WestGodavari

News June 16, 2024

రేపు పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలనకు CM చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్నట్లు MLA చిర్రి బాలరాజు తెలిపారు. ప్రమాణ స్వీకారం తర్వాత CMగా ఆయన సందర్శించే తొలి ప్రాజెక్ట్ ఇదే కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఉదయం 9.30 గంటలకే ఆయన పోలవరం చేరుకొని అంతా తిరిగి ప్రతి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. తర్వాత అక్కడే ప్రాజెక్ట్, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. దీంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

News June 16, 2024

MLAగా విజయం.. కాలినడకన ద్వారకాతిరుమలకు

image

ఏలూరు జిల్లా పోలవరం MLAగా చిర్రి బాలరాజు విజయం సాధించిన నేపథ్యంలో ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయానికి స్థానిక టీడీపీ, జనసేన నాయకులు శనివారం కాలినడక బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి గెలిస్తే పాదయాత్రగా వస్తామని మొక్కుకున్నట్లు తెలిపారు. నరసింహమూర్తి, శ్రీను, ప్రసాద్, కృష్ణ తదితరులు ఉన్నారు.

News June 15, 2024

నాకు ప్రాణహాని ఉంది: నిర్మలగిరి డైరెక్టర్ జాన్ పీటర్

image

తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ప్రాణహాని ఉందని దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి డైరెక్టర్ జాన్ పీటర్ భయాందోళన వ్యక్తం చేశారు. కొందరు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇటీవల శ్రీకాంత్ అనే వ్యక్తి ఫోన్ చేసి రూ.10లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు తెలిపారు. డబ్బులు ఇవ్వకుంటే హానికర చర్యలకు పాల్పడతానని, పుణ్యక్షేత్రంపై అసత్య వీడియోలు బయటపెడతానని బెదిరిస్తున్నారని పీటర్ వెల్లడించారు.

News June 15, 2024

మెగా డీఎస్సీ: ప.గో@400.. ఏలూరు@800..!

image

CMగా చంద్రబాబు ‘మెగా డీఎస్సీ’పై సంతకం చేయడంతో అభ్యర్థులు మళ్లీ పుస్తకాలు పడుతున్నారు. ఎలాగైనా కొలువుకొట్టాలని కోచింగ్‌ల కోసం పట్టణాల బాట పడుతున్నారు. మొత్తం 16వేలకు పైగా పోస్టులు భర్తీ చేయనుండగా..
➤ ప.గో జిల్లాలో 400లకు పైగా పోస్టుల భర్తీకి ఛాన్స్ ఉంది. ఇక్కడ దాదాపు 13వేల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.
➤ ఏలూరు జిల్లాలో సుమారు 800 పోస్టుల భర్తీకి అవకాశం ఉండగా.. 10,500మంది వేచి చూస్తున్నారు.

News June 15, 2024

మైనర్లకు పెళ్లి.. బాలిక తల్లిదండ్రుల అరెస్ట్

image

బాలికకు పెళ్లి చేసిన తల్లిదండ్రులను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగర శివారుకు చెందిన బాలుడు, బాలిక ప్రేమించుకున్నారు. బాలిక గర్భం దాల్చడంతో ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసి పేరెంట్స్ గతేడాది Aug 26న వారికి పెళ్లి చేసేందుకు నిర్ణయించగా అధికారులు వెళ్లి అడ్డుకున్నారు. ఆ తర్వాత మూడ్రోజులకే వారికి పెళ్లి చేయగా.. SP ఆదేశాల మేరకు బాలిక పేరెంట్స్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు.

News June 15, 2024

ప.గో: దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం

image

ప.గో జిల్లా అత్తిలి మండలం స్కిన్నెరపురానికి చెందిన ఏసురాజు అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(6)ను అత్యాచారం చేశాడనే ఫిర్యాదు మేరకు అతడిని అరెస్టు చేశామని SI రాంబాబు తెలిపారు. బాలిక ఆడుకుంటున్న సమయంలో ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు తెలిపారు. ఆమెకు కడుపులో నొప్పి రావడంతో తల్లి అసలు విషయం తెలుసుకుని ఈనెల 9న ఫిర్యాదు చేసింది. దీంతో ఏసురాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించామని అన్నారు.

News June 15, 2024

ఏలూరు: మసీదుల వద్ద కట్టదిట్టమైన బందోబస్తు: SP

image

ఏలూరు ఈ నెల 17వ తేదీన బక్రీద్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఎస్పీ మేరీ ప్రశాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన మసీదులు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు. మతపెద్దలతో సమావేశమై మత సామరస్యాన్ని కాపాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలన్నారు. పోలీసు అధికారులు ముస్లిం పెద్దలతో సమావేశాలు ఏర్పాటుచేసి అవగాహన కల్పించాలన్నారు.

News June 14, 2024

ప.గో.: ఊపందుకోనున్న పోలవరం

image

పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలన్నది ఉమ్మడి ప.గో. జిల్లా ప్రజల కళ. ఏలూరు జిల్లా పరిధిలోని పోలవరం సమీపంలో 2004లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 2015లో జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపుపొందింది. అయితే తాజాగా మన జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడిని జలవనరుల శాఖ వరించింది. దీంతో జిల్లా ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ప్రాజెక్టు పనులు పరుగులు పెడతాయని, నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని చర్చ జరుగుతోంది.
– మీ కామెంట్..?

News June 14, 2024

ప.గో.: అప్పట్లో ముగ్గురు.. ఇప్పుడు ఇద్దరు

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 మంది MLAలలో గత వైసీపీ ప్రభుత్వంలో ముగ్గురు MLAలు మంత్రులుగా వ్యవహరించారు. 2019లో తాడేపల్లిగూడెం నుంచి గెలుపొందిన కొట్టు సత్యనారాయణ దేవాదాయశాఖ, కొవ్వూరు నుంచి MLAగా గెలిచిన తానేటి వనితకు హోంశాఖ, తణుకు MLA కారుమూరి వెంకట నాగేశ్వరరావు పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రిగా పనిచేశారు. తాజాగా నిమ్మలకు జలవనరులు, దుర్గేశ్‌ పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు.

News June 14, 2024

ప.గో.: ఏ మంత్రికి ఏ శాఖలు అంటే..?

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 MLAలలో ఇద్దరికి మంత్రి పదవులు వరించిన విషయం తెలిసిందే. కాగా పాలకొల్లు MLA నిమ్మల రామానాయుడికి జలవనరుల అభివృద్ధి శాఖలు, నిడదవోలు MLA కందుల దుర్గేశ్‌కు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు.