WestGodavari

News May 16, 2024

ఏలూరు: రోడ్డు ప్రమాదంలో ట్రాక్‌మెన్ మృతి

image

ఏలూరు జిల్లా భీమడోలు మండలం సోరప్పగూడెం రైల్వే వంతెనపై యాక్సిడెంట్ జరిగింది. రైల్వే ట్రాక్‌మెన్ బద్రి లోకేష్(35) బైక్‌పై వెళ్తుండగా.. మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లోకేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్‌పై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. వారిలో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను 108లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News May 16, 2024

ఏలూరు: పొలంలో వింత జంతువు అడుగులు

image

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి శివారు ఎర్ర కాలువ జలాశయం కుడి కాలవ సమీపంలో రైతు పి.కొండబాబు పొలంలో వింత జంతువు అడుగుజాడలను గుర్తించారు. ఉప తహశీల్దార్ రమేష్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను అటవీ శాఖ అధికారులకు పంపించారు. దీనిపై జంగారెడ్డిగూడెం ఇన్‌ఛార్జి డీఆర్‌ఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అడుగు గుర్తులను పరిశీలిస్తామన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

News May 16, 2024

పెనుగొండలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

పెనుగొండ మండలం సిద్ధాంతం రోడ్డులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. వర్షం పడుతున్న సమయంలో ఓ స్కూటీ పై ఇద్దరు మహిళలు, బాలుడు వెళ్తూ అదుపు తప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. అటు బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News May 16, 2024

నిడదవోలు: బైకుల వేలం

image

సెబ్ నిడదవోలు స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన నాలుగు ద్విచక్ర వాహనాలకు ఈనెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్టు సీఐ కె.వీరబ్రహ్మం తెలిపారు. వేలంలో పాల్గొనే వారు తమ ఆధార్ కార్డు తీసుకుని వచ్చి ధరావత్తుగా రూ.5000 చెల్లించాలన్నారు. వేలంలో ద్విచక్ర వాహనాలు దక్కించుకున్న వారు వేలం ముగిసిన వెంటనే వేలం సొమ్ముతో పాటు జీఎస్టీ అదనంగా చెల్లించాలన్నారు.

News May 16, 2024

ఉండి: ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తులు

image

జిల్లాలో ఉండి, ఆచంట ప్రభుత్వ, 10 ప్రైవేటు ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐటీఐ జిల్లా ప్రధానాధికారి వేగేశ్న శ్రీనివాసరాజు తెలిపారు. మే 9న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూన్ 10 వరకు కొనసాగుతోందని వివరించారు. విద్యార్థులు ఉండి, ఆచంట ప్రభుత్వ ఐటీఐలో తమ ధ్రువపత్రాల పరిశీలనకు జూన్ పదో తేదీ సాయంత్రం 5 గంటల్లోపు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

News May 16, 2024

ప.గో: తాత్కాలికంగా పలు రైళ్లు రద్దు

image

గుంటూరు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను ఈ నెల 15 నుంచి 26 వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖాధికారులు తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్లో ట్రాక్ మరమ్మతులు చేపట్టనున్నందున నరసాపురం- నిడదవోలు, నరసాపురం- విజయవాడ, నరసాపురం- రాజమహేంద్రవరం పట్టణాల మధ్య నడిచే రైళ్లు నిర్ణీత కాలంలో రద్దుచేసిన జాబితాలో ఉన్నాయని తెలిపారు. రామవరప్పాడు- నరసాపురం రైలు భీమవరం జంక్షన్ వరకే నడవనుందని వెల్లడించారు.

News May 16, 2024

ప.గో.: గతంలో కంటే తక్కువ పోలింగ్.. ఇక్కడే

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 3 చోట్ల 2019 ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కంటే తాజా ఎన్నికల్లో తక్కువగా నమోదైంది. 2019లో కొవ్వూరులో 86.46, చింతలపూడిలో 82.09, పోలవరంలో 86.88 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో చూస్తే కొవ్వూరులో 85.90, చింతలపూడిలో 81.64. పోలవరంలో 85.95 శాతం ఓట్లు పోలయ్యాయి. అన్ని చోట్లా ఒకశాతం పైనే పోలింగ్ తగ్గింది.
– మరి ఇది గెలుపు ఓటముల్లో ఎవరిపై ప్రభావం చూపేనో..?

News May 15, 2024

తణుకు హైవేపై ACCIDENT.. వ్యక్తి మృతి

image

తణుకు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామానికి చెందిన ఈతకోట అన్నవరం (41) తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తణుకు జాతీయరహదారిపై బైక్‌పై వెళ్తుండగా పాత బెల్లంమార్కెట్‌ సమీపంలో అదుపుతప్పి కిందపడ్డారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

News May 15, 2024

ప.గో.: 2019 కంటే తక్కువ ఓటింగ్ నమోదైన నియోజకవర్గాలివే

image

ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో మూడుచోట్ల 2019 ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కంటే ఇప్పుడు తక్కువగా నమోదైంది. 2019లో కొవ్వూరులో 86.46, చింతలపూడిలో 82.09, పోలవరంలో 86.88 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో చూస్తే కొవ్వూరులో 85.90, చింతలపూడిలో 81.64. పోలవరంలో 85.95 శాతం ఓట్లు పోలయ్యాయి. అన్ని చోట్లా ఒకశాతం పైనే పోలింగ్ తగ్గింది. మరి ఇది గెలుపు ఓటముల్లో ఎవరిపై ప్రభావం చూపేనో..?

News May 15, 2024

ఏలూరు: జూన్ 6వ తేదీ వరకు 144 సెక్షన్

image

ఏలూరు జిల్లాలో జూన్ 6వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మాట్లాడుతూ.. జిల్లాలో సభలు, సమావేశాలకు అనుమతులు ఉండవన్నారు. రోడ్లపై ప్రజలు గుంపులుగా తిరగవద్దని హెచ్చరించారు. రోడ్డుపై ఐదుగురు కంటే ఎక్కువ ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మారణాయుధాలు ప్రదర్శన నిషేధమన్నారు.