WestGodavari

News April 28, 2024

ప.గో.: అప్పట్లో ప్రత్యర్థులు.. ఇప్పుడు దోస్తులు

image

తాడేపల్లిగూడెం YCP అభ్యర్థి కొట్టు సత్యనారాయణ ఇప్పటివరకు 6సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. ఇది 7వ సారి. అయితే గతంలో ప్రత్యర్థులుగా తనపై బరిలో నిలిచి గెలిచిన వ్యక్తులు ఇప్పుడు ఆయన గెలుపు కోసం కృషిచేయడం గమనార్హం. 1989లో తాడేపల్లిగూడెం MLAగా గెలుపొందిన పసల కనక సుందరరావు, 2009లో గెలుపొందిన ఈలి నాని అప్పట్లో ‘కొట్టు’కు ప్రత్యర్థులే. ఇప్పుడు వారిద్దరూ కొట్టుసత్యనారాయణ తరఫున ప్రచారం చేస్తున్నారు.

News April 28, 2024

స్వతంత్ర అభ్యర్థి వేటుకూరికి సింహం గుర్తు

image

ఉండి నియోజకవర్గ రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజుకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మద్దతుగా నిలిచింది. దీంతో ఆ పార్టీ గుర్తు అయిన సింహం శివరామరాజుకు లభించింది. ఇప్పటివరకు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న శివరామరాజు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు.

News April 28, 2024

కిలో పొగాకుకు రికార్డ్ ధర

image

మునుపెన్నడూ లేని విధంగా వర్జీనియా పొగాకు రికార్డు ధర పలికింది. గోపాలపురం పొగాకు బోర్డులో కిలో రూ.341కు అమ్ముడయింది. దీంతో పొగాకు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కనిష్ఠ ధర రూ.235గా ఉంది. మొత్తం 1201 బేళ్లు అమ్మకానికి రాగా.. 980 అమ్ముడయ్యాయన్నారు . ఈ ఏడాది కొనుగోలు ప్రారంభంలో కిలో పొగాకు రూ.240 పలకడంతో రైతులు నిరాశ చెందారు. తాజాగా ఊహించని రీతిలో ధర పెరగడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News April 28, 2024

పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగింపు: కలెక్టర్

image

ఉద్యోగి ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ఓటరుగా నమోదైనా తాను విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతంలోని ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని ప.గో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్ కంటే ముందుగానే ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవడం జరుగుతుందన్నారు. దీని కొరకు మే1 వరకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 27, 2024

ఎలక్ట్రికల్ బైక్ తయారు.. 2 గంటల ఛార్జింగ్‌తో 25KM

image

తాడేపల్లిగూడెం పట్టణంలోని ఏపీ నిట్ విద్యార్థులు నూతన ఆవిష్కరణ చేశారు. కేవలం 2 గంటలు ఛార్జింగ్ పెడితే గంటకు 18 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో నడిచే ఎలక్ట్రికల్ బైక్‌ను రూపొందించారు. దీనిని శనివారం ఆవిష్కరించారు. మెకానికల్ ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యార్థులు మనోజ్ కుమార్, అనీషా, ప్రత్యూష, కే.రాజేశ్వరి, కె.గణ వరప్రసాద్ బృందం ఈ బైక్ తయారు చేసింది. విద్యార్థులను కళాశాల అధ్యాపకులు అభినందించారు.

News April 27, 2024

గుర్రం ఎక్కి చింతమనేని ప్రచారం

image

పెదపాడు మండలం కొత్తూరు గ్రామంలో శనివారం దెందులూరు కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అభిమానులు ఏర్పాటు చేసిన గుర్రం ఎక్కి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలకు తెలియజేశారు.

News April 27, 2024

చింతమనేనిపై 93 కేసులు

image

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై మొత్తం 93 కేసులో ఉన్న విషయం తెలిసిందే. అయితే కేవలం ఒక్క వైసీపీ ప్రభుత్వంలో ఏకంగా 47 కేసులు ఉన్నాయి. వీటిలో 14 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఉన్నాయి. అదేవిధంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019లో 13 కేసులు, 2020-21లో 16 కేసులు, 2022లో 7 కేసులు, 2023లో 8 కేసులు, 2024 లో 3 కేసులు నమోదయ్యాయి.

News April 26, 2024

ప.గో.: అమ్మా, నాన్న, ఓ కుమారుడు.. ముగ్గురూ మంత్రులే

image

దెందులూరుకు చెందిన మాగంటి కుటుంబం అరుదైన గుర్తింపు పొందింది. 1989లో కాంగ్రెస్ నుంచి దెందులూరు MLAగా గెలుపొందిన మాగంటి రవీంద్రనాథ్ చౌదరి దేవాదాయ మంత్రిగా పనిచేశారు. మంత్రి పదవిలో ఉండగానే ఆయన ఆకస్మికంగా మరణించారు. ఆ తర్వాత 1991లో జరిగిన ఉపఎన్నికలో ఆయన సతీమణి వరలక్ష్మీదేవి గెలిచి మంత్రి అయ్యారు. వారి కుమారుడు మాగంటి బాబు 2004లో MLAగా గెలిచి రెండేళ్ల తర్వాత చిన్ననీటి పారుదలశాఖ మంత్రిగా పనిచేశారు.

News April 26, 2024

పెదపాడు: అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

పెదపాడు మండలంలోని జయపురం గ్రామంలో భలే జగన్మోహనరావు (32) గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుడిది హత్యా.. లేక కరెంట్ షాక్ తో చనిపోయారా అనే కోణంలో విచారణ చేపట్టారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో తెలియాల్సి ఉంది.

News April 26, 2024

ప.గో జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు 122 మంది నామినేషన్లు

image

ప.గో.జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు గురువారం 67 మంది అభ్యర్థులు 73 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. వీటితో కలిపి మొత్తం 122 మంది అభ్యర్థులు 206 సెట్ల నామినేషన్లను సమర్పించినట్లు కలెక్టర్‌ తెలిపారు. భీమవరంలో 8 మంది, తాడేపల్లిగూడెంలో 15 మంది , నరసాపురంలో 7, ఆచంటలో 8, తణుకులో 6,  ఉండిలో 10 , పాలకొల్లులో 13 మంది  దాఖలు చేశారు.