India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు జిల్లాలోని పోలవరం నియోజకవర్గం నుంచి MLA అభ్యర్థులుగా బరిలో నిలిచిన 12 మందిలో 8 మంది బుట్టాయగూడెం మండలానికి చెందినవారే కావడం విశేషం. మిగతా నలుగురు జీలుగుమిల్లి మండలం వారు. వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మిది మండలంలోని దుద్దుకూరు కాగా, కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన దువ్వెల సృజనది ఇదే మండలంలోని కోయరాజమండ్రి గ్రామం. ఇక కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజుది జీలుగుమిల్లి మండలంలోని బర్రిలంకపాడు గ్రామం.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడు నుంచి ఏలూరు వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ మీర్జాపురం వద్దకు రాగానే టైర్ పేలి పోవడంతో అదుపుతప్పి హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు వస్తున్న ఆటోను ఢీ కొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ప.గో. జిల్లా యలమంచిలి మండలం కుమ్మరిపాలేనికి చెందిన పవన్ (19) ఇటీవల ఇంటివద్ద కొబ్బరిచెట్టు మీదపడగా గాయపడ్డాడు. విశాఖ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందాడు. అవయవదానం చేస్తే మరొకరికి ప్రాణం పోస్తాయని ఆలోచించి పుట్టెడు దు:ఖంలోనూ తల్లిదండ్రులు శ్రీనివాస రావు, శ్రీదేవి ముందుకొచ్చారు. కుమారుడి అవయవాలను విశాఖ కిమ్స్‌లో దానం చేశారు. అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు జరిపారు.
కొత్తిమీర ధర వినియోగదారులను హడలెత్తిస్తోంది. ప.గో జిల్లా పెనుగొండ మండలంలోని పలు మార్కెట్లలో శనివారం కిలో కొత్తిమీర రూ.100 పలికిందని తెలిపారు. స్థానికంగా పంట లేకపోవడంతో బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి వ్యాపారులు కొత్తిమీర దిగుమతి చేస్తున్నారని, దీంతో రవాణా ఛార్జీలతో కలుపుకొని కేజీ కట్ట రూ.100 పలుకుతోందని చెబుతున్నారు. ధర చూసిన వినియోగదారులు హడలెత్తిపోతున్నారు.
భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపానికి గురై భర్త ఆత్మహత్మ చేసుకున్నాడు. నిడదవోలు మండలం తాడిమల్లకు చెందిన దిరిసిమిల్లి పోతురాజు(47) శనివారం పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా కొద్దిరోజులుగా విడిగా జీవనం సాగిస్తున్నారన్నారు. పోతురాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య నాగలక్ష్మి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ప.గో జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ శనివారం హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ శాంతియుతంగా జరిగిందని తెలిపారు. 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఎస్‌ఆర్‌కేఆర్, విష్ణు కళాశాలలో భద్రపరిచామన్నారు. ఓట్ల లెక్కింపు వరకు, లెక్కింపు రోజుల ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావుండొద్దని అన్నారు.
ఎన్నికల నేపథ్యంలో తూ.గో కలెక్టర్ సూచనల మేరకు నన్నయ విశ్వవిద్యాలయంలో రోజువారి కార్యక్రమాలను జూన్ 6 వరకు నిలిపివేస్తున్నట్లు వీసీ కె.పద్మరాజు తెలిపారు. ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి, ఓట్ల లెక్కింపు కోసం టేబుల్స్, స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న కారణంగా క్యాంపస్‌ను ‘నో మ్యాన్ జోన్’గా కలెక్టర్ ప్రకటించారని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు సహకరించాలని వీసీ కోరారు.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ టైర్ పేలడంతో ఆ ట్యాంకర్ అదుపుతప్పి ఆటోను ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న కారణంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నూజివీడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం అప్పనవీడులో వేంచేసియున్న అభయ ఆంజనేయ స్వామిని సినీ హీరో సాయిధరమ్ తేజ్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దెందులూరు జనసేన పార్టీ ఇన్‌ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి శాలువాతో ఆయణ్ను సత్కరించారు. అనంతరం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
చేపల చెరువు వద్ద పనిచేసే ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతిచెందిన ఘటన ఏలూరు జిల్లా పెదపాడు మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కొనికి గ్రామానికి చెందిన పండు చైతన్యబాబు (28) అదే గ్రామంలోని శివప్రసాదరాజుకు చెందిన చేపల చెరువుకు కాపలాదారుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం చెరువుగట్టుపై విద్యుత్తు తీగతెగిపడి ఉండటాన్ని గమనించక కాలు వేయగా విద్యుదాఘాతానికి గురవడంతో అక్కడికక్కడే చనిపోయాడు.
Sorry, no posts matched your criteria.