India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో గత నెల 27న జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఈ ప్రమాదంలో గాయపడిన సత్య (30) విజయవాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ప.గో. జిల్లా కొవ్వూరుకు చెందిన స్వామినాథన్, భార్య సత్య, కుమార్తె రాధాప్రియ, కుమారుడు రాకేష్, బంధువు గోపితో కలిసి కారులో వెళ్తూ లారీని ఢీ కొట్టి ట్రాలీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
☛ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో దెందులూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరులో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నట్లు పోలీసుల అంచనా.
☛ ఉమ్మడి ప.గో.లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు.
☛ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు – SPలు మేరీ ప్రశాంతి, అజిత
☛ ఘర్షణలు జరిగే ప్రాంతాల్లో అదనపు సిబ్బంది
☛ ఏలూరులో 42 అతిసమస్యాత్మక, 92 సమస్యాత్మక, ప.గో.లో అతిసమస్యాత్మక 22, సమస్యాత్మక 135 ప్రాంతాల గుర్తింపు.
➤ SHARE IT
పశ్చిమ గోదావరి జిల్లాలో పండుగప్ప చేపలకు ధర లేక రైతన్నలు దిగులు చెందుతున్నారు. 4 నెలల క్రితం పండుగప్ప కేజీ 580 రూపాయలు ఉండగా.. ప్రస్తుతం కేజీ రూ.380కి పడిపోవడంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. చేపల చెరువుల రైతులు అధికంగా పండుగప్ప జాతి చేపలను పెంచేందుకు ఆసక్తి చూపుతారు. దళారుల నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు.
విధులకు హాజరయ్యే సిబ్బంది 4వ తేదీ ఉదయం 6 గంటలకు కౌంటింగ్ సెంటర్‌కు వచ్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఏలూరులో ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులతో ఆదివారం కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ.. కౌంటింగ్ హాలులోకి సెల్ ఫోన్లు అనుమతించవద్దన్నారు.
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 3, 4, 5 తేదీల్లో మద్యం షాపులు మూసివేయనున్నారు. దీంతో మద్యం బాబులకు టెన్షన్ పట్టుకుంది. సోమవారం నుంచి బుధవారం సాయంత్రం వరకు మద్యం షాపులు మూసి వేస్తుండటంతో ఆదివారమే మద్యం కొనుగోలు చేసేందుకు మందుబాబులు ఎగబడ్డారు. మరోవైపు లిక్కర్ మాల్స్ వద్ద మద్యం నిల్వలు నిండుకున్నాయి.
ఎన్నికల్లో గెలిచేదెవరు..? ఓడేదెవరో మరికొద్ది గంటల్లో తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ సైతం విడుదల కావడంతో ఉమ్మడి ప.గో జిల్లాలో పందెంరాయుళ్లు రెచ్చిపోతున్నారు. కాయ్ రాజా కాయ్.. అని కవ్విస్తూ పందేలు కాస్తున్నారు. కూటమిదే గెలుపంటూ కొందరు.. YCPదే మళ్లీ అధికారమంటూ ఇంకొందరు భారీగా బెట్టింగ్స్ పెడుతున్నట్లు సమాచారం. ఏకంగా సోషల్ మీడియాలోనే పోస్టులు పెడుతున్నారంటే పందేలు ఎంతలా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ప.గో జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరానికి చెందిన లైన్‌మెన్ N.శ్రీనివాసరావు శనివారం తెల్లవారుజాము నుంచి కనిపించడం లేదని తోటి ఉద్యోగులు తెలిపారు. గ్రామంలో శుక్రవారం ఓ విద్యుత్ స్తంభం ఎక్కి దిగేటప్పుడు సెటప్ బాక్స్ కింద పడిపోవడంతో స్థానికులు అతడితో వాగ్వాదానికి దిగారన్నారు. పలువురు శ్రీనివాసరావుపై దాడి చేసినట్లు తెలిపారు. మనస్తాపానికి గురైన శ్రీను లెటర్ రాసి కనిపించకుండా పోయాడని చెబుతున్నారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని కొంగవారిగూడెం ఎర్ర కాలువ జలాశయంలో మత్స్యకారులకు ఆదివారం 30 కేజీల భారీ చేప చిక్కింది. ఆదివారం కావడంతో మాంసాహార ప్రియులు చేపలు కొనేందుకు ఎగబడ్డారు. దీంతో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఈ భారీ చేప చిక్కింది. దీనిని రూ.7500కు విక్రయించినట్లు వారు తెలిపారు.
ఉమ్మడి ప.గో. జిల్లాలోని ఏలూరు, నరసాపురం ఎంపీ స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని సీ-ప్యాక్ సర్వే అంచనా వేసింది. కాగా నరసాపురంలో కూటమి నుంచి భూపతిరాజు శ్రీనివాస శర్మ, వైసీపీ నుంచి గూడూరి ఉమాబాల బరిలో ఉన్నారు. అటు ఏలూరులో కూటమి నుంచి పుట్టా మహేశ్, వైసీపీ- కారుమూరి సునీల్ పోటీ చేస్తున్నారు.
– మరి మీ కామెంట్..?
ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బంధంచర్ల అటవీ ప్రాంతంలో వారం రోజులుగా పులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బంధంచర్ల – చింతలపూడి సరిహద్దు అడవిలో పులి అడుగు జాడలను శనివారం బీట్ అధికారిణి భవానీ పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఆయా ప్రాంతాల్లో కనిపించిన కాలి ముద్రలను గుర్తించి జిల్లా ఫారెస్ట్ అధికారులకు పంపుతున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.