India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప.గో జిల్లా తణుకుకు చెందిన వ్యక్తి రెండ్రోజులుగా కనిపించడంలేదని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆలమూరివారి వీధిలో నివాసం ఉంటున్న అరిపాక హరీశ్ ఈనెల 11న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అదే రోజు రాత్రి హరీశ్ భార్య జయశ్రీకి వీడియో కాల్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో ఆందోళన చెందిన జయశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
35ఏళ్ల తర్వాత ‘నూజివీడు’కు మంత్రి పదవి దక్కింది. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 1952-72 వరకు వరుసగా 5సార్లు MLAగా గెలిచిన డా.ఎంఆర్ అప్పారావు, తర్వాత 1978, 1989లో గెలుపొందిన పాలడుగు వెంకటరావు మాత్రమే మంత్రులుగా పని చేశారు. ఇన్నేళ్ల తర్వాత తాజాగా కొలుసు పార్థసారథికి మంత్రి పదవి దక్కింది. రాజకీయ నేపథ్యమున్న కుటుబం నుంచి వచ్చిన కొలుసు.. 2009లో YSR, కిరణ్ కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.
పాలకొల్లు నియోజకవర్గానికి 30 ఏళ్ల తర్వాత మరోసారి మంత్రి పదవి దక్కింది. 1989లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హరిరామజోగయ్య మర్రి చెన్నారెడ్డి జట్టులో పౌరసంబంధాలు, అటవీశాఖ మంత్రిగా చేశారు. తర్వాత కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో చిన్నతరహా పరిశ్రమలు, భూగర్భగనుల శాఖ దక్కింది. ఆ తర్వాత ఆరుగురు ఎమ్మెల్యేలు ఎన్నికైనా మంత్రి పదవి దక్కలేదు. తాజాగా హాట్రిక్ వీరుడు రామానాయుడు మంత్రిగా ప్రమాణం చేయడం విశేషం.
టౌన్ రైల్వే స్టేషన్‌లో బుధవారం మధ్యాహ్నం నర్సాపూర్ నుంచి గుంటూరు వెళ్లే పాసింజర్ ఎక్కే క్రమంలో ఒక వ్యక్తి జారి మధ్యలో ఇరుక్కుపోయాడు. దీంతో గమనించిన రైల్వే సిబ్బంది ఫ్లాట్ ఫామ్‌ను బద్దలు కొట్టి అతడిని రక్షించారు. ఆ వ్యక్తికి ఏమి కాకపోవడంతో రైల్వే సిబ్బంది ప్రయాణకులు అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
నరసాపురం పట్టణం రుస్తుంబాదకు చెందిన మైక్రో ఆర్టిస్ట్, చిత్రకారుడు కొప్పినీడి విజయ్ మోహన్ తన ప్రతిభను చూపించారు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ విజయవాడలో మంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంగా వాటర్ కలర్స్ ఉపయోగించి చిత్రాన్ని గీశాడు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అని ప్రత్యేకంగా రాశారు. ఈ చిత్రాన్ని గీసిన విజయ్ మోహన్‌ను పలువురు అభినందించారు.
పాలకోడేరు మండలం గరగపర్రు వీఆర్వోగా పని చేస్తున్న సంపద స్వామి నాయుడు (48) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. రెండు రోజుల క్రితం ఆయనకు మైల్డ్ స్ట్రోక్ రావడంతో భీమవరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం స్ట్రోక్ ఎక్కువే మృతి చెందడం జరిగింది. దీనిపై వీఆర్వోల సంఘం, భీమవరం ఎమ్మార్వో ఆర్ఐలు తమ సంతాపం వ్యక్తం చేశారు.
కలెక్టరేట్ ఆవరణలో జూన్ 15వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి వరలక్ష్మి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2 ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాలు కలవన్నారు. ఆసక్తిగల 8వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ పాసైన 35 సంవత్సరాల లోపు వారు జాబ్ మేళాలో పాల్గొనాలన్నారు. జీతం రూ 11 వేల నుంచి 13 వేల వరకు ఉంటుందన్నారు. ఉద్యోగం సాధించిన వారికి భోజనం, వసతి కలదన్నారు.
ప.గో జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాలోని పీహెచ్సీల వైద్య అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో నూరు శాతం డెలివరీలు జరగాలని, తక్కువగా డెలివరీలు జరుగుతున్న ఆస్పత్రులను సమీక్షించుకొని తగిన చర్యలు తీసుకోవాలని డీఎం అండ్ హెచ్‌ఓకు సూచించారు. పేషెంట్ల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకోవాలని అన్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి బరిలో నిలిచిన వంగలపూడి అనిత 25248 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. కాగా తాజా ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి తరఫున బరిలో నిలిచి 1,20,042 ఓట్లు సాధించి 43727 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు.
రాష్ట్ర మంత్రిగా నిడదవోలు MLA కందుల దుర్గేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం మండలంలోని కేసరపల్లిలో ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంలో జిల్లాకు చెందిన ఆయన అభిమానులు, జన సైనికులు, వీరమహిళలు నినాదాలు చేశారు.
Sorry, no posts matched your criteria.