WestGodavari

News March 31, 2024

ప.గో జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతోన్న RRR సీటు!

image

నరసాపురం సిట్టింగ్ MP రఘురామకృష్ణరాజు పోటీపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. కూటమి అభ్యర్థిగా నరసాపురం నుంచే పోటీ చేస్తానని ఆయన పలుమార్లు అన్నప్పటికీ బీజేపీ అధిష్ఠానం శ్రీనివాసవర్మ పేరు ప్రకటించింది. దీంతో RRR కేడర్ సందిగ్ధంలో పడింది. అయితే.. ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. నరసాపురం MPగా కాకుంటే ప.గో జిల్లాలో MLAగానైనా పోటీ చేస్తానని చెబుతున్నారు. దీంతో జిల్లాలో RRR సీటు పొలిటికల్ హీట్ పెంచుతోంది.

News March 31, 2024

భీమవరంలో మావోయిస్టు అరెస్ట్

image

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ మావోయిస్టును పోలీసులు పట్టుకున్నారు. గతంలో ఝార్ఖండ్‌కు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. రాహుల్ కేసరి అనే మావోయిస్టు తప్పించుకున్నాడు. కొద్దిరోజులు అతడు HYDలో తలదాచుకొని, 15 రోజుల కింద భీమవరం వచ్చి వలస కార్మికులతో తాపీ పనులు చేస్తున్నాడు. ఫోన్ ఆధారంగా భీమవరం వచ్చిన ఝార్ఖండ్ పోలీసులు అతడిని వలపన్ని పట్టుకున్నారు.

News March 30, 2024

ఏలూరు: కరెంట్ షాక్.. వ్యక్తి మృతి

image

ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం అయ్యప్పరాజు గూడెం గ్రామానికి చెందిన బండారు లక్ష్మణరావు (52) శనివారం రాత్రి విద్యుత్ షాక్‌కు గురై మరణించాడు. ధర్మాజీగూడెం పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 30, 2024

ప.గో.: ‘పెన్షన్ల పంపిణీ అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర’

image

సంక్షేమ పథకాల్లో వాలంటీర్ల జోక్యం లేకుండా చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్‌తో కేసు వేయించి ఆపివేయించారని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. శనివారం రాత్రి తణుకు మండలం మండపాకలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచేలా ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేయించి కుట్ర చేశారని ఆరోపించారు. 

News March 30, 2024

గోపాలపురంలో గెలిచిన మహిళా అభ్యర్థులు వీరే

image

ప.గో జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు(1962-2019) 13సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 3సార్లు మహిళలు MLAలుగా గెలిచారు. 1978లో దాసరి సరోజినిదేవి(కాంగ్రెస్‘ఐ‘), 2004లో మద్దాల సునీత(కాంగ్రెస్‘ఐ’), 2009లో తానేటి వనిత(TDP) నుంచి గెలుపొందారు. ఇక్కడి నుంచి వనిత మరోసారి MLA అభ్యర్థిగా బరిలో ఉంటుండగా.. ఈసారి పార్టీ మాత్రం వేరు. ఆమె 2009లో TDP నుంచి పోటీ చేసి గెలవగా.. ఈసారి వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు.

News March 30, 2024

తాడేపల్లిగూడెం ఓటర్ల తీర్పు ఏంటో..?

image

హోల్‌సేల్ వ్యాపారానికి పెట్టింది పేరు తాడేపల్లిగూడెం. ఇక్కడి ఓటర్ల నాడి అంత ఈజీగా పట్టలేం. ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం, బీజేపీ, వైసీపీ.. ఇలా ప్రతి పార్టీకి పట్టం కడుతూ విభిన్న తీర్పు ఇస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి తరుపున బొలిశెట్టి సత్యనారాయణ(జనసేన) బరిలో ఉండగా.. వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ ఉన్నారు. మరి ఈసారి తాడేపల్లిగూడెం ఓటర్లు ఏం తీర్పునిచ్చేనో చూడాలి.

News March 30, 2024

ఇంకా టైం ఉంది.. ఏమైనా జరగొచ్చు: ఎంపీ RRR

image

చంద్రబాబే కాబోయే సీఎం అని బల్ల గుద్ది చెబున్నానని MP రఘురామకృష్ణరాజు అన్నారు. పెదఅమిరంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేసే ఛాన్సే లేదు. కూటమి టికెట్ వస్తుందనే నమ్మకం ఉంది. BJP అభ్యర్థి శ్రీనివాసవర్మ మంచి మిత్రుడు. పార్టీకి ఆయన చేసిన సేవ వల్లే టికెట్ పొందారు. దిల్లీ పెద్దలు సర్వే చేస్తున్నారు. ఇంకా టైం ఉంది. ఏమైనా జరగొచ్చు. నాకు న్యాయం జరుగుతుంది. నేను పోటీలో ఉంటా’నని స్పష్టం చేశారు.

News March 30, 2024

VIRAL.. ఓట్ల కోసం మా కాలనీలోకి రావొద్దంటూ ఫ్లెక్సీ

image

ఎన్నికల వేళ ఏలూరులో ఓ కాలనీవాసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శాంతినగర్ 7వ లైన్‌‌ కాలనీవాసులు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఏ రాజకీయ పార్టీ నాయకులు తమ వీధిలోకి ఓట్లు అడగటానికి రావద్దని, 20ఏళ్ల నుంచి తమ కాలనీని ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఓట్ల కోసం తప్ప గెలిచిన తర్వాత కాలనీ వైపు తొంగిచూసిన వారే లేరని, డ్రైనేజ్ తీయకపోవడంతో రోగాల బారిన పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

News March 30, 2024

హైకోర్టు న్యాయమూర్తికి స్వాగతం పలికిన ఏలూరు జిల్లా జడ్జి

image

ఏలూరు పర్యటనకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి బి.కృష్ణ మోహన్‌కి జిల్లా జడ్జి సి.పురుషోత్తం కుమార్ శుక్రవారం స్వాగతం పలికారు. నేడు (శనివారం) స్థానిక జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించబోయే న్యాయమూర్తుల జ్యుడీషియల్ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొననున్నారు. జిల్లా అదనపు ఎస్పీ స్వరూపరాణి, జిల్లాధికారులు, ఇతర న్యాయమూర్తులు, లాయర్లు ఉన్నారు.

News March 29, 2024

ప.గో.: GREAT: 100 సార్లు రక్తదానం..

image

పెరవలి మండలం నడుపల్లి గ్రామానికి చెందిన చిర్రా గోపాల్‌ వందోసారి రక్తదానం చేశారు. తణుకులోని బ్లడ్‌ బ్యాంకులో శుక్రవారం ఆయన ఈమేరకు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. 18 ఏళ్ల వయసులో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న సమయంలో రక్తదానం చేసిన గోపాల్‌ అదే స్ఫూర్తితో 3 నెలలకోసారి రక్తదానం చేస్తూ ఇప్పటి వరకు వందమందికి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు అభినందించారు.