WestGodavari

News April 11, 2024

గోదావరిలో దూకి ఫ్యామిలీ గల్లంతు?

image

యలమంచిలి మండలం చించినాడ వశిష్ఠ గోదావరి వంతెనపై నుంచి దూకి బుధవారం కుటుంబం గల్లంతైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భీమవరానికి చెందిన కిషోర్ కుమార్, భార్య యోచన, కుమార్తె శ్రీనిధి అమలాపురంలో ఉంటున్నారు. అయితే వీరు ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆ నిర్ణయం తీసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీరి బ్యాగు, ఫోను, చించినాడ గోదావరి వంతెనపై ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 11, 2024

ఏలూరు జిల్లాలో 12 బాల్య వివాహాలు అడ్డగింత

image

ఏలూరు జిల్లా గడిచిన 48 గంటల్లో 12 బాల్యవివాహాలను అడ్డుకొనడం జరిగిందని శాఖ మహిళా అధికారులు బుధవారం తెలిపారు. పద్మావతి మాట్లాడుతూ.. ఆడ పిల్లంటే భయం కాదు.. అభయం అని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. ఆడ పిల్లలు ఉన్నత శిఖరాలు అధిరోహించేలా విద్య నేర్పాలన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా తమకు సమాచారం ఇవ్వాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిని పద్మావతి, సూర్యచక్రవేణి సూచించారు.

News April 10, 2024

ఉండి టీడీపీ శ్రేణుల వరుస రాజీనామాలు

image

ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు టిక్కెట్ మారుస్తున్నారు అంటూ వస్తున్న ప్రచారానికి రామరాజు అభిమానులు పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. ఈ రాజీనామా లేఖను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపినట్లుగా కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈ రాజీనామాలు నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు చేసినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.

News April 10, 2024

ప.గో: 2 నెలలు బంద్..కారణం ఇదే..!

image

ప.గో జిల్లాలో ఈనెల 15 నుంచి జూన్ 16 వరకు సముద్రాలలో అన్ని రకాల చేపల వేటలు నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు మత్స్య శాఖ అధికారి కె.భారతి తెలిపారు. సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించి వాటి సంతతిని ప్రోత్సహించడమే ఉద్దేశమన్నారు. ఉత్తర్వులు ధిక్కరించి చేపల వేటకు వెళితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 10, 2024

ప.గో 70 కేసులు ఉన్న దొంగ అరెస్ట్

image

కొవ్వూరుకు చెందిన షేక్ నాగూర్ వలిని మంగళవారం అరెస్ట్ చేశామని అవనిగడ్డ ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. అవనిగడ్డ యూనియన్ బ్యాంకులో రుణం చెల్లించేందుకు సోమవారం రూ.50 వేలు తెచ్చిన వృద్ధురాలు వాకా కృష్ణకుమారిని నమ్మించి నగదుతో పరారయ్యాడు. కాగా నాగూర్ వలి గజదొంగ అని అతనిపై 70 కేసులు ఉన్నాయన్నారు. బ్యాంకులకు వచ్చే వృద్ధులను టార్గెట్ చేసుకొని వారిని నమ్మించి మోసం చేస్తుంటాడని తెలిపారు.

News April 10, 2024

ప్రలోభాలుంటే సమాచారం ఇవ్వండి: ఏలూరు ఎస్పీ

image

ఏలూరు జిల్లాలో సోమవారం సాయంత్రం 7గంటల నుంచి మంగళవారం సాయంత్రం 7 వరకు రూ.22 వేల విలువ కలిగిన 88.60 లీటర్ల మద్యం, బెల్లం ఊట-1200 లీటర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రూ.7,61,460 నగదును సీజ్ చేశారని ఎస్పీ మేరీ ప్రశాంతి వెల్లడించారు. ప్రలోభాలకు సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని ప్రజలకు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు.

News April 10, 2024

ప.గో: నేడు ప్రజాగళం సభ.. CBN షెడ్యూల్ ఇదే

image

ప.గో జిల్లా తణుకు పట్టణంలో బుధవారం ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించనున్నారు. చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. మధ్యాహ్నం 3:35 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఎస్ఎంవీఎం పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 3:45 గంటలకు నరేంద్ర సెంటర్ చేరుకుంటారు. సాయంత్రం 5:30 వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం 7:00 నుంచి 8:30 వరకు నిడదవోలులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

News April 9, 2024

కాంగ్రెస్ ఏలూరు MP అభ్యర్థిగా కావూరి లావణ్య

image

ఏలూరు MP అభ్యర్థిగా కావూరి లావ‌ణ్యను కాంగ్రెస్ ఖరారు చేసింది. ఇక్కడి నుంచి కావూరి సాంబ‌శివ‌రావు 2004, 2009 ఎన్నిక‌ల్లో 2సార్లు ఎంపీగా గెలిచారు. ఈసారి ఎన్నికల్లో ‘కావూరి’ ఫ్యామిలీకి చెందిన NRI లావ‌ణ్య కాంగ్రెస్ త‌ర‌పున బరిలో దిగుతున్నారు. సాంబశివరావు కేంద్ర మంత్రిగా ఏలూరులో త‌నదైన ముద్ర వేశారు. కాగా.. ఇక్కడ వైసీపీ నుంచి కారుమూరి సునీల్ కుమార్, కూటమి నుంచి పుట్టా మహేశ్ బరిలో ఉన్నారు.

News April 9, 2024

నరసాపురం MLA అభ్యర్థిగా రామచంద్ర యాదవ్

image

భారత చైతన్య యువజన పార్టీ మొదటి జాబితాను ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆకుల వెంకటస్వామికి టికెట్ కేటాయించారు. ప్రముఖ న్యాయవాదిగా, మాజీ కౌన్సిలర్‌గా పని చేశారు. జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులుగా, నరసాపురం పార్లమెంటరీ కో-ఆర్డినేటర్‌గా పనిచేసి రాజీనామా చేశారు.

News April 9, 2024

పవన్ కళ్యాణ్‌తో రఘురామ భేటీ

image

చేబ్రోలులో పవన్ కళ్యాణ్‌‌తో రఘురామ కృష్ణరాజు భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎంపీగా పోటీ చేస్తానో, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానో అసంపూర్తిగా ఉందని, దీనిపై పవనే త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డే పిఠాపురంలో ఉన్నా .. పవన్‌కు 65వేలకు పైగా మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.