WestGodavari

News May 10, 2024

ప.గో జిల్లాలో భారీగా బంగారం, వెండి సీజ్

image

ప.గో జిల్లా భీమవరం మండలం లోసరి చెక్‌పోస్ట్ వద్ద ఉదయం రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో రూ.1.87 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పాటు రెండున్నర కిలోల బంగారం, ఐదున్నర కిలోల వెండిని సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో వాటిని సీజ్ చేశామని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 10, 2024

ప.గో: ఈ MLA అభ్యర్థులిద్దరిది ఒకే ఊరు.. ఒకే పార్టీ

image

ఒకే ఊరికి చెందిన ఇద్దరు MLA అభ్యర్థులు ఒకే పార్టీ నుంచి వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. వారే శ్రీరంగనాథరాజు, పీవీఎల్ నరసింహరాజు. ప.గో జిల్లా ఉండి మండలం యండగండికి చెందిన వీరిద్దరూ వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. శ్రీరంగనాథరాజు ఆచంట నుంచి.. పీవీఎల్ ఉండి నుంచి పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లోనూ వీరిద్దరూ పోటీ చేయగా.. శ్రీరంగనాథరాజు పితాని సత్యనారాయణపై గెలిచారు. పీవీఎల్ మంతెన శివరామరాజుపై ఓడారు.

News May 10, 2024

నేడు ఉండికి చంద్రబాబు.. రూట్‌మ్యాప్ ఇలా..

image

ఉండిలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలో పాల్గొననున్న విషయం తెలిసిందే. ఉదయం 9.30 గంటలకు హెలికాప్టర్‌లో భీమవరం చేరుకుంటారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో ఉండి ప్రధాన వంతెన కూడలి వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 10 గంటలకు సభ ప్రారంభం కానున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామరాజు కోరారు.

News May 10, 2024

11న సాయంత్రం నుంచి 144 సెక్షన్: కలెక్టర్లు

image

ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేందుకు ఈ నెల 11న 6pm నుంచి 14న సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పశ్చిమ గోదావరి, ఏలూరు కలెక్టర్లు ఓ ప్రకటన విడుదల చేశారు. సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడం నిషేధమని తెలిపారు. జనం గుంపులు గుంపులుగా, అయిదుగురి కంటే ఎక్కువ మంది సమూహంగా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని కోరారు.

News May 10, 2024

ప.గో.: నేడే చంద్రబాబు ప్రజాగళం

image

ఉండి నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నేడు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండి ప్రధాన కూడలిలో నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొంటారని నియోజకవర్గ కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు తెలిపారు. కూటమి పార్టీల నాయకులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అటు ఏలూరులోనూ పర్యటించనున్నారు.

News May 9, 2024

ఏలూరు: కూటమి అభ్యర్థి ప్రచారంలో RGV హీరోయిన్

image

ఏలూరు జిల్లా తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామంలో కొవ్వూరు నియోజకవర్గ కూటమి MLA అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు గురువారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో సినీ నటుడు శివాజీ, హీరోయిన్ శ్రీ రాపాక పాల్గొన్నారు. గతంలో శ్రీ రాపాక గోపాలపురం నియోజకవర్గం నుంచి సీఎం జగన్ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా కూటమి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. 

News May 9, 2024

ప.గో.: ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’ 

image

ఎన్నికలొచ్చాయంటే పోటీలో నిలిచే నాయకులంతా తమకే ఓటు వేసి గెలిపించాలంటూ ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తుంటారు. కొందరు ఓటు వేయండని నగదు సైతం పంపిణీ చేస్తారు. అయితే ప.గో. నరసాపురం మండలం రుస్తుంబాద గ్రామానికి చెందిన మొహమ్మద్ జాన్ అలైజా అనే యువకుడు ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’ అనే కరపత్రం ఇంటిగేటుకు అతికించాడు. నిజాయితీగా పనిచేసే రాజకీయ నాయకుడికి తమ కుటుంబం ఓటు వేస్తుందని చెబుతున్నారు.

News May 9, 2024

తాళ్ళపూడిలో నటుడు శివాజీ ప్రచారం

image

ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సినీనటుడు శివాజీ అన్నారు. గురువారం సాయంత్రం ఆయన తాళ్ళపూడి మండలం గజ్జరంలో కొవ్వూరు కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందీశ్వరి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి రాకపోతే ఇండియా మ్యాప్‌లో ఏపీ కనుమరుగవుతుందన్నారు.  

News May 9, 2024

ప.గో.: CM పర్యటన వాయిదా

image

ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం నియోజవర్గంలో రేపటి సీఎం పర్యటన వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిగూడెం పట్టణానికి సీఎం జగన్ రావాల్సి ఉంది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మంగళగిరి, నగరి ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమానికి హాజరు కావలసి ఉంది. దీంతో తాడేపల్లిగూడెం పర్యటన తాత్కాలికంగా వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News May 9, 2024

ప.గో.: రేపు చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదే

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఈ నెల 10వ తేదీన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు ఉండి జంక్షన్‌లో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు చింతలపూడి పట్టణంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారని నాయకులు తెలిపారు.