India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీ దూరవిద్య ద్వారా జూన్ 1 నుంచి 8 వరకు నిర్వహిస్తున్న టెన్త్, ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్ష హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో పొందుపరిచామని జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. www.apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు ఉన్నాయని చెప్పారు. లేదా ఓపెన్ స్కూల్స్ సెంటర్ల కో-ఆర్డినేటర్ల నుంచి హాల్ టికెట్స్ పొందవచ్చు అని స్పష్టం చేశారు.
ముత్యాపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఐసెట్టి మల్లిఖార్జునరావు బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. మొగల్తూరుకు చెందిన మల్లిఖార్జునరావు గత ఏడాది బండి ముత్యాలమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం తన ఇంటిలో ఉండగా ఉదయం 6గంటల సమయంలో ఒక్కసారిగా గుండె పోటు రావడంతో అదే నిమిషంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఏలూరు జిల్లాలో విధ్వంసానికి ప్రయత్నించే అల్లరి మూకను తిప్పి కొట్టడానికి శాఖ టీంలు రెడీగా ఉన్నాయని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం ఏలూరులో జరిగిన మాక్ డ్రిల్, మాబ్ ఆపరేషన్ అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. అల్లర్లు సృష్టించాలని రోడ్డు ఎక్కేవారు ఒకసారి తమ కుటుంబాల గురించి కూడా ఆలోచించి రోడ్డుపైకి వెళ్లాలని సూచించారు. ఏది ఏమైనా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు.
పెదవేగి మండలం మండూరు పంచాయతీ పరిధి బొడ్డువారిగూడెంలో బడుగు ధనలక్ష్మి (39) అనే వివాహిత ఊరికి వేలాడుతూ విగతజీవిగా బుధవారం స్థానికులకు కనిపించింది. దీంతో వారు మండల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటు మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్విచక్రవాహనం ముందెళ్తున్న ఇటుక ట్రాక్టర్ నుంచి ఓ ఇటుక కిందపడగా దానిపై నుంచి బైక్ వెళ్లడంతో అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల సాయంతో వారిని జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్‌కి తరలించారు.
పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప.గో. జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుమంట్ర మండలం భట్లమగుటూరుకు చెందిన పి.శివకుమార్ (22) తండ్రి మందలించాడని మనస్తాపం చెంది పొలంలో పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతణ్ని స్థానికులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు.
ఏలూరు జిల్లాలో ఒక CI, ఇద్దరు SIలు, ఐదుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. సత్రంపాడుకు చెందిన అవుటుపల్లి సీతయ్య 2021లో ఓ హోటల్‌లో భోజనం చేసి, బిల్లుచెల్లించే విషయంలో హోటల్ నిర్వాహకులతో గొడవైంది. PSలో ఫిర్యాదుచేయగా.. అప్పటి CI ఆదిప్రసాద్, SIలు నాగబాబు, కిషోర్ బాబు కానిస్టేబుళ్లతో కలిసి కొట్టారని మానవహక్కుల కమిషన్‌కు విన్నవించారు. విచారించిన మొబైల్ కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈనెల 24 నుంచి జూన్ 1 వరకు జరిగే ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ.వీరయ్య చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసే విద్యార్థులందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
భీమవరం పట్టణంలోని ఓ హోటల్‌లో ఈనెల 13న బిర్యానీలో చనిపోయిన ఎలుక వచ్చినట్లు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిన్న (సోమవారం) తనిఖీలు నిర్వహించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫుడ్ సేఫ్టీ అధికారి రామిరెడ్డి ఆహార పదార్థాలు పరిశీలించారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపామని, నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
కొవ్వూరు మాజీ MLA పెండ్యాల కృష్ణబాబు మృతికి సంతాపంగా బుధవారం కొవ్వూరు మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పరిమి రాధాకృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అన్ని వ్యాపారవర్గాలు గమనించి సహకరించాలని సూచించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణబాబు మార్కెట్ అభివృద్ధికి విశేష సేవలు అందించారని కొనియాడారు. కాగా.. రేపు దొమ్మేరులో కృష్ణబాబు అంత్యక్రియలు జరగనున్నాయి.
Sorry, no posts matched your criteria.