WestGodavari

News June 5, 2024

పవన్‌ను కలిసిన ఉమ్మడి ప.గో. జనసేన MLAలు

image

గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన MLAలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ మేరకు విజయం సాధించిన వారందరినీ అభినందించారు.

News June 5, 2024

ప.గో.: మహిళలకు దక్కని అధికారం

image

ఉమ్మడి ప.గో.లోని 15 స్థానాల్లో ప్రధాన పార్టీల నుంచి నలుగురు పోటీచేయగా అందరూ ఓడిపోయారు.
☛ అసెంబ్లీ స్థానం
✦ పోలవరంలో వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి
✦ గోపాలపురంలో వైసీపీ అభ్యర్థి తానేటి వనిత ఓడిపోయారు.
☛ పార్లమెంట్
✦ ఏలూరులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె.లావణ్య 20826ఓట్లతో 3వ స్థానానికి పరిమితమయ్యారు.
✦నరసాపురంలో వైసీపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల 4,30,541 ఓట్లతో 2వ స్థానంలో నిలిచింది.

News June 5, 2024

ప.గో.: ఎక్కువసార్లు అసెంబ్లీకి వెళ్లింది వీరే

image

ఉమ్మడి ప.గో. జిల్లా ఆచంట మాజీ MLA పితాని సత్యనారాయణ ప్రస్తుత విజయంతో 4వ సారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. అలాగే తాజా విజయంతో వరుసగా 3 సార్లు గెలిచిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈసారి హ్యాట్రిక్ సాధించారు. తరువాతి వరుసలో దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, భీమవరం నుంచి పులపర్తి అంజిబాబు 3వ సారి అసెంబ్లీకి వెళ్తున్నారు.

News June 5, 2024

ప.గో.: ఆరుగురికి 50వేల ప్లస్ మెజారిటీ.. మీ కామెంట్..?

image

ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో గెలుపొందిన కూటమి MLAలలో ఒక్క పోలవరం మినహాయిస్తే.. అన్నీ చోట్ల 25 వేలకు పైగా మెజారిటీలు సాధించారు. మరోవైపు ఆరుగురు MLAలు 50 వేలకు పైగా మెజారిటీ సాధించారు. మరి ఇంత భారీ మెజారిటీలకు కారణం టీడీపీ- జనసేన- బీజేపీ జత కట్టడమే అని లోకల్‌గా టాక్ నడుస్తోంది.
– మీరేమంటారు..?

News June 5, 2024

ప.గో.: పోలవరం టెన్షన్.. టెన్షన్

image

పోలవరం ఓట్ల లెక్కింపులో వైసీపీ, కూటమి అభ్యర్థుల మధ్య విజయం దోబూచులాడింది. తొలిరౌండ్లో ఆధిక్యం కనబర్చిన వైసీపీ అభ్యర్థి రాజ్యలక్ష్మి తిరిగి 4వ రౌండులో ఆధిక్యం అందిపుచ్చుకున్నారు. ఆ తర్వాత రౌండ్లలో జనసేన అభ్యర్థి పోలవరం బాలరాజు జోరందుకోగా 8, 9, 10, 11 రౌండ్లలో తిరిగి వైసీపీ అభ్యర్థి ఆధిక్యతను నిలుపుకొనే ప్రయత్నం చేశారు. 14- 20వ రౌండ్ వరకు బాలరాజు మళ్లీ జోరు చూపి 7935 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

News June 5, 2024

ఉమ్మడి ప.గో. జిల్లాలో నోటాకు వేలల్లో ఓట్లు

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నోటాకు కూడా వేలల్లో ఓట్లు వచ్చాయి. పాలకొల్లులో నోటాకు 900 ఓట్లు, నరసాపురం నియోజకవర్గంలో 1,216, పోలవరంలో 5,172, చింతలపూడిలో 4,121, ఉంగుటూరులో 2,088, దెందులూరులో 1,713, ఆచంటలో 1,673, ఉండిలో 1,670, భీమవరంలో 1,210, ఏలూరులో 1,212, తణుకులో 1,722, తాడేపల్లిగూడెం 1,522 ఓట్లు నోటాకు దక్కాయి.

News June 5, 2024

ప.గో.: తండ్రి MLA.. కొడుకు MP

image

ప.గో. జిల్లా ఏలూరు MPగా పుట్టా మహేశ్ యాదవ్ తొలిసారి పోటీచేసినప్పటికీ 1,78,326 భారీ మెజారిటీతో గెలుపొంది పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు. కాగా ఆయన తండ్రి సుధాకర్ యాదవ్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి MLAగా గెలుపొందారు. ఈయన 20.14, 2019లో పోటీచేసినప్పటికీ ఓటమి చవిచూశారు. తాజా గెలుపుతో తండ్రి MLAగా, కొడుకు MPగా సేవలందించనున్నారు.

News June 5, 2024

ప.గో.: చివరి 6 ఎన్నికలు.. ఆరు పార్టీలకు పట్టం

image

ప.గో. జిల్లాలోని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం అరుదైన రికార్డ్ సాధించింది. 1999 నుంచి 2024 వరకు ఈ నియోజకవర్గానికి ఆరుసార్లు ఎన్నికలు జరిగాయి. కాగా ఆరు ఎన్నికల్లో ఆరు వేర్వేరు పార్టీల అభ్యర్థులు గెలిచారు. 1999- టీడీపీ, 2004- కాంగ్రెస్, 2009- ప్రజారాజ్యం, 2014- బీజేపీ, 2019- వైసీపీ, 2024- జనసేన అభ్యర్థులు విజయం సాధించారు.

News June 5, 2024

ప.గో.లో YCP ప్లాన్ ఫెయిల్

image

ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో గత 2019 ఎన్నికల్లో 13 చోట్ల వైసీపీ గెలుపొందగా.. 2 చోట్ల టీడీపీ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో చింతలపూడిలో సిట్టింగ్ MLA ఎలీజాను కాదని కంభం విజయరాజుకు టికెట్ ఇచ్చింది. ఇక పోలవరంలోనూ తెల్లం బాలరాజుకు బదులు ఆయన సతీమణి రాజ్యలక్ష్మి పోటీలో నిలిచారు. గెలుపే లక్ష్యంగా ఆయా చోట్ల టికెట్లు మార్చినప్పటికీ ప్లాన్ ఫెయిల్ అయిందని పలువురు చర్చించుకుంటున్నారు.

News June 5, 2024

ప.గో.: మంత్రులంతా ఓటమి

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని తాడేపల్లిగూడెం, కొవ్వూరు, తణుకు నియోజకవర్గాల నుంచి గత ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ అభ్యర్థులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంత్రులుగా సేవలందించారు. కాగా తాజాగా ముగ్గురూ ఓటమి పాలయ్యారు. కాగా మూడు చోట్ల గెలిచిన కూటమి అభ్యర్థులు 30 వేల పై చిలుకు మెజారిటీ సాధించడం మరో విశేషం.