WestGodavari

News April 29, 2024

ప.గో.: దారుణం.. కోడలిని చంపిన అత్త, మామ

image

ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. గ్రామానికి చెందిన లక్కోజు కేశవరావు, భార్య సూర్యకుమారి కలిసి కోడలు నాగ శ్రావణి(25)ని రోకలిబండతో కొట్టి హత్యచేశారు. శ్రావణి భర్త శ్రీనివాసరావు ప్రస్తుతం ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉంటున్నాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. శ్రావణి తల్లిదండ్రులు విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 29, 2024

ప.గో.లో 2 రోజులు పవన్ పర్యటన

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ప.గో. జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమ, మంగళవారాల్లో పర్యటించనున్నారు. సోమవారం పిఠాపురం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 4 గంటలకు గణపవరం చేరుకొని పోలీస్ ఐల్యాండ్ సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పిప్పర, చిటకంపాడు లాకులు మీదుగా రాత్రి 7 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకొని అక్కడ సభలో పాల్గొంటారు.

News April 29, 2024

ప.గో.: ACCIDENT.. ఇద్దరు మృతి

image

కొవ్వూరు మండలం కాపవరం శివారు హైవేపై ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఏలూరుకు చెందిన వినోద్ కుమార్ సభలకు సౌండ్ సిస్టం ఏర్పాటుచేసే పనిచేస్తుంటారు. పనిలో భాగంగా 8మందితో వ్యాన్‌లో ఆదివారం అనకాపల్లి బయలుదేరారు. కాపవరం వద్దకు రాగానే వీరివాహనం ముందువెళ్తున్న లారీని ఢీకొంది. వినోద్‌, ప్రభాకర్(21) అక్కడికక్కడే మరణించారు. మిగతా వారికి గాయాలయ్యాయి. కేసు నమోదుచేసినట్లు కొవ్వూరు గ్రామీణ SI సుధాకర్ తెలిపారు.

News April 29, 2024

ఏలూరు జిల్లాలో 2,162 అనుమతులు ఇచ్చాం: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిమిత్తం సువిధ ద్వారా 2,255 అభ్యర్థనలు వచ్చాయని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడించారు. వీటిలో 2,162 అభ్యర్థనలకు అనుమతులు ఇచ్చామన్నారు. ఇంకా 93 పరిశీలనలో ఉన్నాయన్నారు. సి-విజిల్ ద్వారా 439  ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. అటు ఎన్నికల ఉల్లంఘనలపై వచ్చిన 114 ఫిర్యాదులు పరిష్కరించామని స్పష్టం చేశారు.

News April 29, 2024

ఏలూరులో మే 1న సీఎం జగన్ సభ: ఆళ్ల నాని

image

ఎన్నికలలో ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మే 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ప్రాంతాన్ని ఆళ్ల నాని కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం బహిరంగ సభను వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News April 28, 2024

రేపు గణపవరంలో పవన్ బహిరంగ సభ

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 29న ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో వారాహి విజయభేరి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సాయంత్రం ఐదు గంటలకు జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని నాయకులు కోరారు. అలాగే ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మరాజు పాల్గొంటారని తెలిపారు.

News April 28, 2024

ప.గో.: అప్పట్లో ప్రత్యర్థులు.. ఇప్పుడు దోస్తులు

image

తాడేపల్లిగూడెం YCP అభ్యర్థి కొట్టు సత్యనారాయణ ఇప్పటివరకు 6సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. ఇది 7వ సారి. అయితే గతంలో ప్రత్యర్థులుగా తనపై బరిలో నిలిచి గెలిచిన వ్యక్తులు ఇప్పుడు ఆయన గెలుపు కోసం కృషిచేయడం గమనార్హం. 1989లో తాడేపల్లిగూడెం MLAగా గెలుపొందిన పసల కనక సుందరరావు, 2009లో గెలుపొందిన ఈలి నాని అప్పట్లో ‘కొట్టు’కు ప్రత్యర్థులే. ఇప్పుడు వారిద్దరూ కొట్టుసత్యనారాయణ తరఫున ప్రచారం చేస్తున్నారు.

News April 28, 2024

స్వతంత్ర అభ్యర్థి వేటుకూరికి సింహం గుర్తు

image

ఉండి నియోజకవర్గ రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజుకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మద్దతుగా నిలిచింది. దీంతో ఆ పార్టీ గుర్తు అయిన సింహం శివరామరాజుకు లభించింది. ఇప్పటివరకు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న శివరామరాజు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు.

News April 28, 2024

కిలో పొగాకుకు రికార్డ్ ధర

image

మునుపెన్నడూ లేని విధంగా వర్జీనియా పొగాకు రికార్డు ధర పలికింది. గోపాలపురం పొగాకు బోర్డులో కిలో రూ.341కు అమ్ముడయింది. దీంతో పొగాకు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కనిష్ఠ ధర రూ.235గా ఉంది. మొత్తం 1201 బేళ్లు అమ్మకానికి రాగా.. 980 అమ్ముడయ్యాయన్నారు . ఈ ఏడాది కొనుగోలు ప్రారంభంలో కిలో పొగాకు రూ.240 పలకడంతో రైతులు నిరాశ చెందారు. తాజాగా ఊహించని రీతిలో ధర పెరగడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News April 28, 2024

పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగింపు: కలెక్టర్

image

ఉద్యోగి ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ఓటరుగా నమోదైనా తాను విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతంలోని ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని ప.గో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్ కంటే ముందుగానే ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవడం జరుగుతుందన్నారు. దీని కొరకు మే1 వరకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.