WestGodavari

News July 20, 2024

కే.ఆర్.పురం ఐటీడీఏ పీవోగా హరిత

image

కే.ఆర్.పురం ఐటీడీఏ పీఓ గా హరిత IAS నియమితులయ్యారు. 2018 IAS బ్యాచ్‌కు చెందిన హరిత గతంలో ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APUFIDC) మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం బదిలీపై ఏలూరు జిల్లా కే.ఆర్.పురం ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా రానున్నారు. హరిత స్వస్థలం చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని దామలచెరువు గ్రామం.

News July 20, 2024

ప.గో జిల్లా జాయింట్ కలెక్టర్ బదిలీ

image

ఏపీలో 62 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ సీ.వీ ప్రవీణ్ ఆదిత్యను ఏపీ మారిటైమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికల విధుల్లో భాగంగా ప్రవీణ్ ఆదిత్య ప.గో జిల్లాకు బదిలీపై వచ్చారు. ఎన్నికలు ముగియడంతో బదిలీల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

News July 20, 2024

ప.గో: కరెంట్ షాక్‌తో పారిశుద్ధ్య కార్మికుడి మృతి

image

ప.గో జిల్లా తణుకు మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న CH.శ్రీను(47) శనివారం మృతి చెందాడు. పైడిపర్రులోని శ్మశానం వద్ద విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీను కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వెంకటరావు డిమాండ్ చేశారు.

News July 20, 2024

ఏలూరు: రికార్డు బద్దలు కొట్టిన పొగాకు ధర

image

వర్జినియా పొగాకు ఆల్ టైం రికార్డ్ ధర పలికింది. గోపాలపురంలోని వేలం కేంద్రంలో శనివారం నిర్వహించిన కొనుగోళ్లలో కేజీ పొగాకు రూ.400 పలికింది. రోజురోజుకి ధర పెరుగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జంగారెడ్డిగూడెం-1, 2, కొయ్యలగూడెం వేలం కేంద్రాలలో కిలో పొగాకు రూ.399 పలికింది.

News July 20, 2024

ప.గో జిల్లాలో TOP NEWS@ 6PM

image

☞ నరసాపురంలో వ్యక్తిని కత్తితో నరికేసిన మహిళ
☞ వేలేరుపాడులో మంత్రి కొలుసు పర్యటన
☞ నిండుకుండలా ఎర్రకాలువ
☞ కామవరపుకోటలో వ్యక్తి అనుమానాస్పద మృతి
☞ చింతలపూడిలో పామాయిల్ తోట నేలమట్టం
☞ చాట్రాయిలో కౌలు రైతు ప్రాణం తీసిన కరెంట్
☞ నిడదవోలులో సగంవరకు మునిగిన ఇండ్లు
☞ ప.గో జిల్లాలో 22వరకు చేపల వేట నిషేధం
☞ ద్వారకాతిరుమలలో దారుణ హత్య
☞ కూటమి సర్కారుపై కొట్టు సత్యనారాయణ ఫైర్

News July 20, 2024

ప.గో జిల్లాలో హత్య.. కత్తితో నరికిన మహిళ

image

ప.గో జిల్లా నరసాపురం మండలం వేములదీవిలోని సర్దుకొడప గ్రామంలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చినమైనవానిలంకకు చెందిన మైల చంద్రశేఖర్(38)ను సర్దుకొడపకు చెందిన మహిళ ఆమె ఇంటిలోనే కత్తితో తలపై నరికింది. చంద్రశేఖర్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చంద్రశేఖర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News July 20, 2024

ప.గో.: జులై 22 వరకు సముద్రంలో వేట నిషేధం

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో సముద్రం అల్ల కల్లోలంగా మారింది. కెరటాలు ఎగసిపడుతున్నాయి. ప.గో. జిల్లాలోని చినలంక, పీఎం లంక, పేరుపాలెం, కేపీపాలెం వద్ద సముద్రం ఉద్ధృతంగా కనిపిస్తోంది. అల్పపీడనం హెచ్చరికతో మత్స్యశాఖ అధికారులు ఈ నెల 22 వరకు వేట నిషేధ ఆజ్ఞలు జారీ చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన బోట్లన్నీ తీరానికి చేరుకుంటున్నాయి. కొన్ని నరసాపురం వద్దకు రాగా మరికొన్ని అంతర్వేదిలో ఆగాయి.

News July 20, 2024

రేపటి నుంచి నరసాపురం- డోన్ రైలు పునరుద్ధరణ

image

నరసాపురం- డోన్‌ల మధ్య నడిచే ఎరిక్సన్ రైలును ఈ నెల 21 నుంచి పునరుద్ధరించనున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాక్ మరమ్మతు పనులు కారణంగా ఈ రైలు 3 నెలలుగా నిలిపివేశారు. 17282 నంబర్‌తో నరసాపురంలో ఉదయం 6 గంటలకు బయలుదేరి విజయవాడ- గుంటూరు మార్కాపురం, నంద్యాల మీదుగా రాత్రి 9 గంటలకు డోన్ చేరుకుంటుంది. జిల్లా నుంచి శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

News July 20, 2024

ఏలూరు: వ్యక్తి దారుణ హత్య

image

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐ.ఎస్.జగన్నాథపురం గ్రామంలో శనివారం దారుణం జరిగింది. పాతకోకల లాజరు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడు కొక్కిరిపాటి సుబ్బారావు హత్య చేసి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 20, 2024

ప.గో.: MPDO మిస్సింగ్.. వీడని మిస్టరీ

image

5 రోజుల క్రితం కనిపించకుండా పోయిన నరసాపురం MPDO వెంకటరమణారావు ఆచూకీ ఇంకా దొరకలేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, పోలీసుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏలూరు కాలువ వద్ద ఆయన ఫోన్ సిగ్నల్ చివరగా కట్ అవడంతో కాలువను జల్లెడపడుతున్నా.. ఇంతవరకు ఆనవాళ్లు కనిపించలేదు. ఒకవేళ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటికే మృతదేహం తేలే అవకాశం ఉందని భావిస్తున్నారు. శుక్రవారం 50 మంది NDRF, SDRF బృందాలు కాలువలో గాలించారు.