India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ప.గో. జిల్లాలో గడిచిన 7 నెలల్లో 162 రోడ్డుప్రమాదాలు జరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రమాదాల్లో 1426 మంది క్షతగాత్రులవగా, 138 మంది మృత్యువాత పడ్డారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఉమ్మడి జిల్లా వ్యా్ప్తంగా మొత్తం 280 బాక్ల్ స్పాట్లను గుర్తించారు. అయితే చాలా చోట్ల హెచ్చరిక బోర్డులు, ప్రమాద సూచికలు లేవనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
‘వందే భారత్’ రైలును ఏలూరులో ఆపేందుకు రైల్వే ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ దేవేంద్రకుమార్ హామీ ఇచ్చారని ఏలూరు ఎంపీ మహేశ్ కుమార్ తెలిపారు. వందే భారత్‌ను ఏలూరులో ఆపాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ఆపేలా చేస్తామని చెప్పారన్నారు.
నాగపూర్ డివిజన్ పరిధిలోని పలు రైళ్లను విజయవాడ, బలార్ష, నాగ్‌పూర్ మీదుగా దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. రైలు నంబరు 12807/12808 విశాఖపట్నం- హజ్రత్ నిజాముద్దీన్ (ఆగస్టు 6, 10, 11, 12, 13, 14, 15, 18 తేదీల్లో), 22815/22816 ఎర్నాకుళం- బిలాస్‌పూర్ (ఆగస్టు 12, 14 తేదీల్లో), 22847/22848 ఎల్‌టీటీ ముంబయి- విశాఖపట్నం(ఆగస్టు 18,20 తేదీల్లో) దారి మార్చుతున్నట్లు తెలిపారు.
తాడేపల్లిగూడెం మండలానికి చెందిన ఓ బాలిక (16)ను అక్కుపల్లి గోకవరం పంచాయతీ పరిధి గోపరాజుపాడుకు చెందిన వివాహితుడు గుల్లపల్లి వెంకన్న ప్రేమపేరుతో వెంటపడ్డాడు. భార్యకు విడాకులిచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో నల్లజర్లలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి లోబర్చుకున్నాడు. ఈ 19న HYD తీసుకెళ్లి ఇటీవలే ఇంటివద్ద వదిలేశాడు. బాలిక ఈ విషయం తల్లికి చెప్పగా పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదైంది.
ఏలూరు జిల్లా కారాగారాన్ని శుక్రవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ సందర్శించారు. కారాగారంలో ఖైదీలకు అందిస్తున్న ఆహారం, నీరు, వైద్య సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ కేసులలో ఉన్న ముద్దాయిలకు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం ద్వారా ఉచితంగా కేసులు వాదిస్తామన్నారు. సెప్టెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు.
ఉండి నియోజకవర్గంలో మొదటి రోజే 99శాతం ఫించన్ల పంపిణీ చేశామని MLA రఘురామకృష్ణరాజు (RRR) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని, అందుకోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. పెంచిన ఫించన్ రూ.4,000 అందుకున్న లబ్ధిదారుల కళ్లలో ఆనందం చూసి తన కళ్లు చెమ్మగిల్లాయని ఆయన అన్నారు.
విద్యార్థులు, అభ్యాసకులు ఏపీ ఓపెన్ స్కూల్‌లో చేరేలా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని ప.గో కలెక్టర్ నాగరాణి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఓపెన్ స్కూల్‌లో చేరుటకు ఆసక్తితో ఉన్న పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు పెనాల్టీ లేకుండా ప్రవేశ ఫీజు చెల్లించుటకు ఆగస్టు 27 వరకు గడువు ఉందన్నారు. రూ.200 పెనాల్టీతో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చునని తెలిపారు. ☞ SHARE IT..
ఉమ్మడి ప.గో జిల్లాలో జూన్ 24 నుంచి 27 వరకు జరిగిన డీఈఎల్ఈడీ ఫోర్త్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయని ఏలూరు డీఈవో అబ్రహం శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సంబంధించిన డమ్మీ మెమోను “www.bse.ap.gov.in” వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. రీకౌంటింగ్ కొరకు సీఎఫ్ఏంఎస్ ద్వారా రూ.500 చెల్లించి దరఖాస్తుతో చలానా, మెమోను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం విజయవాడకు పంపాలన్నారు. SHARE IT..
ప.గో జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా ప్రమోషన్‌లో శుక్రవారం సినీ నటి నిహారిక కొణిదెల పాల్గొన్నారు. ఆమెతో పాటు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కళాశాల పాలకవర్గ కార్యదర్శి సుబ్బారావు హాజరయ్యారు. వంశీ దర్శకత్వంలో యువతకు ప్రాధాన్యతనిచ్చే చిత్రాన్ని తాను నిర్మించినట్లు నిహారిక వెల్లడించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ప్రకాశం చౌక్ సెంటర్‌లో ఓ కారుపై భారీ హోర్డింగ్ విరిగిపడింది. షాపు ముందు కారు పార్క్ చేస్తున్న సమయంలోనే బోర్డు పడిపోవడంతో ముందు భాగం దెబ్బతింది. అయితే.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Sorry, no posts matched your criteria.