India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప.గో. జిల్లా ఆచంట పంచాయతీ పరిధి కోనుపోతుగుంటలో బండి వెంకటకృష్ణకు చెందిన బోరు పైపు నుంచి గత రాత్రి వింత శబ్దాలు వచ్చాయని స్థానికులు ఆందోళన చెందిన విషయం తెలిసిందే. కాగా బుధవారం ఓఎన్జీసీ, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పైప్‌లో ఇసుక వేసి, బ్యాలెట్ పౌడర్‌తో భూమికి సమాంతరంగా పూడ్చివేశారు. స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్మెంట్ కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 24వ తేదీలోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి సూచించారు. ఎయిర్‌ఫోర్స్ అధికారి సందీప్ అగ్నివీర్ రిక్రూట్మెంట్ వివరాలను వెల్లడించారు. అనంతరం రిక్రూట్మెంట్ మెటీరియల్ అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 17.5 నుంచి 21 ఏళ్ల వయస్సు ఉన్న విద్యార్థులు అర్హులని చెప్పారు.
ఏలూరు జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్థానిక డీఎల్టీసీ సహాయ సంచాలకుడు ఎస్. ఉగాది రవి తెలిపారు. కౌశల్ వికాస్ యోజన కిందఫీల్డ్ టెక్నీషియన్, ఎయిర్ కండీషనర్ కోర్సులో మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పదో తరగతి ఆపై విద్యార్హతలు కలిగిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు యువత అర్హులన్నారు. ఈ నెల 20 వరకూ గడువు ఉందన్నారు.
ప.గో జిల్లాలోని నరసాపురం MPDO వెంకటరమణారావు మిస్సింగ్‌పై ఉత్కంఠ నెలకొంది. ‘ఈరోజు నా పుట్టిన రోజు.నేను చనిపోయే రోజు ‘అని కుటుంబీకులకు మెసేజ్ పెట్టాడని వారు తెలిపారు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన అదృశ్యానికి మాధవాయిపాలెం ఫెర్రీ రేవు పాట కారణమని అనుమానిస్తున్నారు. ఈ రేవు నిర్వహణ బాధ్యత నరసాపురం అధికారులది. వేలం కోసం పాటదారులు రాకపోవడంతో ఆయన రూ.54 లక్షలు అప్పుపడ్డట్టు సమాచారం.
ఏలూరు జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరానికి 9, 10 తరగతులు చదివే దివ్యాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు,వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ రాకడ మణి తెలిపారు. అర్హులైన దివ్యాంగ విద్యార్థులు ఆగస్టు 31వ తేదీలోగా http:///scholorships.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ప.గో జిల్లా ఆచంట మండలంలో చేతిపంపు నుంచి వింత శబ్దాలు రావడం కలకలం రేపింది. కోనపోతుగుంటలో పదేళ్ల కిందట బోరు వేశారు. 8 ఏళ్ల క్రితమే అది పూడిక చేసింది. తాజాగా నిన్న అదే బోరు నుంచి వింత శబ్దాలు, వాయువులతో బురద వచ్చింది. అగ్నిమాపక జిల్లా అధికారి బి.శ్రీనివాస్, సహాయ అధికారి వైవీ జానకీరాం, ఓఎన్‌జీసీ అధికారులు ఆ స్థలానికి వచ్చారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకుంటామని ప్రజలు భయపడొద్దన్నారు.
కొవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలతో కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు కలెక్టరేట్‌లో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే నేరుగా తనకు ఫోన్ చేసి చెప్పాలని పిల్లలకు నంబర్ ఇచ్చారు. 18 సంవత్సరాలు నిండిన 19 మంది చిన్నారులకు రూ.10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ పోస్టల్ పాస్ పుస్తకాలు అందజేశారు.
ప.గో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఏపీ లిమిటెడ్ ప్రతినిధులు, ఇతర అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గల్ఫ్ వలసలపై సమీక్షించారు. జిల్లాలో ఉపాధి మార్గాలు మెండుగా ఉన్నాయని, మహిళలు వాటిని సద్విని చేసుకోవాలని కోరారు. కుటుంబ సభ్యులకు దూరమై దూర ప్రాంతాలకు వెళ్లేవారు గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారా మాత్రమే వెళ్లాలన్నారు. లేదంటే అక్కడ ఇబ్బందులు తప్పవన్నారు.
ప.గో జిల్లా నరసాపురం ఎంపీడీవోగా పనిచేస్తున్న ఎం.వెంకట రమణారావు కనిపించడం లేదంటూ ఆయన భార్య కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. జనవరి 24న వెంకట రమణారావు నరసాపురంలో విధుల్లో చేరారు. ఈ నెల 3న మెడికల్ లీవ్ మీద స్వస్థలానికి వెళ్లిన ఎంపీడీవో.. సోమవారం నుంచి కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన మిస్సింగ్‌పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వెలగపూడి సచివాలయంలో మంగళవారం మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్‌పై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష చేశారు. పలు అంశాలను అధికారులు మంత్రికి వివరించారు. కార్యక్రమంలో జల వనరుల శాఖ ముఖ్య సలహాదారులు వెంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్ట్ సీఈ నరసింహామూర్తి, ప్రాజెక్ట్ ఎల్.ఎం.సి ఎస్ఈ ఏసుబాబు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.