WestGodavari

News June 17, 2024

ఉండిలో చంద్రబాబు, RRR ఫ్లెక్సీ చించివేత

image

సార్వత్రిక ఎన్నికల్లో ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించిన కనుమూరి రఘరామకృష్ణరాజు ఫ్లెక్సీ చినిగి ఉండటం కలకలం రేపింది. MLAగా గెలిచినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉండి మండలం చినపుల్లేరు గ్రామ శివారు తల్లమ్మ చెరువు వద్ద కొందరు నేతలు RRR ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

News June 17, 2024

ఏలూరు: చర్చిలో బాలికకు పెళ్లి.. పోలీసుల ఎంట్రీ

image

ఏలూరు జిల్లా గణపవరంలోని చర్చిలో సోమవారం బాల్య వివాహం జరుగుతుందని సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు వెళ్లి అడ్డుకున్నారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ చంద్రావతి తెలిపిన వివరాల ప్రకారం.. వీరవాసరం గ్రామానికి చెందిన 24ఏళ్ల యువకుడికి, నిడమర్రు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) వివాహం చేస్తున్నారు. సమాచారం రావడంతో అధికారులు వెళ్లి పెళ్లిని నిలిపివేశారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

News June 17, 2024

ప.గో: పంట పొలంలోకి దూసుకెళ్లిన కారు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో ఓ కారు పంట పొలంలోకి దూసుకెళ్లింది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి తిరిగి వెళుతుండగా లొల్ల-వాడపల్లి కొత్త రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. కారులోని ప్రయాణికులు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వారుగా స్థానికులు తెలిపారు. ప్రయాణికులు వెంటనే కారులోంచి బయటకు వచ్చేశారు. స్థానికుల సహాయంతో కారును పంట పొలంలోంచి బయటకు తీశారు.

News June 17, 2024

చంద్రబాబు కల త్వరలో సఫలం కానుంది: బొలిశెట్టి

image

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న చంద్రబాబు కల త్వరలోనే సఫలం కానున్నదని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన చంద్రబాబుకు సోమవారం బొలిశెట్టి శ్రీనివాస్ ఇతర ఎమ్మెల్యేలతో కలిసి స్వాగతం పలికారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్ సందర్శన సిద్ధాంతం పాటించడం ఆయన నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. టీడీపీ నేత వలవల బాబ్జీ తదితరులు ఉన్నారు.

News June 17, 2024

‘పోలవరం’ అనేక సంక్షోభాలు ఎదుర్కొంది: చంద్రబాబు

image

పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సోమవారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందన్నారు. టీడీపీ హాయంలోనే 72% ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రివర్స్ టెండరింగ్ చేపట్టి ప్రాజెక్టు పనులను నిలిపివేశారన్నారు. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారని మండిపడ్డారు.

News June 17, 2024

ఏలూరు: సంతానం లేని వారికి GOOD NEWS

image

సంతానం లేనివారికి ఏలూరు జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఓ దారి చూపుతోంది. శాఖ ఆధీనంలో ఏలూరులో శిశుగృహం నిర్వహిస్తోంది. వివిధ కారణాలతో నిరాశ్రయులైన చిన్నారులను ఇక్కడ చేర్చుకొని ఆలనాపాలనా చూస్తోంది. అయితే సంతానం లేనివారెవరైనా వస్తే నిబంధనల మేరకు దత్తత ఇస్తున్నారు. గత 14 ఏళ్లలో 82 మందిని దత్తత ఇచ్చారు. www.cara.nic.inలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఐదేళ్లలోపు 8 మంది పిల్లలున్నారు.

News June 17, 2024

నరసాపురం MP.. కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం రేపే

image

నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ కేంద్ర సహాయ మంత్రిగా మంగళవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11:11 గంటలకు, 12:15 గంటలకు రెండు శాఖల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. భీమవరంలో ఉన్న ఆయన సోమవారం (నేడు) ఢిల్లీ వెళ్తున్నారు. తిరిగి 20వ తేదీన భీమవరం రానున్నారు. 

News June 17, 2024

పోలవరంలో దొంగనోట్ల కలకలం

image

ఏలూరు జిల్లా పోలవరంలో ఆదివారం దొంగ నోట్లు కలకలం రేపాయి. నేడు సీఎం పర్యటన నేపథ్యంలో కాఫీ హోటళ్లు, తినుబండారాల షాపులు, కిరాణా దుకాణాలు కిటకిటలాడాయి. లావాదేవీలు సమయంలో వచ్చిన కొత్తనోట్లను ఆ తర్వాత మరొకరికి ఇచ్చే సమయంలో దొంగనోట్లని తేలడంతో తాము మోసపోయినట్లు వ్యాపారులు గుర్తించారు. సుమారు ఏడుగురు వ్యాపారులు మోసపోయినట్లు గుర్తించారు.

News June 17, 2024

ప.గో.: పవన్ గెలుపు.. మోకాళ్లపై మెట్లెక్కిన అభిమాని

image

ప.గో. జిల్లా పెరవలి మండలం నడుపల్లి గ్రామానికి చెందిన పువ్వుల సత్తిబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరాభిమాని. కాగా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ గెలిస్తే ద్వారకాతిరుమలకు కుటుంబీకులతో పాదయాత్రగా వస్తానని మొక్కుకున్నాడు. పవన్ గెలిచిన నేపథ్యంలో పాదయాత్రగా వెళ్లి ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయం ముందున్న 108 మెట్లను మోకాళ్లపై ఎక్కి మొక్కు తీర్చుకున్నాడు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నాడు.

News June 17, 2024

పోలవరంపై CM స్పెషల్ ఫోకస్

image

CMగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల తీరును తెలుసుకునేందుకు నేడు రానుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. కాగా ప్రాజెక్టు కోసం దాదాపు 30 గ్రామాల్లో 12వేల ఎకరాలు సేకరించారు. 25వేల కుటుంబాలను నిర్వాసితులుగా ప్రకటించారు. కాగా ఇప్పటివరకు 200 కుటుంబాలకు మాత్రమే పరిహారం అందిందనేది నిర్వాసితుల మాట. తాజాగా సీఎం ప్రత్యేక దృష్టి సారించటంతో తమకు న్యాయం జరుగుతుందని వారు ధీమాగా ఉన్నారు.