WestGodavari

News June 1, 2024

ప.గో: కౌంటింగ్‌ కౌంట్‌డౌన్‌.. 3 రోజులే

image

కౌంటింగ్‌‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. మరో మూడు రోజుల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియతో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. దీంతో అటు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ప్రజల్లోరూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్‌కు, పోలింగ్‌కు మధ్య సుమారు 20 రోజులకుపైగా వ్యవధి ఉండటంతో జిల్లాలో పొలిటికల్‌ ఫీవర్‌ కొనసాగుతుంది. మరో వైపు జిల్లా అధికార యంత్రాంగం కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

News June 1, 2024

నేడే ఎగ్జిట్ పోల్స్.. ప.గో జిల్లా ‘పట్టం’ కట్టేదెవరికి?

image

ఎన్నికల ఫలితాల కోసం ఉమ్మడి ప.గో జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో 15 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News June 1, 2024

ఏలూరు: వివాహితపై అత్యాచారం.. కేసు నమోదు

image

ముసునూరు మండలానికి చెందిన వివాహితపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డట్లు SI వాసు తెలిపారు. సదరు వ్యక్తిపై SC, ST కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సూరేపల్లికి చెందిన చెన్నకేశవరావు కొన్నేళ్లుగా మహిళను లైంగికంగా వేధిస్తున్నాడు. గత నెల 29న ఉదయం ఆమె గేదెలు మేపేందుకు పొలాల వైపు వెళ్లగా.. అక్కడ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత కులం పేరుతో దూషించాడు. మహిళ వెళ్లి భర్తకు విషయం చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News June 1, 2024

ప.గో. జిల్లా RTC ఆర్‌ఎంగా NVR వరప్రసాద్

image

APSRTC ప.గో.జిల్లా ప్రజారవాణ అధికారిగా ఎన్వీఆర్ వరప్రసాద్ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న వీరయ్య చౌదరి పదవీవిరమణ చేయడంతో ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారిగా పనిచేస్తున్న వరప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వీరయ్యచౌదరికి సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.

News May 31, 2024

ప.గో.: తల్లి మందలింపు.. కొడుకు SUICIDE

image

తల్లి మందలించడంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప.గో. జిల్లాలో జరిగింది. కొవ్వూరు టౌన్ SI జుబేర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొవ్వూరు పట్టణం 2వ వార్డుకు చెందిన ఆనంద బాబు (32) తల్లి మహాలక్ష్మిని డబ్బులు కావాలని అడిగాడు. అయితే డబ్బులు దుబారాగా ఖర్చు చేస్తున్నావని ఆమె మందలించింది. దీంతో అతడు స్థానిక ఎరిణమ్మ ఇసుక ర్యాంపు వద్ద ఉరేసుకొని చనిపోయాడు. తల్లి ఫిర్యాదుమేరకు కేసు నమోదు నమోదుచేసినట్లు వివరించారు. 

News May 31, 2024

జూన్ 1 నుంచి గుంటూర్ ఫాస్ట్ పాసెంజర్ పునరుద్ధరణ

image

నరసాపురం- గుంటూరు మధ్య 17282 నంబర్‌తో నడిచే ఫాస్ట్ పాసెంజర్ రైలును జూన్ 1వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా ఈ రైలు గుంటూరు వరకు వెళ్లదని విజయవాడ వరకే మాత్రమే వెళ్తుందన్నారు. రైలు ఉదయం 6:05 గంటలకు నరసాపురంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు విజయవాడ చేరుకుంటుందన్నారు. 17281 నంబర్‌తో ఇదే రైలు సాయంత్రం 6:50కి విజయవాడలో బయలుదేరి రాత్రి 10:30కు నరసాపురం చేరనుందన్నారు.

News May 31, 2024

ప.గో.: ఉప్పుకు తగ్గిన డిమాండ్.. భారీగా ధర

image

తమిళనాడులో భారీవర్షాల కారణంగా ఉప్పు తయారీ నిలిచిపోయింది. ఉమ్మడి ప.గో. జిల్లాలో ఉప్పుకు డిమాండ్ పెరిగింది. వారం కిందటి వరకు 75 కేజీల బస్తా రూ.100- 150 పలకగా, ప్రస్తుతం రూ.200 దాటింది. ఉమ్మడి జిల్లాలో వందల ఎకరాల్లో ఉప్పు తయారీచేస్తున్నారు. గతంలో ఎకరాకు 800- 900 బస్తాల దిగుబడి వస్తుండగా, ఈ సారి 1,300 నుంచి 1,400 వరకు వస్తోంది. పెరగడంతో దాదాపు 7వేల మంది రైతులు, 10 వేలకు పైగా కూలీలకు లబ్ది చేకూరుతుంది.

News May 31, 2024

ఏలూరు విద్యార్థినికి రాష్ట్రస్థాయిలో 1ST RANK

image

ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలో దేవరగోపవరానికి చెందిన కేశన మీనాక్షి డీసెట్ భౌతికశాస్త్ర విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. ప్రస్తుతం పామర్రులో ప్రగతి మహిళా అకాడమీలో డిగ్రీ చదువుతుంది. తండ్రి సూర్యచంద్రరావు వ్యవసాయ కూలీ, తల్లి సునీత గృహిణి. శ్రీ జవహర్ లాల్ నెహ్రూ జడ్పీ ఉన్నత పాఠశాల పెదనిండ్రకొలను హైస్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది.  – CONGRATS మీనాక్షి.

News May 31, 2024

చిట్టవరం హైవేపై బైక్‌ను ఢీకొన్న కారు

image

ప.గో జిల్లా నరసాపురం మండలం చిట్టవరంలో 216వ జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జరిగింది. బైక్‌ను కారు ఢీకొట్టడంతో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. 216వ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం పాలకొల్లు వైపు నుంచి నరసాపురం వైపు వెళ్తున్న దంపతుల బైక్‌ను ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో దంపతులకు గాయాలు కాగా.. స్థానికులు పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News May 31, 2024

GOOD NEWS.. గ్రూప్-2 మెయిన్స్‌కు ఉచిత శిక్షణ

image

ఏలూరులోని బీసీ స్టడీ సర్కిల్లో జూన్ 1 నుంచి గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ వెల్ఫేర్ అధికారిణి నాగరాణి తెలిపారు. గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనన్నట్లు వివరించారు. జూలై 28వ తేదీన జరగనున్న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.