WestGodavari

News October 15, 2024

ప.గో: మామిడి చెట్టు పడి మహిళ మృతి

image

దేవరపల్లి మండలం అచ్చయ్యపాలెం గ్రామంలో మంగళవారం విషాద ఘటన నెలకొంది. గ్రామానికి చెందిన సుబ్బయ్యమ్మ పై ప్రమాదవశాత్తు మామిడి చెట్టు మీద పడడంతో మృతి చెందిందని స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 15, 2024

ఏలూరు జిల్లాలో టెట్ పరీక్షలకు 48 మంది గైర్హాజర్

image

ఏలూరు జిల్లాలో నిర్వహించే టెట్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయని విద్యాశాఖ అధికారి అబ్రహం మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 186 మంది విద్యార్థులకు 158 మంది, మధ్యాహ్నం 186 మందికి 166 మంది హాజరయ్యారని తెలిపారు. ఉదయం 28 మంది, మధ్యాహ్నం 20 మంది గైర్హాజరయ్యారని చెప్పారు.

News October 15, 2024

బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో ఉండి ఎమ్మెల్యే

image

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో దిగిన చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి-2898AD చిత్రం షూటింగ్ జరుగుతున్న సందర్భంలో అశ్వథ్థామ పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్‌ను కలిసి కాసేపు ముచ్చటించారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

News October 15, 2024

పట్టభద్రుల స్థానాన్ని ఐక్యంగా పోరాడి గెలిపించాలి: మంత్రి నిమ్మల

image

ఉమ్మడి తూర్పు – పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎంఎల్సీ స్థానాన్ని కూటమి నేతలు ఐక్యంగా పనిచేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. రాజమండ్రిలో పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు, సన్నాహ కార్యక్రమం లో భాగంగా ఎన్డీయే పార్టీ నేతల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సమావేశానికి టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

News October 15, 2024

ఉమ్మడి ప.గో జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం

image

ఉమ్మడి ప.గో జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప.గో జిల్లాకు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను నియమించారు. అలాగే ఏలూరు జిల్లాకు మంత్రి నాదెండ్ల నియమితులయ్యారు. వారు జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యకలాపాలలో భాగస్వాములు కానున్నారు.

News October 15, 2024

ఏలూరు జిల్లాలో 12 మంది మహిళలకు వైన్ షాపులు

image

ఏలూరు జిల్లాలో సోమవారం జరిగిన మద్యం దుకాణాల లాటరీ విధానంలో పలువురు మహిళలు దుకాణాలను దక్కించుకున్నారు. జిల్లాలో 144 మద్యం దుకాణాలకు 5,499 మంది టెండర్లు దాఖలు చేయగా, 144 మద్యం షాపులకు లక్కీడిప్‌ ద్వారా 144 మందిని ఎంపిక చేసినట్లు కలెక్టర్‌ చెప్పారు. అయితే వీరిలో 12 మంది మహిళలు మద్యం దుకాణాలను లాటరీ విధానంలో కైవసం చేసుకున్నారు.

News October 14, 2024

ఏలూరు ఎస్పీ పరిష్కార వేదికకు 45 ఫిర్యాదులు

image

ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 45 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిని సమగ్రంగా విచారించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

News October 14, 2024

నరసాపురం: మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దు

image

సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని నరసాపురం ఆర్డీవో దాసి రాజు మత్స్యకారులకు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్ర అలలు ఎగసి పడుతాయని, మళ్లీ ప్రకటన వెలువడే వరకూ చేపల వేటకు వెళ్లొద్దని పేర్కొన్నారు. అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వారికి హెచ్చరికలు జారీ చేశారు.

News October 14, 2024

బందోబస్తును పరిశీలించిన ఏలూరు ఎస్పీ

image

ఏలూరు జిల్లా వైన్స్ లాటరీ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన చలసాని గార్డెన్‌లోని బందోబస్తు ప్రదేశాన్ని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం సందర్శించారు. పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, ఎక్సైజ్ శాఖ అధికారులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

News October 13, 2024

ఈనెల 14 నుంచి 20 వరకు గ్రామస్థాయిలో పల్లె పండుగ

image

ఈనెల 14 నుంచి 20 వరకు ప.గో జిల్లాలో గ్రామ స్థాయిలో పల్లె పండగ పంచాయతీ వారోత్సవాలు జరగనున్నాయి. దీంతో సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకొని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. జిల్లాలో 423 పనులను రూ.51.03 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు తెలిపారు. వీటిలో 351 సీసీ రోడ్లు రూ.41.94 కోట్లు, 5 BT రోడ్స్ రూ.2.46 కోట్లు, 67CC డ్రైన్స్ రూ.6.63 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.