WestGodavari

News May 1, 2024

ఏలూరు: పుణ్యక్షేత్రాల యాత్రకు ప్రత్యేక రైలు

image

భారతీయ రైల్వే అనుబంధ సంస్థ IRCTC ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాల యాత్రకు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ ఏరియా మేనేజర్ రాజా ఓ ప్రకటనలో తెలిపారు. అరుణాచలం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచ్చి, త్రివేండ్రం ప్రాంతాలకు రైలు నడుస్తుందన్నారు. మే 25న సికింద్రాబాద్ నుంచి బయలుదేరి పుణ్యక్షేత్రాల సందర్శన అనంతరం జూన్ 2న చేరుకుంటుందన్నారు. పూర్తి వివరాలకు 89773 14121 సంప్రదించవచ్చని తెలిపారు.

News May 1, 2024

ఏలూరు: యువతిపై ఇద్దరి అత్యాచారం

image

ఓ యువతిని ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన ఏలూరులో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..ఏలూరు నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన యువతికి తంగెళ్లమూడికి చెందిన కాకిశ్యామ్, నక్కా ఏసురత్నం మాయమాటలు చెప్పి నగరశివారులో అద్దెకు తీసుకున్న గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో దిశ CI విశ్వం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులతో పాటు వారికి సహకరించిన షేక్ అఖిల్ బాషాను అరెస్ట్ చేశారు.

News May 1, 2024

ఏలూరు: అమ్మవారిని దర్శించుకొని వస్తుండగా తండ్రి, కూతురు మృతి

image

పెదపాడు మండలం కలపర్రు నేషనల్ హైవేపై మంగళవారం జరిగిన <<13151338>>రోడ్డుప్రమాదం<<>>లో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. SI శుభశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన యవ్వారి రుద్రరాము భార్యాపిల్లలతో బైక్‌పై విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నారు. రుద్రరాము(33), కుమార్తె రక్షశ్రీ(9) అక్కడికక్కడే మరణించారు. కేసు నమోదైంది.

News May 1, 2024

DEECET పరీక్షకు దరఖాస్తు చేసుకోండి: డీఈవో

image

ఏలూరు జిల్లాలో ఇంటర్ పాసైన విద్యార్థులకు డీఈవో అబ్రహం మంగళవారం శుభవార్త తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. DEECET-2024 ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది మే 9 వరకు ఈ పరీక్షకై ఆన్లైన్ ద్వారా https://cse.ap. gov.in & https://cse.apdeecet.apcfss.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఇవే వెబ్‌సైట్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

News May 1, 2024

జగన్ పర్యటన.. హెలిప్యాడ్‌ను పరిశీలించిన ఏలూరు ఎస్పీ

image

సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం ఏలూరు జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులతో కలిసి ఎస్పీ మేరీ ప్రశాంతి హెలికాప్టర్ దిగడానికి CRR రెడ్డి కళాశాల నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను పరిశీలించారు. భద్రతా పరమైనటువంటి అంశాలతో అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆమె వెంట జిల్లా అదనపు ఎస్పీ స్వరూప రాణి, తదితరులు ఉన్నారు

News April 30, 2024

ఏపీలో అందుకే రైల్వేస్టేషన్ల పేర్లు మారలేదు: RRR

image

టీడీపీ- జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంతో అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తులని ఎంపీ, కూటమి ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు భవిష్యత్తు గ్యారంటీని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. జగన్ ఒక దుష్టుడు అని విమర్శించారు. ఏపీలోని రైల్వే స్టేషన్‌కు జగన్ పేరు, ఫొటో వేసుకోవడం కుదరదు కనుకే ఆయా స్టేషన్ల పేర్లు మారలేదని ఎద్దేవా చేశారు.

News April 30, 2024

ప.గో.: చింతలపూడిలో అతితక్కువ మంది బరిలో

image

ఎన్నికల్లో ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఎంతమంది పోటీలో ఉంటారన్నది లెక్క తేలింది. నామినేషన్ల తిరస్కరణ, ఉపసంహరణ అనంతరం మొత్తంగా 183 మంది బరిలో ఉన్నారు. అయితే అత్యల్పంగా చింతలపూడి నియోజకవర్గంలో 8 మంది పోటీచేస్తుండగా.. అత్యధికంగా దెందులూరు, పాలకొల్లు, భీమవరం నుంచి 15 మంది చొప్పున బరిలో ఉన్నారు.

News April 30, 2024

ఏలూరు: ఘోరం.. ACCIDENTలో తండ్రి, కూతురు మృతి

image

ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు నేషనల్ హైవేపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొనగా ఘటన స్థలంలో తండ్రి, కూతురు దుర్మరణం చెందారు. కొడుకు, తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ దుర్గ గుడిని దర్శించుకుని తిరిగి ఏలూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 30, 2024

టీడీపీ నుంచి ముడియం సూర్యచంద్రరావు సస్పెండ్

image

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు, ముడియం సూర్యచంద్రరావును టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ముడియం సూర్యచంద్రరావు టీడీపీలో టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న విషయం తెలిసిందే.

News April 30, 2024

ప.గో.: టీడీపీ నుంచి శివరామరాజు సస్పెండ్

image

ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఉండి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే.