WestGodavari

News May 25, 2024

ప.గో: ALERT.. చలామణిలో భారీగా నకిలీ నోట్లు

image

ఉమ్మడి ప.గో జిల్లాలో భారీగా నకిలీ నోట్లు చలామణి అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ ఆయా పార్టీల తరఫున ఓటర్లకు తాయిలాలు అందాయి. నేతలు పంపిణీ చేసిన నగదులో రూ.500, రూ.200 నోట్లు ఎక్కువగా ఉండగా, అందులో చాలావరకు నకిలీవి ఉన్నట్లు సమాచారం. కొనుగోళ్ల ద్వారా ఇవి మార్కెట్‌లోకి వస్తుండటంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. గెలుపోటములపై జరుగుతున్న బెట్టింగ్స్‌లోనూ నకిలీ నోట్లు చలామణి అవుతున్నట్లు తెలుస్తోంది.

News May 25, 2024

ప.గో: మామపై బ్లేడ్‌తో దాడి చేసిన అల్లుడు

image

ప.గో జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి HYDలో మామపై బ్లేడ్‌తో దాడి చేశాడు. మధురానగర్ పోలీసుల వివరాల ప్రకారం.. HYDలోని యాదగిరినగర్‌కు చెందిన మాధవికి 2024 మార్చిలో సుబ్రహ్మణ్యంతో వివాహమైంది. ఇద్దరికీ అది రెండో పెళ్లి. సుబ్రహ్మణ్యం మాధవిని వేధిస్తుండటంతో పుట్టింటికి వచ్చింది. శుక్రవారం మాధవి ఇంటికి వచ్చిన సుబ్రహ్మణ్యం మామతో గొడవపడి బ్లేడుతో గాయపర్చాడు. సుబ్రహ్మణ్యం వివరాలు తెలియాల్సి ఉంది.

News May 25, 2024

ప.గో: గోదావరి స్నానాలకు వెళ్లే వారికి హెచ్చరిక

image

గోదావరి స్నానాలకు అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమించి ప్రమాదాల బారిన పడవద్దని కొవ్వూరు రూరల్‌ SI సుధాకర్‌ హెచ్చరించారు. మద్దూరులంక, విజ్జేశ్వరం, ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద రేవులు ప్రమాదకరంగా ఉన్నందున ఎవరూ నదీ స్నానాలకు రావొద్దన్నారు. గోదావరి ప్రమాదకరంగా ఉండటంతో పాటు నాచు ఉండటంతో స్నానానికి దిగిన వారు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారు. కాగా.. ఇప్పటికే గోదావరిలో మునిగి చాలామంది ప్రాణాలు కోల్పోయారు.

News May 25, 2024

పోలవరం పునరావాస బాధితుడి ఆత్మహత్యాయత్నం

image

పోలవరం పునరావాస బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయం వద్ద దేవీపట్నానికి చెందిన ఉండమట్ల సీతారామయ్య(73) పురుగు మందు తాగాడు. పరిహారం, R&R ఇవ్వడం లేదని, ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేదంటూ పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. వెంటనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

News May 25, 2024

ఏలూరు అత్యాచార ఘటనపై స్పందించిన షర్మిల

image

ఏలూరు జిల్లా మండవల్లిలో టెన్త్ విద్యార్థినిపై క్లాస్ రూంలోనే తోటి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. దీనిపై ‘X’ వేదికగా వైఎస్.షర్మిల స్పందించారు. ‘లండన్‌లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న CM జగన్‌కు రాష్ట్రంలో మహిళల ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవా..?. ఈ ఘటనపై మీ మహిళా మంత్రులు , నాయకులు సిగ్గుతో తల దించుకుంటారో, సిగ్గు లేకుండా మిన్నకుండుపోతారో..? ప్రజలు గమనిస్తున్నారు’ అని అన్నారు.

News May 25, 2024

5 రోజుల పాటు చేబ్రోలు రైల్వేగేటు మూసివేత

image

చేబ్రోలు రైల్వే గేటును ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మూసివేయనున్నారు. ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ కారణంగా తాత్కాలికంగా గేటును మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. కాబట్టి దూబచర్ల, జంగారెడ్డిగూడెం వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News May 24, 2024

ప.గో.: బ్యాంకులో మహిళకు గుండెపోటు.. కుప్పకూలి మృతి

image

తణుకు పట్టణంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆవరణలో ఓ మహిళ గుండెపోటుతో మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఆలపాటి లక్ష్మీనారాయణమ్మ తన భర్తతో కలిసి శుక్రవారం నగదు లావాదేవీల నిమిత్తం బ్యాంకుకు వచ్చారు. ఈ క్రమంలో లక్ష్మీనారాయణమ్మ (55) గుండెపోటుతో బ్యాంకులోనే కుప్పకూలి మృతి చెందారు.

News May 24, 2024

భీమవరం: కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకిన స్టూడెంట్

image

భీమవరంలోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి అదే కాలేజ్ భవనం పైనుంచి దూకేసిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. మొదటి నుంచి చదువులో ప్రతిభ కనబరుస్తూ వచ్చిన అతడి ప్రవర్తనలో ఇటీవల మార్పు వచ్చింది. రోజులాగే బుధవారం కళాశాలకు వెళ్లిన విద్యార్థి.. హఠాత్తుగా భవనం పైనుంచి దూకేశాడు. తీవ్రగాయాలు కాగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా.. దీనిపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

News May 24, 2024

ప.గో: ఓట్ల లెక్కింపు.. 1PMకు తొలి ఫలితం!

image

ఓట్ల లెక్కింపుపై ఉమ్మడి ప.గో.లో ఉత్కంఠ నెలకొంది. ప.గో జిల్లాలో తొలి ఫలితం నరసాపురం కాగా.. ఏలూరు జిల్లాలో ఏలూరు అసెంబ్లీ ఫలితం ఫస్ట్ వెల్లడికానుంది. నియోజకవర్గానికి 14 టేబుల్స్‌ చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు-16 రౌండ్లు, ఉంగుటూరు-16, కైకలూరు-18, దెందులూరు-18, చింతలపూడి-21, పోలవరం-22, నూజివీడు-22 రౌండ్లలో ఫలితాలు తేలనున్నాయి. తొలి ఫలితం 1PM, తుది ఫలితం 6PMకు వెల్లడికానున్నట్లు తెలుస్తోంది.

News May 24, 2024

ఏలూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం గండిగూడెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న పాల వ్యాన్‌ను ద్విచక్రవాహనం వెనకనుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. కాగా.. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.