WestGodavari

News May 15, 2024

ఏలూరు మళ్లీ వెనకబడింది

image

ఏలూరు నియోజకవర్గ ఓటర్లు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. 2019 ఎన్నికల్లో 67.61 పోలింగ్ నమోదవగా.. ఉమ్మడి ప.గో.లోనే అది అత్యల్పం. కాగా తాజా ఎన్నికల్లో ఆ శాతం స్వల్పంగా పెరిగి 70.17 నమోదైనప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఇదే తక్కువ. మొత్తం 2,35,345 మంది ఓటర్లు ఉండగా.. 85,510 మంది మహిళలు, 79,607 మంది పురుషులు, 15 మంది ఇతరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ అభ్యర్థుల విజయంలో మహిళల ఓటింగే కీలకం అవనుంది.

News May 15, 2024

రికార్డ్ తిరగరాసిన ఉంగుటూరు

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గ ఓటర్లు రికార్డ్ తిరగరాశారు. నియోజకవర్గంలో మొత్తం 2,06,437 మంది ఓటర్లు ఉండగా.. 90,476 మంది పురుషులు, 90,671 మంది మహిళలు, ఇతరులు ఐదుగురు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వెరసి 87.75 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఉమ్మడి ప.గో.లోనే అత్యధికం. అయితే 2019 ఎన్నికల్లో సైతం ఉంగుటూరు 87.30 శాతం పోలింగ్‌తో ఉమ్మడి జిల్లాలో మొదటిస్థానం పొందింది. తాజాగా రికార్డ్ తిరగరాసింది.

News May 15, 2024

ప.గో: జూనియర్‌ ఇంటర్‌లో ప్రవేశానికి కౌన్సెలింగ్‌

image

ఉమ్మడి ప.గో.జిల్లాలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో జూనియర్‌ ఇంటర్‌లో ప్రవేశాలకు ఈ నెల 16, 17 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి భారతి తెలియజేశారు. 16న బాలురకు సంబంధించి భీమడోలు మండలం పోలసానిపల్లి పాఠశాలలో, 17న బాలికలకు అక్కడే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News May 15, 2024

ఉమ్మడి జిల్లాలో పెరిగిన పోలింగ్

image

ఉమ్మడి ప.గో.జిల్లాల్లో గతంతో పోలిస్తే పోలింగ్‌లో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. ఏలూరు జిల్లాలో 2019లో 82.61 శాతం పోలింగ్‌ నమోదు కాగా 2024లో 83.55గా నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో 81.02 శాతం నమోదు కాగా ఈ సారి 82.60 నమోదైంది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లాలో 12,16,667 ఓట్లు పోలవ్వగా, ఏలూరు జిల్లాలో 13,67,999 ఓట్లు పోలయ్యాయి.

News May 15, 2024

నరసాపురం – గుంటూరు ఫాస్ట్ ప్యాసింజర్ రైలు రద్దు

image

నరసాపురం- గుంటూరు మధ్య నడిచే గుంటూరు ఫాస్ట్ ప్యాసింజర్ రైలును ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకూ రద్దు చేశారు. గుంటూరులో ట్రాక్ మరమ్మతు పనులు జరగనున్నందున…. ఈ రైలును తాత్కాలికంగా రద్దు చేశారు. గతేడాది సైతం ట్రాక్ మరమ్మతుల పేరిట కొన్నాళ్లపాటు ఈ రైలు రైల్వే శాఖాధికారులు రద్దు చేశారు. రైలును పూర్తిగా రద్దు చేయకుండా, విజయవాడ లేదా రామవరప్పాడు వరకైనా నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News May 15, 2024

ప.గో.: బెట్టింగులు.. రాజకీయ విశ్లేషణలు

image

ఎన్నికలు ముగిసినప్పటికీ.. ఇంకా విజేత ఎవరనేది తెలియాలంటే దాదాపు 20 రోజులు వేచిచూడాల్సిందే. ఈ క్రమంలో ఉమ్మడి ప.గో. జిల్లాలో పలు చోట్ల అభ్యర్థుల గెలుపు ఓటములపై బెట్టింగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఏ గ్రామంలో చూసినా యువత, పెద్దలు రాజకీయ విశ్లేషణలు చేస్తూ ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. కాగా మన ఉమ్మడి ప.గో.లో మొత్తం 15 నియోజకవర్గాలున్నాయి. – ఏ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుందంటారు.

News May 14, 2024

ఏలూరు: ACCIDENT.. మామాఅల్లుడు మృతి

image

ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికుల వివరాలు.. ఏలూరులోని సత్యనారాయణపేటకు చెందిన గొర్రెల ప్రకాష్(30) వృత్తిరీత్యా పాలిష్ వర్క్ చేస్తుంటాడు. మంగళవారం మేనమామ రంగారావు(50)తో కలిసి బైక్‌పై పెదవేగి మండలం వేగివాడకు బయలుదేరాడు. దెందులూరు మండలం నాగులదేవునిపాడు వద్ద టిప్పర్ లారీ ఢీ కొంది. ప్రకాష్ అక్కడికక్కడే మృతిచెందగా, రంగారావు ఏలూరు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు.

News May 14, 2024

కూటమికి 130 సీట్లు వస్తాయి: హరిరామ జోగయ్య

image

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 130 స్థానాల్లో గెలవబోతుందని కాపు బలిజ సంక్షేమ శాఖ అధ్యక్షులు, మాజీ మంత్రి చేగుండి హరిరామ జోగయ్య తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీకి 107 సీట్లు, జనసేన పార్టీకి 18 సీట్లు, భారతీయ జనతా పార్టీకి 5 సీట్లు వస్తాయని ఆయన పేర్కొన్నారు.

News May 14, 2024

తాజా అప్‌డేట్: ఉమ్మడి ప.గో.లో అత్యధిక పోలింగ్ ఇక్కడే

image

ఉమ్మడి ప.గో జిల్లాలో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. ఏలూరు జిల్లాలో అత్యధికంగా 83.04%.. పశ్చిమ గోదావరి జిల్లాలో 81.12% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గాల వారీగా చూస్తే.. ఉంగుటూరులో అత్యధికంగా 87.75%, అత్యల్పంగా ఏలూరులో 71.02% పోలింగ్ నమోదైంది.
NOTE: పూర్తి గణాంకాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. పోలింగ్ శాతం మరింత పెరగొచ్చు.

News May 14, 2024

ప.గో.: ఓట్ల పండగ ముగిసింది.. మీరు ఓటేశారా..?

image

ఐదేళ్లకు ఓ సారి వచ్చే ఓట్ల పండగ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు మినహా మిగతా అంతా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. కాగా సాయంత్రం 6 గంటల వరకు వచ్చిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లాలో 68.98, ఏలూరు జిల్లాలో 71.10 పోలింగ్ శాతం నమోదైంది. ఇంతకీ మీరు ఓటు వేశారా..? మీ వద్ద పోలింగ్ ఎలా జరిగింది..?
– కామెంట్ చేయండి.