WestGodavari

News May 9, 2024

ఏలూరు: కూటమి అభ్యర్థి ప్రచారంలో RGV హీరోయిన్

image

ఏలూరు జిల్లా తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామంలో కొవ్వూరు నియోజకవర్గ కూటమి MLA అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు గురువారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో సినీ నటుడు శివాజీ, హీరోయిన్ శ్రీ రాపాక పాల్గొన్నారు. గతంలో శ్రీ రాపాక గోపాలపురం నియోజకవర్గం నుంచి సీఎం జగన్ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా కూటమి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. 

News May 9, 2024

ప.గో.: ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’ 

image

ఎన్నికలొచ్చాయంటే పోటీలో నిలిచే నాయకులంతా తమకే ఓటు వేసి గెలిపించాలంటూ ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తుంటారు. కొందరు ఓటు వేయండని నగదు సైతం పంపిణీ చేస్తారు. అయితే ప.గో. నరసాపురం మండలం రుస్తుంబాద గ్రామానికి చెందిన మొహమ్మద్ జాన్ అలైజా అనే యువకుడు ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’ అనే కరపత్రం ఇంటిగేటుకు అతికించాడు. నిజాయితీగా పనిచేసే రాజకీయ నాయకుడికి తమ కుటుంబం ఓటు వేస్తుందని చెబుతున్నారు.

News May 9, 2024

తాళ్ళపూడిలో నటుడు శివాజీ ప్రచారం

image

ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సినీనటుడు శివాజీ అన్నారు. గురువారం సాయంత్రం ఆయన తాళ్ళపూడి మండలం గజ్జరంలో కొవ్వూరు కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందీశ్వరి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి రాకపోతే ఇండియా మ్యాప్‌లో ఏపీ కనుమరుగవుతుందన్నారు.  

News May 9, 2024

ప.గో.: CM పర్యటన వాయిదా

image

ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం నియోజవర్గంలో రేపటి సీఎం పర్యటన వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిగూడెం పట్టణానికి సీఎం జగన్ రావాల్సి ఉంది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మంగళగిరి, నగరి ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమానికి హాజరు కావలసి ఉంది. దీంతో తాడేపల్లిగూడెం పర్యటన తాత్కాలికంగా వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News May 9, 2024

ప.గో.: రేపు చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదే

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఈ నెల 10వ తేదీన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు ఉండి జంక్షన్‌లో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు చింతలపూడి పట్టణంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారని నాయకులు తెలిపారు.

News May 9, 2024

ఏలూరు: సైబర్ మోసం.. రూ.53 వేలు పోగొట్టుకున్న నర్సు

image

పెదపాడు మండలం వట్లూరుPHCలో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తున్న పావనికి ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. ‘ముంబయి నుంచి మాట్లాడుతున్నామని.. సైబర్‌క్రైం పోలీసులమని చెప్పాడు. మీపై కేసులు ఉన్నాయని అరెస్ట్ చేసేందుకు వస్తున్నామన్నాడు. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బుపంపించాలని’ ఖాతా నంబర్ మెసేజ్ చేశాడు. భయంతో పావని రూ.53 వేలు పంపించింది. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించగా ఆమె ఖాతాను హోల్డ్ చేయించి కేసు నమోదుచేశారు.

News May 9, 2024

ప.గో. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు

image

పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 13,854 మంది
తపాలా బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోగా 13,177 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం తెలిపారు. ఈ మేరకు సౌలభ్య కేంద్రాల్లో సోమ, మంగళవారాల్లో 12,773 మంది ఓటు వేశారన్నారు. అలాగే బుధవారం మరో 404 మంది ఆర్వో కార్యాలయాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నట్లు వెల్లడించారు.

News May 9, 2024

తాడేపల్లిగూడెం:31 ఓట్లతోనే MLAగా గెలిచింది ఈమే..!

image

తాడేపల్లిగూడెం అసెంబ్లీకి ఉపఎన్నికలతో పాటు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. అత్యధిక,అత్యల్ప మెజార్టీ చూస్తే..1987లో TDP అభ్యర్థి పి.కనక సుందరరావుపై ఐ.కాంగ్రెస్ అభ్యర్థి ఈలి వరలక్ష్మి 31 అత్యల్ప ఓట్లతో గెలిచారు.1983లో జరిగిన ఉపఎన్నికలలో ఐ.కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్.ఆర్ భాస్కరరావుపై TDP అభ్యర్థి ఈలి ఆంజనేయులు 42,694వేల అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మీ నియోజకవర్గంలో గెలుపెవరిదో కామెంట్ చేయండి.

News May 9, 2024

ప.గో :11 నెలల తర్వాత నేటి నుంచి దర్శనాలు

image

వైశాఖ మాసం ప్రారంభం నేపథ్యంలో నత్తారామేశ్వరం క్షేత్రంలోని రామలింగేశ్వరస్వామి ఆలయం తలుపులు తెరవనున్నట్లు పాలక మండలి సభ్యులు తెలిపారు. నేటి నుంచి జూన్ 6 వరకు స్వామిని దర్శించుకోవచ్చని తెలిపారు. ఏడాదిలో 11 నెలలు నీటిలో ఉండే స్వామి కేవలం వైశాఖ మాసం నెలరోజులు భక్తులకు దర్శనమిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేసినట్లు ఈవో ఆర్. గంగా శ్రీదేవి చెప్పారు.

News May 9, 2024

ఓట్లు తారుమారు.. 15ని. వ్యవధిలో పరిష్కారం

image

ప్రతి ఓటరు తమ ఓటును వినియోగించుకోవాలని ఉమ్మడి ప.గో జిల్లా ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. బుధవారం గోపాలపురం అసెంబ్లీకి చెందిన పలువురి ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తారుమారు కాగా.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌కు తెలిపామన్నారు. 15 నిమిషాల వ్యవధిలో ఆ ఉద్యోగులు ఓట్లు వినియోగించుకునేలా కలెక్టర్ చర్యలు తీసుకున్నారని చెప్పారు.