనకదుర్గమ్మ ఆలయ పూజారి జొన్నడ పేరస్వామిపై అదే గ్రామానికి చెందిన చిక్కాల ఏసుబాబు కత్తితో దాడి చేశాడు. చేతబడి నెపంతోనే దాడికి పాల్పడ్డాడని తెలిపారు. బాధితుడిని పోలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్సచేసి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు. పోలవరం పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

News June 18, 2024

ఏలూరు: కన్సల్టెన్సీ పేరుతో మహిళ మోసం

image

సౌజన్య అనే మహిళ మరోవ్యక్తితో కలిసి విజయవాడలో ఓకన్సల్టెన్సీ ద్వారా కొంతమంది యువతను విజిటింగ్ వీసా ద్వారా కెనడా పంపించారు. అక్కడ సౌజన్యకు పార్ట్‌నర్‌తో విబేధాలు రాగా ఏలూరు రోడ్డులో సొంతంగా కన్సల్టెన్సీ ఓపెన్ చేసింది. విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తానని గుంటూరు, కృష్ణా, ఏలూరుకు చెందిన 40మంది నుంచి రూ.లక్షల్లో వసూలుచేసింది. బాధితులు విజయవాడ CI రామకృష్ణను ఆశ్రయించగా ఆయన కేసును మాచవరం పోలీసులకు అప్పగించారు.

News June 18, 2024

ఏలూరు: ఘనంగా కూతురి బర్త్‌డే.. అంతలోనే నాన్న మృతి

image

ద్వారకాతిరుమల మండలం దొరసానివాడు గ్రామానికి చెందిన సంజయ్ కుమార్(24) ఓ పాఠశాల బస్సు డ్రైవర్‌. ఐదేళ్ల క్రితం నల్లజర్ల మండలం పోతవరానికి చెందిన తేజాను లవ్‌మ్యారేజ్ చేసుకున్నాడు. ఇద్దరికీ తల్లిదండ్రులు లేరు. ఆదివారం తమ కుమార్తె పుట్టినరోజు కావడంతో పోతవరం వెళ్లి వేడుకలు చేసుకొని తిరిగి ఇంటికి వచ్చారు. రాత్రివేళ ఇంట్లో కొత్త బల్బ్ పెడుతుండగా సంజయ్ షాక్‌కు గురై చనిపోయాడు. కాగా తేజ ప్రస్తుతం గర్భిణి.

News June 18, 2024

ప.గో.: ఈ నెల 21 నుంచి పలు రైళ్లు దారి మళ్లింపు

image

విజయవాడ రైల్వే డివిజన్‌లోని పలుచోట్ల ట్రాక్‌పనులు చేపడుతున్నందున ఈ నెల 21 నుంచి జులై నెలాఖరు వరకు పలు రైళ్లను దారి మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు. కొన్నిరైళ్లను రామవరప్పాడు వరకు నడపనున్నట్లు చెప్పారు. రోజూ మధ్యాహ్నం 3 గంటలకు నరసాపురం నుంచి విజయవాడ వెళ్లే డెమో రైలును రామవరప్పాడు వరకే నడపుతామన్నారు. ఆ రైలు తిరిగి రాత్రి 8 గంటలకు రామవరప్పాడులో బయల్దేరి అర్ధరాత్రి 12గంటలకు నరసాపురం చేరుతుందన్నారు

News June 18, 2024

ప.గో.: పార్ట్‌టైం ఉద్యోగం పేరుతో చీటింగ్

image

నరసాపురానికి చెందిన నరేశ్ ఓ యాప్‌లో పార్ట్‌ టైం ఉద్యోగ ప్రకటన చూసి నిర్వాహకులను సంప్రదించాడు. యాప్‌లో వచ్చే ప్రచారాలు చూస్తే నగదు ఇస్తామని వారు నమ్మించారు. తొలుత నరేశ్ ఖాతాలో రూ.10వేలు జమచేశారు. ఆ తర్వాత నగదురాకపోగా నరేశ్ ప్రశ్నించాడు. కొంత నగదుచెల్లిస్తే బకాయి మొత్తం ఇస్తామని చెప్పారు. అదినమ్మి నిర్వాహకుల ఖాతాల్లో రూ.6.86లక్షల వరకు జమచేశాడు. చివరికి మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదుచేశాడు.

News June 18, 2024

ప.గో: ముగిసిన రేషన్ పంపిణీ

image

పశ్చిమ గోదావరి జిల్లాలో జూన్ నెల రేషన్ పంపిణీ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం లోపు రిటర్న్ స్టాక్ తీయాల్సిందిగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో జులై నెల నుంచి ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానంపై ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.