India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప.గో. జిల్లా ఇరగవరం మండల కేంద్రంలో విషాదం జరిగింది. మండలంలోని గోటేరు గ్రామానికి చెందిన రెడ్డిమిల్లి రక్షిత రాజు (8), మురాల మహి కలువ పువ్వులు కోసేందుకని స్థానిక చెరువులో దిగారు. ఈ క్రమంలో రక్షిత రాజు గల్లంతయ్యాడు. స్థానికులు విషయం తెలుసుకొని గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు.
BJP రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థిని దగ్గుపాటి పురంధీశ్వరి గురువారం ద్వారకాతిరుమల మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు మారంపల్లిలో యాత్ర ప్రారంభమై గున్నంపల్లి మీదుగా కప్పలగుంట చేరుకుంటారు. మధ్యాహ్నం భోజన విరామ సమయం అనంతరం సాయంత్రం 4 గంటలకు నల్లజర్ల మండలంలోని గంటావారిగూడెం, దూబచెర్ల , నల్లజర్ల మీదుగా రాత్రి 9 గంటలకు పోతవరం చేరుకోనున్నారు.
తెలుగు సినీ దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బ భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని బుధవారం దర్శించుకున్నారు. బంధువులతో కలిసి ఆలయానికి వచ్చిన వారు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు శేషవస్త్రాన్ని కప్పి సత్కరించి, అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు.
భారతీయ రైల్వే అనుబంధ సంస్థ IRCTC ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాల యాత్రకు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ ఏరియా మేనేజర్ రాజా ఓ ప్రకటనలో తెలిపారు. అరుణాచలం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచ్చి, త్రివేండ్రం ప్రాంతాలకు రైలు నడుస్తుందన్నారు. మే 25న సికింద్రాబాద్ నుంచి బయలుదేరి పుణ్యక్షేత్రాల సందర్శన అనంతరం జూన్ 2న చేరుకుంటుందన్నారు. పూర్తి వివరాలకు 89773 14121 సంప్రదించవచ్చని తెలిపారు.
ఓ యువతిని ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన ఏలూరులో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..ఏలూరు నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన యువతికి తంగెళ్లమూడికి చెందిన కాకిశ్యామ్, నక్కా ఏసురత్నం మాయమాటలు చెప్పి నగరశివారులో అద్దెకు తీసుకున్న గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో దిశ CI విశ్వం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులతో పాటు వారికి సహకరించిన షేక్ అఖిల్ బాషాను అరెస్ట్ చేశారు.
పెదపాడు మండలం కలపర్రు నేషనల్ హైవేపై మంగళవారం జరిగిన <<13151338>>రోడ్డుప్రమాదం<<>>లో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. SI శుభశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన యవ్వారి రుద్రరాము భార్యాపిల్లలతో బైక్‌పై విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నారు. రుద్రరాము(33), కుమార్తె రక్షశ్రీ(9) అక్కడికక్కడే మరణించారు. కేసు నమోదైంది.
ఏలూరు జిల్లాలో ఇంటర్ పాసైన విద్యార్థులకు డీఈవో అబ్రహం మంగళవారం శుభవార్త తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. DEECET-2024 ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది మే 9 వరకు ఈ పరీక్షకై ఆన్లైన్ ద్వారా https://cse.ap. gov.in & https://cse.apdeecet.apcfss.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఇవే వెబ్‌సైట్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం ఏలూరు జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులతో కలిసి ఎస్పీ మేరీ ప్రశాంతి హెలికాప్టర్ దిగడానికి CRR రెడ్డి కళాశాల నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను పరిశీలించారు. భద్రతా పరమైనటువంటి అంశాలతో అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆమె వెంట జిల్లా అదనపు ఎస్పీ స్వరూప రాణి, తదితరులు ఉన్నారు
టీడీపీ- జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంతో అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తులని ఎంపీ, కూటమి ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు భవిష్యత్తు గ్యారంటీని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. జగన్ ఒక దుష్టుడు అని విమర్శించారు. ఏపీలోని రైల్వే స్టేషన్‌కు జగన్ పేరు, ఫొటో వేసుకోవడం కుదరదు కనుకే ఆయా స్టేషన్ల పేర్లు మారలేదని ఎద్దేవా చేశారు.
ఎన్నికల్లో ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఎంతమంది పోటీలో ఉంటారన్నది లెక్క తేలింది. నామినేషన్ల తిరస్కరణ, ఉపసంహరణ అనంతరం మొత్తంగా 183 మంది బరిలో ఉన్నారు. అయితే అత్యల్పంగా చింతలపూడి నియోజకవర్గంలో 8 మంది పోటీచేస్తుండగా.. అత్యధికంగా దెందులూరు, పాలకొల్లు, భీమవరం నుంచి 15 మంది చొప్పున బరిలో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.