India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఓ స్వత్రంత్ర అభ్యర్థికి అతి తక్కవ ఓట్లు వచ్చాయి. ఆ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కొనకాళ్ల శ్రీనివాస రావుకు 40 ఓట్లు వచ్చాయి. కాగా జిల్లాలో అత్యధికంగా భీమవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులుకు 1,30,424 ఓట్లు వచ్చాయి.
ఉండి నియోజకవర్గంలో RRR సరికొత్త రికార్డ్ సృష్టించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ 10 సార్లు ఎన్నికలు జరగగా.. తొమ్మిది సార్లు గెలుపొందింది. ఒక్క 2004లోనే కాంగ్రెస్ గెలిచింది. 1978 నుంచి 1999 వరకు జె.రామచంద్రరాజు వరుసగా 6 సార్లు విజయం సాధించారు. మెజారిటీ పరంగా చూస్తే 2014లో టీడీపీ అభ్యర్థి శివరామరాజు 36231 ఓట్ల మెజారిటీ సాధించారు. అయితే తాజాగా RRR ఈ రికార్డ్ అధిగమించి 56,777 మెజార్టీ సాధించారు.
ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో గత ఎన్నికల్లో వైసీపీ 13, టీడీపీ 2 స్థానాల్లో గెలిచింది. అయితే మన జిల్లాలో ముగ్గురు MLAలకు మంత్రులుగా అవకాశం వచ్చింది. తాడేపల్లిగూడెం- కొట్టు సత్యనారాయణ, తణుకు- కారుమూరి నాగేశ్వర రావు, కొవ్వూరు – తానేటి వనిత మంత్రులుగా పనిచేశారు. మరి ఈ ఎన్నికల్లో జనసేన నుంచి ఆరుగురు, టీడీపీ నుంచి 9మంది MLAలుగా గెలిచారు. ఈ సారి జిల్లాకు మంత్రి పదవి వచ్చేనా..?
– మీ కామెంట్..?
ఏలూరు జిల్లా వ్యాప్తంగా మహాత్మాగాంధీ ఉపాధిహామీ పధకం ఆధ్వర్యంలో 4,500 ఎకరాల్లో పండ్ల మొక్కలు పెంచడానికి ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఉపాధిహామీ పధకంలో భాగంగా పంచాయితీ, ప్రభుత్వ భూముల్లో మొక్కలు పెంపకానికి 45 ఎకరాలు గుర్తించామన్నారు. రోడ్లు, కాల్వగట్ల వెంబడి 75 కిలోమీటర్ల పెంపకానికి చర్యలు తీసుకున్నామన్నారు.
తాడేపల్లిగూడెం పట్టణంలోని 2టౌన్ రాయల్ ఎన్ ఫీల్డ్ షోరూం వద్ద బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని యాచకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. యాచకుడు నిద్రపోతున్న సమయంలో ఈ సంఘటన జరిగిందన్నారు. మృతునికి 60 ఏళ్ల వయసు ఉంటుందని, ఆచూకీ తెలిసిన వారు తాడేపల్లిగూడెం పట్టణ పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలన్నారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గంటా ప్రభాకర్ (61)విధి నిర్వహణలో గుండెపోటుకు గురై మృతి చెందారు. బుధవారం ఆయన ఆసుపత్రిలో గుండె పోటు రాగా హుటాహుటిన పాలకొల్లు న్యూలైఫ్ హాస్పిటల్‌కి తరలించారు. వైద్య సేవలందిస్తుండగా తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్, వైద్యులు, సిబ్బంది తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
జిల్లాలో ఓట్లలెక్కింపు ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది ఎంతో నిబద్దతతో వ్యవహరిస్తూ.. వారి విధులు సక్రమంగా నిర్వహించారన్నారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న ఎన్నికల అబ్జర్వర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన MLAలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ మేరకు విజయం సాధించిన వారందరినీ అభినందించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ తపాలా బ్యాలెట్ ఓట్ల సాధనలో కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. భీమవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులుకు అత్యధికంగా 1,723 తపాలా ఓట్లు వచ్చాయి. పాలకొల్లు 1,643, తణుకు 1,593, తాడేపల్లిగూడెం 1,488, నరసాపురం 1,075, ఉండి 960, ఆచంట 973, నిడదవోలు1,090, కొవ్వూరు 1,023, గోపాలపురం 744 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నూతనంగా గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబుని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మీ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.