India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రైల్వే ట్రాక్, ఇతర నిర్వహణ పనులు కారణంగా జిల్లాలో 10 రోజులుగా రద్దయిన డెమో రైళ్లు సోమవారం నుంచి పట్టాలెక్కనున్నాయి. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, నిడదవోలు నుంచి నడిచే అన్ని రైళ్లు గతంలో మాదిరిగా షెడ్యూల్ ప్రకారం నడవనున్నాయి. అలాగే భీమవరం, నరసాపురం నుంచి నడిచే డెమో రైళ్లు కూడా గతంలో నడిచిన విధంగానే షెడ్యూల్ సమయాలకు బయలుదేరనున్నాయి.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం జూన్ 1వ తేదీన ఏలూరులోని జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశానికి జడ్పీ అధ్యక్షులు ఘంటా పద్మశ్రీ అధ్యక్షత వహిస్తారన్నారు. సమావేశానికి జిల్లా పరిషత్ సభ్యులు, జిల్లా అధికారులు, హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
ఏలూరులోని శాస్త్రీకాలనీలో విషాదం చోటుచేసుకుంది. యడ్లపల్లి వికాస్ సోమవారం ఇంట్లోనే ఉరివేసుకొని మృతి చెందాడు. వికాస్ ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి ఇటీవలే వేరే శాఖకు బదిలీ అయినట్లు సమాచారం. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వికాస్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జమూరులోని అజ్జాలమ్మ గుడి సమీప మలుపులో సోమవారం లారీ ఢీకొని పీతల నందమ్మ(75) మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నందమ్మ మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.
పండ్ల రారాజైన ‘మామిడి’కి ఈ ఏడాది మంచి డిమాండ్ ఉండటంతో ఉమ్మడి ప.గో జిల్లాలో దళారులు అక్రమ మార్గాలకు తెరదీస్తున్నారు. కార్బైడ్, ఇథిలిన్ వంటి రసాయనాలతో కాయలను మగ్గబెడుతున్నారు. ఇలాంటి ఆరోపణలున్నా అధికారులు దాడులు చేసిన దాఖలాలు లేవు. కెమికల్స్‌తో మగ్గబెట్టిన పండ్లు తింటే క్యాన్సర్, అల్సర్, కాలేయ వ్యాధుల బారిన పడే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు నీటితో పండ్లు కడితే మేలని సూచిస్తున్నారు.
భార్య ఉండగానే భర్త మరో పెళ్లి చేసుకున్న ఘటనలో 12మందిపై కేసు నమోదు చేసినట్లు SI సత్యనారాయణరాజు తెలిపారు. ప.గో జిల్లా నరసాపురంలోని బొంతవారివీధికి చెందిన ముదినపల్లి దుర్గామాణిక్యానికి, సూరేపల్లికి చెందిన దుర్గారావుకు 2014లో వివాహమైంది. ఉపాధి నిమిత్తం దుర్గామాణిక్యం విదేశాలకు వెళ్లగా.. భర్త మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో పెళ్లికి సహకరించిన పాస్టర్, రెండో భార్య బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నికల ఫలితాలకు మరో వారమే ఉండగా.. పిఠాపురంలో ‘నేమ్ ప్లేట్స్’ ట్రెండ్ నడుస్తోంది. ‘పిఠాపురం MLA గారి తాలూకా’ అంటూ జనసైనికులు, పవన్ అభిమానులు నేమ్ ప్లేట్స్ చేయించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ‘డిప్యూటీ CM వంగా గీత’ అంటూ ఓ కారుపై రాసి ఉన్న ఫొటోను వైసీపీ నేతలు, కార్యకర్తలు షేర్ చేస్తున్నారు. ఎవరి కాన్ఫిడెంట్‌లో వారున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తాడేపల్లిగూడెం పట్టణంలోని వ్యవసాయ పరీక్ష కేంద్రంలో ఆదివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నెక్కంటి రాంబాబు, MDR.శివప్రసాద్ ఎన్నికయ్యారు. వీరితో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు వేణుమాధవరావు, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.
IPL-2024 ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం విజయం సాధించాలని ఓ కళాకారుడు పెన్సిల్‌పై ఆంగ్లంలో గెట్ రెడీ SRH అంటూ చెక్కారు. ప.గో. జిల్లా నరసాపురం పట్టణంలోని రుస్తుంబాదకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కొప్పినీడి విజయ్ SRH విజయాన్ని కాంక్షిస్తూ ఈ కళాఖండాన్ని ఆవిష్కరించారు. కాగా ఆయన లిఖితపూడి సచివాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్నారు.
ఏడేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తణుకు పట్టణంలో ఆదివారం జరిగింది. స్థానిక ఎన్టీఆర్ పార్కు సమీపంలో నివాసం ఉంటున్న చదలవాడ తిమోతి స్థానికంగా ఉంటున్న ఏడేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత బాలిక విషయాన్ని ఇంట్లో చెప్పడంతో తిమోతీని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.