WestGodavari

News May 4, 2024

ఏలూరు: తల్లిని చంపాడు.. అరెస్ట్

image

తల్లిని చంపిన కేసులో కొడుకు అరెస్ట్ అయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏలూరు నగరంలోని పడమరవీధి దొంగల మండపం ప్రాంతానికి చెందిన డొక్కు కృష్ణవేణికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. కాగా ఈ నెల 1వ తేదీన కుమారుడు హరికృష్ణ మద్యానికి డబ్బులు కావాని తల్లిని అడిగాడు. లేవని చెప్పగా గొడవపడి ఆమె తలను గోడకు కొట్టాడు. దీంతో ఆమె చనిపోయింది. కేసు నమోదుచేసిన సీఐ రాజశేఖర్ శుక్రవారం అతన్ని అరెస్ట్ చేశాడు.

News May 4, 2024

తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ బదిలీ

image

తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అనపర్తి శామ్యూల్ బదిలీ అయ్యారు. ఈయన జిల్లా కలెక్టరేట్ విధుల్లో చేరనున్నారు. ఆయన స్థానంలో మున్సిపల్ ఇంజినీర్ డి.మురళీకృష్ణకు మున్సిపల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మురళి కృష్ణ కమిషనర్‌గా వ్యవహరించనున్నారు. శామ్యూల్ ఆకస్మిక బదిలీపై సర్వత్ర చర్చ సాగుతోంది.

News May 4, 2024

ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతి మస్ట్: కలెక్టర్

image

పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజు ప్రచురించే రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతి తప్పక ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఏలూరులో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎంసీఎంసీ కమిటీ ముందస్తు అనుమతి లేకుండా పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజు ప్రింట్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించకూడదన్నారు.

News May 3, 2024

తాడేపల్లిగూడెంలో TDPకి షాక్.. కిలాడి ప్రసాద్ రాజీనామా

image

ప.గో జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ వైస్ ఛైర్మన్ కిలాడి ప్రసాద్ తెలుగుదేశం పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం సాయంత్రం తాడేపల్లిగూడెంలోని హంగ్రీ బర్డ్స్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. పార్టీలో సముచిత స్థానం కల్పించకపోవడంతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కిలాడి శ్రీను, కోలా శ్రీనివాసరావు ఉన్నారు.

News May 3, 2024

ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి: ఏలూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్

image

ఏలూరు జిల్లాలో అక్రమంగా మద్యం తరలిస్తున్న 9మంది వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్.ఎస్.కుమరేశ్వరన్ గురువారం తెలిపారు. వారి నుంచి 207 మద్యం బాటిల్స్, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లా శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎక్కడైనా అక్రమంగా మద్యం, తదితరాలపై ఫిర్యాదులుంటే 08812-355350 నెంబర్‌కు ఫోన్ చేసి తెలపాని సూచించారు. SHARE IT

News May 2, 2024

పాలకొల్లులో హ్యాట్రిక్ రికార్డ్ నమోదయ్యేనా..?

image

పాలకొల్లు నియోజకవర్గ ఓటర్ల ఇంతవరకు ఏ ఎమ్మెల్యేకూ ‘హ్యాట్రిక్ విజయం’ ఇవ్వలేదు. ఈ నియోజకవర్గానికి 70ఏళ్ల చరిత్ర ఉండగా.. 1955 నుంచి ఇప్పటివరకు 14సార్లు ఎన్నికలు జరిగాయి. 1983, 85తో పాటు 1994, 99 ఎన్నికల్లో వరుసగా అల్లు వెంకటసత్యనారాయన గెలిచారు. ఈ 2సార్లూ ఆయన హ్యాట్రిక్ కోసం యత్నించినా ఓటమి చవి చూశారు. 2014, 19 ఎన్నికల్లో విజయం సాధించిన నిమ్మల ఈసారి హ్యాట్రిక్ కొట్టి రికార్డ్ తిరగరాసేనా..? చూడాలి.

News May 2, 2024

ఏలూరు: డివైడర్‌ను ఢీకొన్న బస్సు

image

ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చింతలపూడి టౌన్ బోయగూడెం వద్ద గురువారం ప్రమాదానికి గురైంది. సత్తుపల్లి వయా సీతానగరం మీదుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు బోయగూడెం వే బ్రిడ్జ్ ఎదురుగా ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని.. డ్రైవర్ వైపు బస్సు భాగం పాక్షికంగా దెబ్బతిందని డ్రైవర్ తెలిపారు.

News May 2, 2024

ప.గో జిల్లాలో 845 మంది అరెస్ట్

image

పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో జనవరి 2024 నుంచి ఇప్పటివరకు మొత్తం 887 కేసులు నమోదు చేశామని జిల్లా మధ్య నిషేధ అబ్కారీ అధికారి ఆర్.నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.41.66 లక్షలు విలువచేసే 13, 225 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు. ఈ నేపథ్యంలోనే 845 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఎన్నికల తరుణంలో జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.

News May 2, 2024

జీలుగుమిల్లి గిరిజన సంక్షేమాధికారి సస్పెన్షన్

image

జీలుగుమిల్లి సహాయ గిరిజన
సంక్షేమాధికారి (ఏటీడబ్ల్యూవో) కె.కృష్ణమోహన్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని ఆ శాఖ ఉప సంచాలకుడు పీవీఎస్ నాయుడు తెలిపారు. స్థానిక గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన 42 మంది విద్యార్థులు ఫిబ్రవరిలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఆ ఘటనతో పాటు పలు అంశాలపై ఐటీడీఏ పీవో డైరెక్టరేటుకు నివేదిక పంపగా సస్పెండ్ చేసినట్లు డీడీ పేర్కొన్నారు.

News May 2, 2024

జంగారెడ్డిగూడెం: ప్రేమించి పెళ్లి చేసుకుని చంపేశాడు

image

బుట్టాయిగూడెంకు చెందిన బొబ్బర వంశి జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన ఝాన్సీ (38) ని 2ం ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఝాన్సీ పట్టణములోని ఓ ఆసుపత్రిలో వర్కర్ గా పనిచేస్తుంది. భర్త చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. దీంతో ఇల్లు అమ్మేయాలని భార్యతో నిత్యం గొడవ పడుతూ ఉండేవాడు. బుధవారం కత్తితో భార్యను చంపి పరారయ్యాడు. దీనిపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.