WestGodavari

News May 28, 2024

ప.గో.: ACCIDENT.. వ్యక్తి మృతి

image

ప.గో. జిల్లా పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగరాజు రామరాజు (63) బైక్‌పై వెళ్తుండగా.. స్థానిక వంతెన వద్ద ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మరణించాడు. బైక్‌పై ఉన్న మరోవ్యక్తి షేక్ సత్తార్‌కు తీవ్రగాయాలవగా పాలకొల్లు ఆసుపత్రికి తరలించారు.  

News May 28, 2024

నరసాపురంలో ఆలిండియా టోర్నీ.. గెలిస్తే రూ.64వేలు

image

నరసాపురంలోని అల్లూరి సత్యనారాయణ రాజు సాంస్కృతిక కేంద్రంలో మంగళవారంఆల్ ఇండియా ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నీ ప్రారంభమైంది. పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త నూలి శ్రీనివాస్ ఏడేళ్లుగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఏడాది జరుగుతున్న టోర్నీలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి రూ.64 వేల నగదు, జ్ఞాపికను బహుమతిగా అందజేయనున్నారు.

News May 28, 2024

ద్వారకాతిరుమల శ్రీవారికి బంగారు కిరీటం బహూకరణ

image

ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవస్థానానికి మంగళవారం దాతలు స్వామి వారికి బంగారు కిరీటాన్ని బహూకరించారు. ఎం, శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు 139 గ్రాముల బంగారు కిరీటాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ అర్చకులు కిరీటాన్ని స్వామి వారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలకు స్వామి వారి ప్రసాదాలను అందజేశారు.

News May 28, 2024

ఏలూరు: పోలీసుల గస్తీ.. ప్రతి వాహనం పరిశీలన

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి వేళలో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓట్ల లెక్కింపు జరిగే వరకు అన్ని ప్రాంతాలలో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ముందస్తు చర్యల్లో భాగంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

News May 28, 2024

కొవ్వూరు: రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

image

కృష్ణా జిల్లా కోడూరుపాడు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొవ్వూరుకు చెందిన స్వామినాథన్, రాజేశ్, రాధాప్రియ, స్వామి నాథన్ అన్న కుమారుడు మృతి చెందారు. తమిళనాడుకు చెందిన స్వామినాథన్ 15 ఏళ్ళ క్రితం కుటుంబంతో వచ్చి కొవ్వూరులో స్థిరపడ్డారు. కుమారుడు రాజేశ్, కూతురు రాధ తమిళనాడులో చదువుతున్నారు. వేసవి సెలవులకు కొవ్వూరు వచ్చిన వీరు తిరిగి సోమవారం కారులో తమిళనాడు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

News May 28, 2024

ఏలూరు: స్ట్రాంగ్‌రూమ్‌లను పరిశీలించిన SP

image

ఏలూరు జిల్లా కేంద్రంలోని సీఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను SP మేరీ ప్రశాంతి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అధికారులకు సూచించారు.  

News May 27, 2024

తణుకు: ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. రిమాండ్

image

తణుకు పట్టణానికి చెందిన ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి 14 రోజులపాటు రిమాండ్ విధించినట్లు పట్టణ SI శ్రీనివాస్ తెలిపారు. పట్టణానికి చెందిన చదలవాడ తిమోతి అనే వ్యక్తి తన ఇంటి సమీపంలోని బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో వారు కేసునమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు.

News May 27, 2024

కొవ్వూరు: జేసీబీ ఢీ.. వృద్ధురాలు మృతి

image

జేసీబీ ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం కొవ్వూరులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాజీవ్ కాలనీకి చెందిన యాదగిరి నూకమ్మ (70)ను వాటర్ ట్యాంక్ సమీపంలో జేసీబీ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న కొవ్వూరు టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

News May 27, 2024

ప.గో.: కూటమి అభ్యర్థి గెలుపు కోసం.. మోకాళ్లపై మెట్లెక్కి

image

ప.గో. జిల్లా పెంటపాడు మండలం రావిగుంటకు చెందిన పెంకి శ్రీను కూటమి అభ్యర్థి గెలుపు కోసం మోకాళ్లపై గుడిమెట్లు ఎక్కి మొక్కు చెల్లించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని కోరుతూ సోమవారం దేవరపల్లి మండలం గౌరీపట్నం నిర్మలగిరి మేరీ మాత మందిరాన్ని దర్శించారు. ఈ సందర్భంగా 350 మెట్లను మోకాళ్ళపై ఎక్కి మొక్కు తీర్చుకున్నట్లు శ్రీను తెలిపారు.

News May 27, 2024

ప.గో.: నేటి నుంచి డెమో రైళ్ల పునరుద్ధరణ

image

రైల్వే ట్రాక్, ఇతర నిర్వహణ పనులు కారణంగా జిల్లాలో 10 రోజులుగా రద్దయిన డెమో రైళ్లు సోమవారం నుంచి పట్టాలెక్కనున్నాయి. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, నిడదవోలు నుంచి నడిచే అన్ని రైళ్లు గతంలో మాదిరిగా షెడ్యూల్ ప్రకారం నడవనున్నాయి. అలాగే భీమవరం, నరసాపురం నుంచి నడిచే డెమో రైళ్లు కూడా గతంలో నడిచిన విధంగానే షెడ్యూల్ సమయాలకు బయలుదేరనున్నాయి.