India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర బడ్జెట్‌తో పాలకొల్లులో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మాణంపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే ఈ కాలేజీ నిర్మాణం పనులు చేపట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడికి వినతులు అందాయి. ఈ నిర్మాణం పూర్తయితే యువతకు, జిల్లా ప్రజలకు అన్ని విధాలా మేలు జరుగుతుందని నాయకులు ఎప్పటినుంచో చెబుతున్నారు. తాజా బడ్జెట్‌లో కేంద్రం విద్యా రంగానికి ఊతం ఇవ్వడంతో పునాదుల దశలో ఉన్న పనుల్లో కదలిక రానున్నట్లు తెలుస్తోంది.
పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఉభయ గోదావరి జిల్లా వాసులకు ఊరట కలిగించింది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణం కాకినాడ, తూ.గో, కోనసీమ, అనకాపల్లి, విశాఖ జిల్లాల వరకు పూర్తి చేయాల్సి ఉంది. దీనివల్ల సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీరుతాయి. ఎడమ కాలువను రూ 4,202.69 కోట్లతో నిర్మించవలసి ఉంది. ఇంతవరకు 72.99 శాతం పనులయ్యాయి.
ఉమ్మడి ప.గో జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు జిల్లా స్థాయి వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నట్లు మండలి కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు ఓ ప్రకటనలో తెలిపారు. పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై రెండు పేజీలకు మించకుండా వ్యాసం రాసి స్కూలు హెచ్ఎం ధ్రువీకరణతో ఆగస్టు 10వ తేదీలోగా కార్యదర్శి, జిల్లా సర్వోదయ మండలి, గాంధీ కస్తూర్బా భవనం, శ్రీరాంపురం, భీమవరం-2 చిరునామాకు పోస్టులో పంపాలన్నారు.
కేంద్రం బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వడంతో అన్నదాతలు ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి ప.గో జిల్లాలో సుమారు 4.5 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. కేంద్రం బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో ఉమ్మడి జిల్లాలో రూ.50 కోట్లతో కాలువల ఆధునికీకరణ, ఏటిగట్ల ప్రతిష్ట, రెగ్యులేటర్ల మరమ్మతు పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టనుంది. అటు ప్రకృతి వ్యవసాయ రంగంలో యువతను భాగస్వామ్యం చేసేలా అడుగులు వేయనుంది.
భారీ వర్షాలు.. వరదల వేళ విధుల్లో అలసత్వం వహించి గోస్తని డ్రెయిన్‌కు గండి పడటానికి కారణమైన డ్రెయిన్ల శాఖ ఈఈ MVV కిషోర్‌ను ప.గో కలెక్టర్ సి.నాగరాణి మంగళవారం సస్పెండ్ చేశారు. పాలకోడెరు మండలం మోగల్లు వద్ద గోస్తని డ్రెయిన్‌కు గండి పడటానికి ఈఈ పర్యవేక్షణ లోపం, సరైన ముందస్తు చర్యలు లేకుండా బాధ్యతా రాహిత్యంతో ఉండటమే కారణమన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నాగరాణి ఉత్తర్వులు జారీ చేశారు.
నిడదవోలులోని తీరుగూడెంలో వ్యభిచార ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఇంటిపై దాడి చేసినట్లు ఎస్ఐ పులపా అప్పారావు తెలిపారు. నిర్వాహకుడు నాగేశ్వరరావుతో పాటు ఆంజనేయపురానికి చెందిన ఓ విటుడు, రాజమహేంద్రవరానికి చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు YS షర్మిల బుధవారం (నేడు) తాడేపల్లిగూడెం మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు భీమవరం నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి అంకెం సీతారాం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు నందమూరు గ్రామంలో ఎర్రకాలువ ముంపు ప్రాంతాలలో పర్యటిస్తారని చెప్పారు.
CWC ఛైర్మన్ కుష్వీందర్ వోహ్రాను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఢిల్లీలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకి శాలువా కప్పి సత్కరించి జ్ఞాపికను అందించారు. అనంతరం అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల గురించి మాట్లాడారు. పోలవరం పూర్తి చేయడానికి సహకరించాలని కోరారు.
ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు మంత్రి నారా లోకేశ్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉండి నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రితో చర్చించారు.
పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్ర సాయం కోరేందుకు వెళ్లిన మంత్రి నిమ్మల రామానాయుడును ఢిల్లీ ఆంధ్రభవన్‌లో కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, పలువురు టీడీపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువా కప్పి సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు.
Sorry, no posts matched your criteria.