WestGodavari

News April 4, 2024

పెనుమంట్రలో 110 మంది వాలంటీర్ల రాజీనామా

image

పెనుమంట్ర మండలంలో భారీగా వాలంటీర్లు రాజీనామా చేశారు. పెనుమంట్ర, మార్టేరు, సోమరాజు ఇల్లింద్రపర్రు, మల్లిపూడి, నెగ్గిపూడి, వెలగలేరు, ఆలమూరు తదితర గ్రామాలలో దాదాపు 110 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి సంబంధిత అధికారులకు రాజీనామా పత్రాలు అందచేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతీ విషయలో వాలంటీర్లను బూచీగా చూపిస్తున్నారని, ఈ పరిణామాలతో విసుగు చెంది రాజీనామా చేసినట్లు వారు వెల్లడించారు.

News April 4, 2024

పెనుమంట్ర మండలంలో బారీగా వాలంటీర్ల రాజీనామా

image

పెనుమంట్ర మండలంలో భారీగా వాలంటీర్లు రాజీనామా చేశారు. పెనుమంట్ర, మార్టేరు, సోమరాజు ఇల్లింద్రపర్రు, మల్లిపూడి, నెగ్గిపూడి, వెలగలేరు, ఆలమూరు తదితర గ్రామాలలో దాదాపు 110 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి సంబందిత అధికారులకు రాజీనామా పత్రాలు అందచేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతీ విషయలో వాలంటీర్లను బూచీగా చూపిస్తున్నారని, ఈ పరిణామాలతో విసుగు చెంది రాజీనామా చేసినట్లు వారు వెల్లడించారు.

News April 4, 2024

పెదపాడు జాతీయ రహదారిపై మరో ప్రమాదం

image

పెదపాడు మండల పరిధిలోని తాళ్లమూడి జాతీయ రహదారిపై గురువారం ఉదయం రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో టీడీపీ నాయకులు సుగ్గసాని గంగయ్యతో పాటు ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో గన్నవరం విమానాశ్రయం నుంచి దుగ్గిరాల వస్తున్న చింతమనేని ప్రమాద పరిస్థితిని చూసి హైవే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News April 4, 2024

నరసాపురంలో చంద్రబాబు బహిరంగ సభ

image

మాజీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నరసాపురంలో నిర్వహించే బహిరంగ సభకు కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్‌ కళాశాలలో చంద్రబాబు హెలికాప్టర్‌లో దిగనున్నారు. అక్కడి నుంచి నరసాపురం వరకు రోడ్‌ షో నిర్వహించి, సభలో ప్రసంగిస్తారు.

News April 4, 2024

కొవ్వూరు: ఇద్దరి యువకులపై పోక్సో కేసు నమోదు

image

బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఇద్దరి యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు. కొవ్వూరు మండలం వాడపల్లికి చెందిన ఓ బాలికను అదే గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్, అతని సోదరుడు అఖిల్ సహకారంతో ప్రేమిస్తున్నానని వెంటపడి బుధవారం అసభ్యంగా ప్రవర్తించి, దౌర్జన్యం చేశారు. దీనిపై బాలిక కొవ్వూరు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు యువకులపై ఎస్సై జుబేర్ పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News April 4, 2024

ప.గో : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

image

పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా వాసులు మృతి చెందారు. టాటా ఏస్ వ్యాన్‌ని లారీ ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను కేజీహెచ్‌కి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News April 4, 2024

అలా జరిగితే పోలవరంలో ఓడిపోతాం: TDP

image

ఏడుళ్లుగా టీడీపీ పోలవరం ఇంఛార్జ్ బొరగం శ్రీనివాస్ ప్రజాధారణ పొందారని ఆ పార్టీ నాయకులు చెప్పారు. పోలవరం మండలం కొత్త దేవరగొందిలో వారు మీడియాతో మాట్లాడారు. బొరగం శ్రీనుకు తప్ప ఇంకెవరికి ఇచ్చినా పోలవరంలో టీడీపీ ఓడిపోతుందన్నారు. శ్రీనివాసులకు ఇస్తే తమ ఏడు మండలాల ప్రజలు కలిసి ఎమ్మెల్యేగా గెలిపిస్తామని స్పష్టం చేశారు.

News April 4, 2024

ప్రకటనలకు ముందస్తు అనమతి పొందాలి: సుమిత్ కుమార్

image

జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రకటనలకు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్‌, మానిటరింగ్‌ కమిటీ ముందస్తు ఆమోదం పొందాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. వివిధ టీవీ ఛానల్స్‌లో రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రకటనలు, సమావేశాలు, ర్యాలీలను క్షుణంగా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.

News April 3, 2024

ఎండలో వృద్ధులను నిలబెట్టిన పాపం జగన్‌దే: రఘురామ

image

పింఛన్ల కోసం నడిరోడ్డుపై ఎండలో వృద్ధులను నిలబెట్టిన పాపం జగన్ దేనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. వృద్ధాప్య పింఛన్లు తీసుకునే 56 లక్షల మందిలో ఏ ఒక్కరు కూడా జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేయవద్దని కోరారు. ఇద్దరు ప్రభుత్వ అధికారులతో కలిసి మండుటెండల్లో వృద్ధులను నిలబెట్టడానికి జగన్ కుట్ర చేశారన్నారు. ఈ కుట్రను ప్రజలు, ప్రత్యేకించి పింఛన్ లబ్ధిదారులు అర్థం చేసుకోవాలన్నారు.

News April 3, 2024

పోడూరు: లారీ ఢీకొని దంపతుల మృతి

image

పోడూరు మండలం జగన్నాధపురంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న దంపతులను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే వారు మృతిచెందారు. మృతులను పెనుగొండ మండలం కొఠాలపర్రు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు.