WestGodavari

News May 12, 2024

ప.గో: ఓట్ల పండగ.. RTC ప్రత్యేక బస్సు సర్వీసులు

image

రేపే పోలింగ్.. ఏదేళ్లకోసారి వచ్చే ఈ ఓట్ల పండగలో భాగమయ్యేందుకు ప.గో జిల్లాకు HYD, ఇతర నగరాల నుంచి దాదాపు 60వేల మంది వస్తున్నట్లు అంచనా. దీంతో RTC ప్రత్యేక బస్సులు నడుపుతోంది. HYD నుంచి సాధారణ రోజుల్లో 14 బస్సులు నడవగా.. ఈనెల 9 నుంచి 12 వరకు మరో 13 సర్వీసులు (భీమవరం-4, నరసాపురం-3, తణుకు-3, తాడేపల్లిగూడెం-3) ఏర్పాటు చేశారు. తిరిగి వెళ్లేందుకు 13, 14 తేదీల్లో 11 సర్వీసులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.

News May 12, 2024

ALERT: ఉమ్మడి ప.గో.లో పిడుగులకు ఛాన్స్

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఏపీలో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఆదివారం అక్కడ పిడుగులు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News May 12, 2024

ప.గో: ఓట్ల పండగ.. RTC ప్రత్యేక బస్సు సర్వీసులు

image

రేపే పోలింగ్.. ఏదేళ్లకోసారి వచ్చే ఈ ఓట్ల పండగలో భాగమయ్యేందుకు ప.గో జిల్లాకు HYD, ఇతర నగరాల నుంచి దాదాపు 60వేల మంది వస్తున్నట్లు అంచనా. దీంతో RTC ప్రత్యేక బస్సులు నడుపుతోంది. HYD నుంచి సాధారణ రోజుల్లో 14 బస్సులు నడవగా.. ఈనెల 9 నుంచి 12 వరకు మరో 13 సర్వీసులు (భీమవరం-4, నరసాపురం-3, తణుకు-3, తాడేపల్లిగూడెం-3) ఏర్పాటు చేశారు. తిరిగి వెళ్లేందుకు 13, 14 తేదీల్లో 11 సర్వీసులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.

News May 12, 2024

భీమవరంలో విషాదం.. ట్రాక్టర్ ఢీకొని బాలిక మృతి

image

ప.గో జిల్లా భీమవరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని నాచువారి సెంటర్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 5వ తరగతి విద్యార్థిని దుండి జ్యోతిప్రియ మృతి చెందింది. కరాటే నేర్చుకునేందుకు బాలిక సైకిల్‌పై వెళ్తుండగా.. ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. జ్యోతిప్రియ అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక తండ్రి పట్టణంలోని మున్సిపల్ ఆఫీసులో ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తున్నారు.

News May 12, 2024

ప.గో.: ఓటింగ్ శాతం పెంచుదాం

image

ప.గో. జిల్లాలో గత 2 అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. పోలింగ్ శాతం కొంతమేర తగ్గింది. 2014 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 82.25 శాతం పోలింగ్ జరగగా.. 2019 ఎన్నికల్లో 82.19 శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఈ ఎన్నికల్లో మరింత పెంచేలా ఓటర్లుగా మనం ముందుకెళ్దాం.
– ఇంతకీ గత 2 ఎన్నికల్లో మీరు ఓటు వేశారా..?

News May 11, 2024

ఏలూరు: అఖండ జ్యోతి వెలిగించి.. ఓటర్లకు విజ్ఞప్తి 

image

ఏలూరు జిల్లాలో ఉన్న 16.37 లక్షల ఓటర్లను మే 13వ తేదీన ఓటు వేయమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ శనివారం వినూత్న రీతిలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలోని సెయింట్ థెరీసా మహిళా డిగ్రీ కళాశాలలో దీపాలు వెలిగించి జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని చెప్పారు.

News May 11, 2024

ప.గో.: 13న పరీక్ష.. 22 రోజులకు రిజల్ట్.. జాబ్ కొట్టేదెవరో?

image

రాజకీయ నాయకుడి జీవితాన్ని జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థితో పోలిస్తే.. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు (జాబ్ నోటిఫికేషన్). నేటితో ముగిసిన నెల రోజుల ప్రచారం ప్రిపరేషన్ అన్నమాట. ఇక నేతలందరికీ 13న పరీక్ష(ఓటింగ్). 22 రోజులకే ఫలితాలు. ఉమ్మడి ప.గో.లో 15 జాబ్స్ (MLA స్థానాలు) ఉండగా.. మొత్తం 181 మంది (నామినేషన్లు) పరీక్ష రాశారు. వీరిలో టాప్ ర్యాంక్‌‌తో జాబ్ కొట్టేవారు ఎవరెవరో కామెంట్ చేయండి.

News May 11, 2024

ఉండి నియోజకవర్గంలో పలువురు TDP నేతల సస్పెండ్

image

ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని పేర్కొంటూ పలువురిని పార్టీ ప.గో జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఏఎంసీ ఛైర్మన్ సాగి సాంబశివరాజు, బురిడి రవి, మోపిదేవి శ్రీనివాస్, వత్సవాయి సూర్యనారాయణ రాజు, శ్రీనివాస్, సుజాత, అనంతలక్ష్మితో పాటు కాళ్ల మండలానికి చెందిన వెంకట్రావు తదితరులను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News May 11, 2024

ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

image

పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు ప్రభుత్వ, 16 ప్రైవేట్ ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ వి.శ్రీనివాసరాజు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 10న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు అనంతరం సమీపంలోని ఎన్‌ఆర్‌పీ అగ్రహారం, ఆచంటలోని ఐటీఐ కళాశాలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకొని రసీదు పొందాలన్నారు.

News May 11, 2024

ఉభయ గోదావరి జిల్లాల్లోనే పిఠాపురంపై ఆసక్తి.. నేడు రామ్‌చరణ్

image

ప్రచారఘట్టానికి నేటి సాయంత్రంతో తెరపడనుండగా.. ఉభయ గోదావరి జిల్లాల్లోనే పిఠాపురం క్లైమాక్స్ ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్ వంగా గీతకు మద్దతుగా ప్రసంగించి ఇక్కడే ప్రచారానికి ఫిన్షింగ్ టచ్ ఇవ్వనున్నారు. అటు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సైతం తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం వచ్చి పూజలు చేయనున్నారు. అనంతరం బాబాయ్ కళ్యాణ్ కోసం అబ్బాయ్ చరణ్ ప్రచారం చేస్తారా..?, ఏమైనా మాట్లాడుతారా..? అనేది ఆసక్తికరంగా మారింది.