India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు జిల్లాలో ఉన్న 16.37 లక్షల ఓటర్లను మే 13వ తేదీన ఓటు వేయమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ శనివారం వినూత్న రీతిలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలోని సెయింట్ థెరీసా మహిళా డిగ్రీ కళాశాలలో దీపాలు వెలిగించి జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని చెప్పారు.
రాజకీయ నాయకుడి జీవితాన్ని జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థితో పోలిస్తే.. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు (జాబ్ నోటిఫికేషన్). నేటితో ముగిసిన నెల రోజుల ప్రచారం ప్రిపరేషన్ అన్నమాట. ఇక నేతలందరికీ 13న పరీక్ష(ఓటింగ్). 22 రోజులకే ఫలితాలు. ఉమ్మడి ప.గో.లో 15 జాబ్స్ (MLA స్థానాలు) ఉండగా.. మొత్తం 181 మంది (నామినేషన్లు) పరీక్ష రాశారు. వీరిలో టాప్ ర్యాంక్‌తో జాబ్ కొట్టేవారు ఎవరెవరో కామెంట్ చేయండి.
ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని పేర్కొంటూ పలువురిని పార్టీ ప.గో జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఏఎంసీ ఛైర్మన్ సాగి సాంబశివరాజు, బురిడి రవి, మోపిదేవి శ్రీనివాస్, వత్సవాయి సూర్యనారాయణ రాజు, శ్రీనివాస్, సుజాత, అనంతలక్ష్మితో పాటు కాళ్ల మండలానికి చెందిన వెంకట్రావు తదితరులను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు ప్రభుత్వ, 16 ప్రైవేట్ ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ వి.శ్రీనివాసరాజు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 10న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు అనంతరం సమీపంలోని ఎన్‌ఆర్‌పీ అగ్రహారం, ఆచంటలోని ఐటీఐ కళాశాలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకొని రసీదు పొందాలన్నారు.
ప్రచారఘట్టానికి నేటి సాయంత్రంతో తెరపడనుండగా.. ఉభయ గోదావరి జిల్లాల్లోనే పిఠాపురం క్లైమాక్స్ ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్ వంగా గీతకు మద్దతుగా ప్రసంగించి ఇక్కడే ప్రచారానికి ఫిన్షింగ్ టచ్ ఇవ్వనున్నారు. అటు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సైతం తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం వచ్చి పూజలు చేయనున్నారు. అనంతరం బాబాయ్ కళ్యాణ్ కోసం అబ్బాయ్ చరణ్ ప్రచారం చేస్తారా..?, ఏమైనా మాట్లాడుతారా..? అనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. నేటి సాయంత్రంతో ఆ క్రతువు ముగియనుంది. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి. – మన ప.గో. జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది..?
ఎన్నికల నేపథ్యంలో రేపు సాయంత్రం నుంచి 48 గంటలు పాటు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. దీంతో భీమవరం పట్టణంలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు పోటెత్తారు. ఇప్పటికే దుకాణాలలో మద్యం నిల్వలు చాలా వరకు అమ్ముడయ్యాయని నిర్వాహకులు చెబుతున్నారు.- మీ వద్ద పరిస్థితి ఏంటి..?
ఏలూరు జిల్లా కామవరపుకోటకు చెందిన వీరమల్ల మధు కుటుంబీకులు ‘ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు.. డబ్బులు తీసుకోము కానీ తప్పకుండా ఓటు వేస్తాము’ అనే బ్యానర్‌ను ఇంటి గేటుకు ఏర్పాటుచేశారు. కాగా ఈ బ్యానర్ పలువురిని ఆలోచింపచేస్తుంది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ఎవరూ ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు.
భీమవరంలో రేపు జరగవలసిన బీజేపీ అగ్రనేత అమిత్ షా రోడ్‌షో రద్దయింది. షా బిజీ షెడ్యూల్ వల్ల ఈ కార్యక్రమం రద్దయినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిలో రైతుల మధ్య మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని ఉండి నియోజకవర్గ కూటమి MLA అభ్యర్థి రఘురామకృష్ణరాజు తెలిపారు. ‘రచ్చబండ’ కార్యక్రమంలో భాగంగా గురువారం ప.గో. జిల్లా పెదఅమిరంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ 5 నెలల కింద నగదు విడుదల చేసిన పథకాలకు డబ్బు జమ చేయాలంటూ కోర్టుకు వెళ్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
– RRR వ్యాఖ్యలపై మీరేమంటారు..?
Sorry, no posts matched your criteria.