WestGodavari

News May 13, 2024

ఏలూరు: ఓటు వేయడానికి వెళ్తూ.. మృతి

image

ఏలూరు పోలీస్ స్టేషన్ పరిధి గిలకలగేటు వద్ద సోమవారం రైలు నుండి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. ఎస్ఐ నరసింహారావు వివరాలు తెలిపారు. మృతుడు మాచిరెడ్డి శ్రీ మహావిష్ణు(34) నిడదవోలు మండలం రాయ్‌పేటలోని భూపతి వెంకటరాజు వీధికి చెందినవాడని తెలిపారు. హైదరాబాద్ నుంచి ఓటు వేయడానికి వెళ్తున్న క్రమంలో రైలు నుండి జారిపడి మృతి చెందాడని పేర్కొన్నారు.

News May 13, 2024

ప.గో.: ఓటేసిన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను

image

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని కాలింగగూడెం గ్రామంలో జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లతో కలిసి క్యూలైన్లో నిల్చొని ఓటు హక్కు వేశారు. అలాగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా గ్రామానికి వచ్చి ఓటు హక్కు వేయడం తన బాధ్యత అని తెలిపారు.

News May 13, 2024

ప.గో.: మరో గంటన్నర మాత్రమే ఉంది.. వేకప్

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా కొన్నిపోలింగ్ కేంద్రాల్లో ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరగగా పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు త్వరగా ఓటేసేందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఓటు వేయనట్లయితే త్వరగా వెళ్లండి.
– SHARE IT

News May 13, 2024

తీవ్ర విషాదం.. ట్రావెల్స్ బస్సు ఢీకొని బాలుడి మృతి

image

ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో గొన్నూరి రాజు-మరియమ్మ దంపతుల కుమారుడు సిద్ధూ(3) మృతి చెందాడు. వీరు ఆదివారం నల్లజర్ల మండలం దూబచర్లలో బంధువుల ఇంట్లో శుభాకార్యానికి వెళ్లారు. అక్కడ సిద్దూ మారాం చేయగా.. బైక్‌పై తీసుకెళ్తున్న క్రమంలో ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. సిద్ధూపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

News May 13, 2024

ఏలూరు జిల్లాలో పోలింగ్ సిబ్బందికి సత్కారం

image

ఏలూరు జిల్లా గోదావరి నది మధ్యలో ఉన్న కసనూరు గిరిజన తండా ప్రజలు పోలింగ్ సిబ్బందికి వారి సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఈ ప్రాంతంలో 472 మంది ఓటర్లు ఉన్నారు. కసనూరు గ్రామానికి ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వస్తే కొండారెడ్డి గిరిజన తెగవారు వారి సంప్రదాయం ప్రకారం స్వాగతం పలకడం, సత్కరించడం ఆనవాయితీ. పోలింగ్ సిబ్బంది వస్తున్నారని తెలుసుకున్న గిరిజన ప్రజలు సిబ్బందికి ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు.

News May 13, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో మొదలైన మాక్ పోలింగ్

image

ఉమ్మడి ప.గో జిల్లాలో మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలింగ్ సమయానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ఏజెంట్లు రాకపోవడంతో ఆలస్యమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు వారి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

News May 13, 2024

GET READY ప.గో. జిల్లా

image

సార్వాత్రిక ఎన్నికల పోలింగ్ నేడే కావడంతో ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాలు, 2 ఎంపీ స్థానాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఓటర్ల ఇబ్బంది లేకుండా ఆయా పోలింగ్‌ బూత్‌ల వద్ద షామియానాలు, నీటి సదుపాయం, వృద్ధులు, దివ్యాంగులకు ర్యాంపులు తదితర సౌకర్యాలు ఏర్పాటుచేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.
– ఓటేద్దాం.. హక్కును రక్షించుకుందాం.

News May 12, 2024

ప.గో.: అభిమాన నేత కోసం నాలుక కోసుకున్నాడు..!

image

ప.గో. జిల్లా పోలవరం మండలం గూటాల గ్రామానికి చెందిన చెవల మహేశ్ HYD బంజారాహిల్స్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద ఈరోజు తన నాలుక కోసుకున్నాడు. ఏపీలో తన అభిమాన నేత CM కావాలని నాలుక కోసుకుని మొక్కు తీర్చుకున్నానని ఆయన ఓ లెటర్‌లో రాశారు. కాగా గతంలోనూ 2 సార్లు తాను ఇలాగే నాలుక కోసుకున్నట్లు లెటర్‌లో పేర్కొన్నారు. పోలీసులు వచ్చి ఆయన్ను అపోలో ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

News May 12, 2024

ప.గో.: అమ్మను ఆదర్శంగా తీసుకొని.. ఓటు వేద్దాం

image

నవమాసాలు మోసి అమ్మ జన్మనిచ్చి నిన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్క ఓటుతో ఉత్తమ నాయకుడిని ఎన్నుకొని బాధ్యత నెరవేర్చుకోలేమా..? తల్లి ప్రేమ వెలకట్టలేనిది, బాధ్యతగా జీవితమంతా వెంటే ఉంటోంది. మన ఓటుకూ వెలకట్టకపోతే వచ్చే ఐదేళ్లు మంచి పాలన అందుతోంది. అమ్మను ఆదర్శంగా తీసుకుందాం. ప్రేమలోనూ, బాధ్యతలోనూ. మన ప.గో. జిల్లాలో 33,06,063 మంది ఓటర్లున్నారు.
– నేడు మాతృ దినోత్సవం. రేపే మన బాధ్యతను నెరవేర్చుకుందాం.

News May 12, 2024

ప.గో: ఎలక్షన్@2024.. పోలింగ్ శాతం పెరిగేనా..?

image

ఉమ్మడి ప.గో జిల్లాలో 2019లో పోలింగ్ శాతం ఇలా ఉంది. కొవ్వూరు-86.4%, నిడదవోలు-82.7%, ఆచంట-79.6%, పాలకొల్లు-82.2%, నరసాపురం-81.1%, భీమవరం-77.9%, ఉండి-84.7%, తణుకు-81.1%, తాడేపల్లిగూడెం-80.3%, ఉంగుటూరు-86.8%, దెందులూరు-84.8%, ఏలూరు-67.6%, గోపాలపురం-85.9%, పోలవరం-86.8%, చింతలపూడి-82.9% పోలింగ్ నమోదయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేందుకు జిల్లా అధికారులు చేపట్టిన చర్యలు ఎలా ఉన్నాయి.