WestGodavari

News April 3, 2024

ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు చర్యలను చేపట్టండి: జేసీ

image

భీమవరం జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జేసీ ప్రవీణ్ ఆదిత్య పౌరసరఫరాలు, వ్యవసాయ, కోపరేటివ్ శాఖ, తూనికల, కొలతలు అధికారుల, జిల్లా రైస్ మిల్లర్స్ సంఘంతో సమీక్షించారు. జిల్లాలో ప్రస్తుత 2023-24 రబీ సీజన్లో రైతు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర చెల్లించాలన్నారు. గ్రేడ్ ఎరకం క్వింటాకు
రూ.2203 అందించి, ధాన్యం సేకరణ చేయాలన్నారు. 

News April 3, 2024

ప.గో.: టీడీపీ- బీజేపీ- JSP కూటమి అధినాయకులకు విజ్ఞప్తి

image

టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి అధినాయకులకు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య బుధవారం ఒక విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 25% జనాభా ఉన్న కాపు కులస్థులకు కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో వారి సంతృప్తి మేరకు హామీలను ప్రకటించాలన్నారు. బీసీలతో సమానంగా సంక్షేమ సౌకర్యాలు, పెళ్లి ఖర్చుల నిమిత్తం కానుకగా రూ.లక్ష ఇవ్వాలన్నారు. జనాభా ప్రాతిపదికన కాపు కార్పొరేషన్ సంక్షేమ బడ్జెట్, అలాగే రిజర్వేషన్లు కేటాయించాలన్నారు.

News April 3, 2024

ఏలూరు: నేటి నుంచి ఇంటివద్దనే పింఛన్ల పంపిణీ

image

సామాజిక పింఛన్లను ఈ నెల 3వ తేదీ (నేటి) నుంచి 6వ తేదీ వరకు పంపిణీ చేయాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలను పాటిస్తూ ఆయా తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పింఛన్లు పంపిణీ చేయాలన్నారు. దివ్యాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, చక్రాల కుర్చీకి పరిమితమైన వారికి ఇంటి వద్దే పింఛన్లు అందించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News April 2, 2024

ప.గో.: రూ.50 వేలకు మించి తీసుకెళ్తే నగదు సీజ్

image

ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికి అక్కడ వాహన తనిఖీలను ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో 50 వేలకు మించి నగదు సరైన ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తే సీజ్ చేస్తున్నారు. కావున నగదు తీసుకెళ్లే వారు తప్పనిసరిగా సంబంధిత పత్రాలు ఉండేలా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News April 2, 2024

ఏలూరు: చంద్రబాబుతో భేటీ అయిన మాగంటి బాబు

image

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏలూరు ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలని ఎవరైనా కోరారా అని చంద్రబాబును అడిగారు. టికెట్ మార్పుపైనా చర్చించగా.. సీటు మార్చడం కుదరదని చంద్రబాబు స్పష్టంచేశారన్నారు. తనకు రాజ్యసభలో చోటు కల్పిస్తామని చెప్పినట్లు మాగంటి మీడియాతో తెలిపారు. 

News April 2, 2024

ప.గో. జిల్లాలో 12 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..

image

కొవ్వూరు – అరిగెల అరుణకుమారి, నిడదవోలు- పెద్దిరెడ్డి సుబ్బారావు, పాలకొల్లు- కొలుకులూరి అర్జునరావు, నరసాపురం- కనురి ఉదయ భాస్కర కృష్ణ ప్రసాద్, భీమవరం- అంకెం సీతారాం, ఉండి- వేగేశ్న వెంకట గోపాలకృష్ణ, తణుకు- కడలి రామరావు, తాడేపల్లిగూడెం- మర్నీడి శేఖర్, ఉంగుటూరు- పాతపాటి హరికుమార రాజు, దెందులూరు- అలపాటి నరసింహ మూర్తి, పోలవరం- దువ్వెల సృజన, చింతలపూడి- ఉన్నమట్ల ఎలీజా.

News April 2, 2024

31 ఓట్ల అత్యల్ప మెజార్టీతో MLAగా ఎన్నిక

image

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 1952-2019 వరకు 17సార్లు ఎన్నికలు జరిగాయి. వీటిలో 1987వ సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఈలి వరలక్ష్మి.. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన పి.కనక సుందరరావుపై 31 ఓట్ల అత్యల్ప మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వరలక్ష్మికి 42,062 ఓట్లు రాగా.. కనక సుందరరావుకు 42,031 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటివరకు ఈ నియోజకవర్గ చరిత్రలో ఇదే అత్యల్ప మెజార్టీ.

News April 2, 2024

ప.గో: ఎలక్షన్@2024.. పోలింగ్ శాతం పెరిగేనా..?

image

ఉమ్మడి ప.గో జిల్లాలో 2019లో పోలింగ్ శాతం ఇలా ఉంది. కొవ్వూరు-86.4%, నిడదవోలు-82.7%, ఆచంట-79.6%, పాలకొల్లు-82.2%, నరసాపురం-81.1%, భీమవరం-77.9%, ఉండి-84.7%, తణుకు-81.1%, తాడేపల్లిగూడెం-80.3%, ఉంగుటూరు-86.8%, దెందులూరు-84.8%, ఏలూరు-67.6%, గోపాలపురం-85.9%, పోలవరం-86.8%, చింతలపూడి-82.9% పోలింగ్ నమోదయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేందుకు జిల్లా అధికారులు చేపట్టిన చర్యలు ఎలా ఉన్నాయి.

News April 2, 2024

‘దొంగ డాక్టర్’ కేసులో తవ్వుతున్న కొద్ది కొత్త విషయాలు

image

తీసుకున్న అప్పులు ఎగ్గొట్టడానికి వారికి మత్తు ఇంజక్షన్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారకుడైన నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఏలూరు-1 టౌన్ సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ.. ఫిలిప్పిన్స్‌లో MBBS కోర్స్ చేస్తున్న కొవ్వూరి భానుసుందర్ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి అప్పులపాలయ్యాడు. దీంతో వారిలో ఒకరికి మత్తు ఇంజక్షన్ ఇవ్వడం వలన ఒక వ్యక్తి చావుకి కారకుడయ్యాడు. మరో మహిళ ఆసుపత్రిపాలైంది.

News April 2, 2024

ఉమ్మడి జిల్లాలో నిలకడగా వర్జీనియా పొగాకు ధర

image

ఉమ్మడి జిల్లాలో వర్జీనియా పొగాకు ధర నిలకడగా కొనసాగుతోంది. సోమవారం నాటికి 20 రోజులు వేలం నిర్వహించగా.. ఇప్పటి వరకూ ₹.50.24 కోట్ల విలువైన 21.10 లక్షల కిలోల పొగాకు కొనుగోలు చేశారు. దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం 1,2 పొగాకు వేలం కేంద్రాల్లో కిలో పొగాకు రూ.240తో వేలం ప్రారంభం కాగా.. ప్రస్తుతం కిలో గరిష్ట ధర రూ.241 పలుకుతోంది. అయితే ఇది గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు.