WestGodavari

News May 15, 2024

ప.గో.: బెట్టింగులు.. రాజకీయ విశ్లేషణలు

image

ఎన్నికలు ముగిసినప్పటికీ.. ఇంకా విజేత ఎవరనేది తెలియాలంటే దాదాపు 20 రోజులు వేచిచూడాల్సిందే. ఈ క్రమంలో ఉమ్మడి ప.గో. జిల్లాలో పలు చోట్ల అభ్యర్థుల గెలుపు ఓటములపై బెట్టింగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఏ గ్రామంలో చూసినా యువత, పెద్దలు రాజకీయ విశ్లేషణలు చేస్తూ ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. కాగా మన ఉమ్మడి ప.గో.లో మొత్తం 15 నియోజకవర్గాలున్నాయి. – ఏ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుందంటారు.

News May 14, 2024

ఏలూరు: ACCIDENT.. మామాఅల్లుడు మృతి

image

ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికుల వివరాలు.. ఏలూరులోని సత్యనారాయణపేటకు చెందిన గొర్రెల ప్రకాష్(30) వృత్తిరీత్యా పాలిష్ వర్క్ చేస్తుంటాడు. మంగళవారం మేనమామ రంగారావు(50)తో కలిసి బైక్‌పై పెదవేగి మండలం వేగివాడకు బయలుదేరాడు. దెందులూరు మండలం నాగులదేవునిపాడు వద్ద టిప్పర్ లారీ ఢీ కొంది. ప్రకాష్ అక్కడికక్కడే మృతిచెందగా, రంగారావు ఏలూరు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు.

News May 14, 2024

కూటమికి 130 సీట్లు వస్తాయి: హరిరామ జోగయ్య

image

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 130 స్థానాల్లో గెలవబోతుందని కాపు బలిజ సంక్షేమ శాఖ అధ్యక్షులు, మాజీ మంత్రి చేగుండి హరిరామ జోగయ్య తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీకి 107 సీట్లు, జనసేన పార్టీకి 18 సీట్లు, భారతీయ జనతా పార్టీకి 5 సీట్లు వస్తాయని ఆయన పేర్కొన్నారు.

News May 14, 2024

తాజా అప్‌డేట్: ఉమ్మడి ప.గో.లో అత్యధిక పోలింగ్ ఇక్కడే

image

ఉమ్మడి ప.గో జిల్లాలో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. ఏలూరు జిల్లాలో అత్యధికంగా 83.04%.. పశ్చిమ గోదావరి జిల్లాలో 81.12% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గాల వారీగా చూస్తే.. ఉంగుటూరులో అత్యధికంగా 87.75%, అత్యల్పంగా ఏలూరులో 71.02% పోలింగ్ నమోదైంది.
NOTE: పూర్తి గణాంకాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. పోలింగ్ శాతం మరింత పెరగొచ్చు.

News May 14, 2024

ప.గో.: ఓట్ల పండగ ముగిసింది.. మీరు ఓటేశారా..?

image

ఐదేళ్లకు ఓ సారి వచ్చే ఓట్ల పండగ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు మినహా మిగతా అంతా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. కాగా సాయంత్రం 6 గంటల వరకు వచ్చిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లాలో 68.98, ఏలూరు జిల్లాలో 71.10 పోలింగ్ శాతం నమోదైంది. ఇంతకీ మీరు ఓటు వేశారా..? మీ వద్ద పోలింగ్ ఎలా జరిగింది..?
– కామెంట్ చేయండి.

News May 13, 2024

ఏలూరు: ఓటు వేయడానికి వెళ్తూ.. మృతి

image

ఏలూరు పోలీస్ స్టేషన్ పరిధి గిలకలగేటు వద్ద సోమవారం రైలు నుండి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. ఎస్ఐ నరసింహారావు వివరాలు తెలిపారు. మృతుడు మాచిరెడ్డి శ్రీ మహావిష్ణు(34) నిడదవోలు మండలం రాయ్‌పేటలోని భూపతి వెంకటరాజు వీధికి చెందినవాడని తెలిపారు. హైదరాబాద్ నుంచి ఓటు వేయడానికి వెళ్తున్న క్రమంలో రైలు నుండి జారిపడి మృతి చెందాడని పేర్కొన్నారు.

News May 13, 2024

ప.గో.: ఓటేసిన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను

image

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని కాలింగగూడెం గ్రామంలో జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లతో కలిసి క్యూలైన్లో నిల్చొని ఓటు హక్కు వేశారు. అలాగే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా గ్రామానికి వచ్చి ఓటు హక్కు వేయడం తన బాధ్యత అని తెలిపారు.

News May 13, 2024

ప.గో.: మరో గంటన్నర మాత్రమే ఉంది.. వేకప్

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా కొన్నిపోలింగ్ కేంద్రాల్లో ప్రధాన పార్టీలకు చెందిన నాయకుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరగగా పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు త్వరగా ఓటేసేందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఓటు వేయనట్లయితే త్వరగా వెళ్లండి.
– SHARE IT

News May 13, 2024

తీవ్ర విషాదం.. ట్రావెల్స్ బస్సు ఢీకొని బాలుడి మృతి

image

ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో గొన్నూరి రాజు-మరియమ్మ దంపతుల కుమారుడు సిద్ధూ(3) మృతి చెందాడు. వీరు ఆదివారం నల్లజర్ల మండలం దూబచర్లలో బంధువుల ఇంట్లో శుభాకార్యానికి వెళ్లారు. అక్కడ సిద్దూ మారాం చేయగా.. బైక్‌పై తీసుకెళ్తున్న క్రమంలో ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. సిద్ధూపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

News May 13, 2024

ఏలూరు జిల్లాలో పోలింగ్ సిబ్బందికి సత్కారం

image

ఏలూరు జిల్లా గోదావరి నది మధ్యలో ఉన్న కసనూరు గిరిజన తండా ప్రజలు పోలింగ్ సిబ్బందికి వారి సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఈ ప్రాంతంలో 472 మంది ఓటర్లు ఉన్నారు. కసనూరు గ్రామానికి ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వస్తే కొండారెడ్డి గిరిజన తెగవారు వారి సంప్రదాయం ప్రకారం స్వాగతం పలకడం, సత్కరించడం ఆనవాయితీ. పోలింగ్ సిబ్బంది వస్తున్నారని తెలుసుకున్న గిరిజన ప్రజలు సిబ్బందికి ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు.