WestGodavari

News May 2, 2024

జంగారెడ్డిగూడెం: ప్రేమించి పెళ్లి చేసుకుని చంపేశాడు

image

బుట్టాయిగూడెంకు చెందిన బొబ్బర వంశి జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన ఝాన్సీ (38) ని 2ం ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఝాన్సీ పట్టణములోని ఓ ఆసుపత్రిలో వర్కర్ గా పనిచేస్తుంది. భర్త చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. దీంతో ఇల్లు అమ్మేయాలని భార్యతో నిత్యం గొడవ పడుతూ ఉండేవాడు. బుధవారం కత్తితో భార్యను చంపి పరారయ్యాడు. దీనిపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News May 2, 2024

గోపాలపురం: రూ.2.40 కోట్లు సీజ్

image

గోపాలపురం సరిహద్దుల్లో భారీగా నగదు పట్టుబడింది. జగన్నాధపురం చెక్‌పోస్ట్ వద్ద రూ. 2.40 కోట్లు తరలిస్తుండగా పోలీస్ అధికారులు పట్టుకున్నారు. ఓ ప్రైవేట్ బస్సులో ఆ నగదు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సై సతీష్ కుమార్ చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపుగా ఆ బస్సు వెళ్తున్నట్లు సమాచారం.

News May 2, 2024

ఏలూరు జిల్లాలో 914 హోం ఓటింగ్‌‌కు దరఖాస్తు: కలెక్టర్

image

జిల్లాలో హోం ఓటింగ్‌కు 914 మంది దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బుధవారం తెలిపారు. 7 అసెంబ్లీల పరిధిలో 85 ఏళ్లు నిండిన ఓటర్లు 503 మంది, 40 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగ ఓటర్లు 411 మంది ఉన్నారని స్పష్టం చేశారు. వీరికి హోం ఓటింగ్ సౌకర్యం కల్పించేందుకు ఎన్నికల సిబ్బందితో కూడిన 55 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మే 3 నుంచి 7లోగా క్షేత్ర స్థాయిలో రెండు విడతలగా పర్యటిస్తారన్నారు.

News May 1, 2024

చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు చింతమనేని పాలాభిషేకం

image

ఏలూరు రూరల్ మండలం కొల్లేటిలంకలో చింతమనేని ప్రభాకర్ బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా.. టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రజా సంక్షేమ మేనిఫెస్టో ప్రవేశపెట్టిన సందర్భంగా పాలాభిషేకం చేసినట్లు ఆయన తెలిపారు. 

News May 1, 2024

జంగారెడ్డిగూడెంలో మహిళ దారుణ హత్య

image

జంగారెడ్డిగూడెం బాబ్జీ నగర్‌కి చెందిన బొబ్బర ఝాన్సీ బుధవారం దారుణ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి ఒంటిపై వివిధ భాగాల్లో కత్తి పోట్లను గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఝాన్సీకి ఇద్దరు పిల్లలు కాగా.. భర్తే భార్యను హతమార్చి ఉంటాడని భావిస్తున్నారు. ఇల్లు అమ్మకం విషయంలో జరిగిన ఘర్షణే హత్యకు కారణంగా తెలుస్తోంది.

News May 1, 2024

3న నరసాపురానికి సీఎం జగన్

image

ఈనెల 3న శుక్రవారం నరసాపురానికి సీఎం జగన్ రానున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు బుధవారం తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధం సభను శుక్రవారం ఉదయం 9:30 గంటలకు నరసాపురం మెయిన్ రోడ్డులో నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. కావున వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని ప్రసాద్ రాజు పిలుపునిచ్చారు.

News May 1, 2024

ఏలూరు జిల్లాలో 1,744 పోలింగ్ కేంద్రాలు

image

ఏలూరు జిల్లాలో ఒక అనుబంధ పోలింగ్ స్టేషన్‌తో కలిపి 1,744 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ బుధవారం తెలిపారు. పోలవరం అసెంబ్లీలో 284, చింతలపూడి 273, దెందులూరు 239, ఉంగుటూరు 214, ఏలూరులో 213 పోలింగ్ కేంద్రాలు ఉండగా..  వీటికి ఆన్‌లైన్ ద్వారా ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించామన్నారు. కైకలూరు 235, నూజివీడులో 286 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

News May 1, 2024

ప.గో. జిల్లాలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు మృతి

image

ప.గో. జిల్లా ఇరగవరం మండల కేంద్రంలో విషాదం జరిగింది. మండలంలోని గోటేరు గ్రామానికి చెందిన రెడ్డిమిల్లి రక్షిత రాజు (8), మురాల మహి కలువ పువ్వులు కోసేందుకని స్థానిక చెరువులో దిగారు. ఈ క్రమంలో రక్షిత రాజు గల్లంతయ్యాడు. స్థానికులు విషయం తెలుసుకొని గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు.

News May 1, 2024

ద్వారకాతిరుమలలో రేపు పురంధీశ్వరి పర్యటన 

image

BJP రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థిని దగ్గుపాటి పురంధీశ్వరి గురువారం ద్వారకాతిరుమల మండలంలో పర్యటించనున్నారు.  ఉదయం 7 గంటలకు మారంపల్లిలో యాత్ర ప్రారంభమై గున్నంపల్లి మీదుగా కప్పలగుంట చేరుకుంటారు. మధ్యాహ్నం భోజన విరామ సమయం అనంతరం సాయంత్రం 4 గంటలకు నల్లజర్ల మండలంలోని గంటావారిగూడెం, దూబచెర్ల , నల్లజర్ల మీదుగా రాత్రి 9 గంటలకు పోతవరం చేరుకోనున్నారు.

News May 1, 2024

భీమవరం వచ్చిన నటి ఈషారెబ్బ

image

తెలుగు సినీ దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బ భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని బుధవారం దర్శించుకున్నారు. బంధువులతో కలిసి ఆలయానికి వచ్చిన వారు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు శేషవస్త్రాన్ని కప్పి సత్కరించి, అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు.