WestGodavari

News May 24, 2024

ఎన్నికల కేసుల నుంచి చింతమనేనికి ఊరట

image

ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో నిందితుడిగా ఉన్న దెందులూరు మాజీ MLA చింతమనేని ప్రభాకర్‌కు తాత్కాలిక ఊరట లభించింది. జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జూన్ 4న కౌంటింగ్ ఉన్నందున అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలన్న పిటిషనర్ల అభ్యర్థనతో న్యాయస్థానం ఏకీభవించింది. వారి కదలికలపై పోలీసులతో నిఘా ఉంచాలని ఈసీని కోర్టు ఆదేశించింది.

News May 24, 2024

గంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలి: ఏలూరు డీఈవో

image

ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసిన 50 పరీక్ష కేంద్రాలలో టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని డీఈవో అబ్రహం తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 11,500 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఈ నేపథ్యంలోనే ఏలూరులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదులు ఉంటే నెం.8121840400కు ఫోన్ చేయాలన్నారు. గంట ముందు పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని విద్యార్థులకు సూచించారు.

News May 24, 2024

ప.గో: సప్లిమెంటరీ పరీక్షలు.. 30ని ముందే అనుమతి

image

ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు అధికారులు పలు సూచనలు చేశారు. ఏలూరు జిల్లాలో ఈ పరీక్షలకు 27 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇంటర్-8,664 మందికి ఉ.9గంటల నుంచి మ.12 వరకు, సెకండ్ ఇంటర్-4,133 మందికి మ.2:30 నుంచి సా.5: 30 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 30 నిమిషాల ముందే కేంద్రంలోకి అనుమతి ఇస్తామన్నారు. ఫిర్యాదులుంటే 08812 230197కు ఫోన్ చేయాలన్నారు.

News May 24, 2024

ప.గో.: సరిగ్గా 11 రోజులు.. ఉత్కంఠ

image

ఎన్నికల ఫలితాలకు సరిగ్గా నేటి నుంచి 11 రోజులు ఉంది. ఒక్కోరోజు గడుస్తున్నా కొద్దీ అభ్యర్థులు సహా.. పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో ఎక్కడ చూసినా ఫలితాలపైనే చర్చ జరుగుతోంది. పలుచోట్ల ఎవరికి వారు గెలుపుపై అంచనాలు వేస్తూ బెట్టింగులు వేస్తున్నారు. మరి మన ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో ఎవరు గెలుస్తారో చూడాలి. మరోవైపు అధికార యంత్రాంగం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద నిరంతరం భద్రత చర్యలు తీసుకుంటోంది.

News May 23, 2024

ప.గో: రైలు పట్టాలపై మహిళ మృతదేహం

image

నిడదవోలు – చాగల్లు రైల్వే స్టేషన్ల మధ్య నిన్న రాత్రి గుర్తు తెలియని మహిళ మృతి చెంది పడి ఉన్నట్లు తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు. దారవరం రైల్వే గేటు సమీపంలో డౌన్ లైన్ పక్కన మహిళ మృతదేహం లభ్యమైందని, సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందని తెలిపారు. వివరాలేమీ లభ్యం కాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

News May 23, 2024

ఏలూరు: చిన్నారితో అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు

image

ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన 8 ఏళ్ల చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 40 ఏళ్ల వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు SI కుటుంబరావు తెలిపారు. చిన్నారి తినుబండారాలు కొనుక్కునేందుకు దుకాణానికి వెళ్లగా.. దుకాణదారుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఇంటికి వచ్చి కుటుంబీకులకు చెప్పగా.. వారు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News May 23, 2024

ఓట్ల లెక్కింపు.. ప.గో జిల్లాలో తొలి ఫలితం ఇదే 

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి తొలి ఫలితం నరసాపురం అసెంబ్లీ నుంచి వెలువడనున్నది . నరసాపురం పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 14 టేబుల్స్‌పై కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 12 రౌండ్లలో నరసాపురం, 13 రౌండ్లలో ఆచంట, 14 రౌండ్లలో పాలకొల్లు, 15 రౌండ్లలో తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి ఫలితాలు వెల్లడికానున్నాయి. 17వ రౌండ్‌లో భీమవరం ఫలితం వెలువడనుంది.

News May 23, 2024

ఏలూరు: దారుణం.. స్కూల్ గదిలోనే బాలికపై అత్యాచారం

image

ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. మండవల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై చింతపాడుకు చెందిన బాలుడు అత్యాచారానికి పాల్పడ్డట్లు SI రామచంద్రారావు తెలిపారు. బాలిక ఈనెల 15న ఫ్రెండ్ పిలిచిందని స్కూల్ దగ్గరికి వెళ్లింది. ఆ సమయంలో బాలుడు ఆమెను బలవంతంగా గదిలోకి లాక్కెల్లి ఆత్యాచారం చేయగా.. మరో నలుగురు వీడియో తీసి బాలిక తల్లికి పంపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు.

News May 23, 2024

నన్ను జైలులోనే చంపాలని చూశారు: రఘురామ

image

జగన్‌ చేస్తున్న తప్పులపై ప్రశ్నించినందుకు తనను జైలులో పెట్టించి, అక్కడే చంపాలని చూశారని MP రఘురామకృష్ణరాజు అన్నారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. ‘నా పుట్టిన రోజునే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పుడే చనిపోయినట్లు భావించా. తెల్ల పేపర్‌పై సంతకం చేయాలని కస్టడీలో ముగ్గురు ముసుగులేసుకొని చిత్రహింసలకు గురి చేశారు. జగన్‌‌లో మార్పు రావాలనుకున్నా.. చివరికి ఆయన్నే మార్చాలన్నా ఆలోచన వచ్చింది’ అని అన్నారు.

News May 23, 2024

ఏలూరు: స్ట్రాంగ్ రూములను పరిశీలించిన డీఐజీ

image

ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్నికల అనంతరం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను డీఐజీ అశోక్ కుమార్ బుధవారం పరిశీలించారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ పరిసరాలలో సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.