WestGodavari

News May 30, 2024

ప.గో: నేడు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పర్యటన

image

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
ముఖేష్ కుమార్ మీనా గురువారం భీమవరం రానున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు భీమవరం SRKR  ఇంజినీరింగ్ కాలేజీ, విష్ణు కాలేజీలలో కౌంటింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్‌లను ఆయన తనిఖీ చేస్తారు. సాయంత్రం భీమవరం నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తారని కలెక్టర్ పేర్కొన్నారు.

News May 30, 2024

ఏలూరు: దాడి చేస్తారనే భయంతో సూసైడ్

image

తనపై దాడి చేస్తారనే భయంతో భీమడోలుకు చెందిన జయరాజు మజ్జిగలో పురుగు మందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. జయరాజు ఈనెల 27న కొంతమందితో గొడవపడ్డాడు. అయితే వారు తిరిగి తనపై దాడి చేస్తారనే భయంతో బుధవారం పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

ప.గో.: చంద్రబాబు నాయుడిని కలిసిన RRR 

image

అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును బుధవారం HYDలోని ఆయన స్వగృహంలో ఉండి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. కాసేపు రాజకీయ అంశాలపై చర్చించారు. 

News May 29, 2024

ప.గో.: 60 మందిపై కేసులు: DSP

image

ప.గో. జిల్లా పెంటపాడు మండలం రావిపాడులో పోలీసులపై జరిగిన దాడి ఘటనలో 60 మందిపై కేసులు నమోదు చేసినట్లు తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి తెలిపారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దాడిలో ఒక SI, నలుగురు కానిస్టేబుల్స్ తీవ్రంగా గాయపడ్డారన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు 60 మందిపై కేసులు పెట్టామని, ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. CI రమేశ్ ఉన్నారు.

News May 29, 2024

ఏలూరు: ACCIDENT.. వ్యక్తి మృతి

image

ఏలూరు జిల్లా తాళ్ళపూడిలో మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందినట్లు SI శ్యాంసుందర్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చిడిపి గ్రామానికి చెందిన బండారు శ్రీనివాస్, స్నేహితుడు లక్ష్మణ్‌తో కలిసి సురయ్యపేట వైపు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. లక్ష్మణ్‌కు తీవ్రగాయాలు కావడంతో రాజమండ్రి ఆస్పత్రికి తరలించామన్నారు.

News May 29, 2024

జంగారెడ్డిగూడెం: మహిళతో రాసలీలలు.. డిస్మిస్

image

జంగారెడ్డిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్ మహేష్ రెడ్డిని శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఏఈ రాధాకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. 29వ తేదీ ఉదయం 3 గంటల సమయంలో విద్యుత్ అంతరాయం కలిగిందని స్థానికులు కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ మద్యం మత్తులో స్పృహ లేకుండా మహిళతో ఉన్నట్లు రుజువు కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

News May 29, 2024

అత్తిలి: రైల్వే గేటు మూసివేత

image

అత్తిలి మండలం పరిధిలోని గవర్లపాలెం రైల్వే గేటు వద్ద రాకపోకలు ఈనెల 31వరకు నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతుల నిమిత్తం రైల్వే గేటు మూసివేస్తున్నట్లు చెప్పారు. బుధవారం నుంచి 31సాయంత్రం 7 గంటల వరకు రాకపోకలు నిలిపివేస్తున్నామన్నారు. వాహనదారులు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని కోరారు.

News May 29, 2024

పెంటపాడులో హై టెన్షన్

image

పెంటపాడు మండలం రావిపాడులో <<13329601>>తీవ్ర ఉద్రిక్తత<<>> నెలకొంది. రావిపాడులో జరిగిన అల్లర్లకు తాడేపల్లిగూడెం ఆర్డీవో కే.చెన్నయ్య, తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి రంగంలోకి దిగారు. పోలీసులు ఉన్నతాధికారులపై దళిత సంఘాలు రాళ్లు విసిరారు. దాడిలో పెంటపాడు ఎమ్మార్వో , తాడేపల్లిగూడెం ఎస్సై, ముగ్గురు కానిస్టేబుల్ కు గాయాలు అయినట్లు సమాచారం.

News May 29, 2024

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏలూరు ఖైదీ మృతి

image

చెట్టుపై నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఖైదీ చింతారావు (44) మంగళవారం మృతి చెందారు. ఈ నెల 26న ఏలూరుకు చెందిన చింతారావు చెట్టుపై నుంచి పడ్డారు. ఐదేళ్ల క్రితం హత్య కేసులో సెంట్రల్ జైలుకు వచ్చిన ఆయన.. సత్ప్రవర్తన ఉండటంతో ఓపెన్ ఎయిర్ జైల్లో ఉంచారు.

News May 29, 2024

ప.గో.: 6 రోజుల్లో నేతల భవితవ్యం.. గెలుపుపై టెన్షన్

image

ప్రజలు ఎన్నికల తీర్పునిచ్చి 15 రోజులైంది. మరో 6 రోజుల్లో నేతల భవితవ్యం వెలువడనుంది. రోజులు గడుస్తున్నా కొద్దీ ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లోని అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. కార్యకర్తలు, అభిమానులు ఎవరికి వారు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యర్థే MLA అంటూ వాహనాలకు ముందస్తుగానే స్టిక్కర్లు అతికించేస్తున్నారు. మరోవైపు బెట్టింగుల జోరు నడుస్తోంది. – మీ వద్ద పరిస్థితి ఏంటి.?