WestGodavari

News July 16, 2024

‘పాలకొల్లు మంత్రిగారి తాలూకా’ పేరుతో భారీ కటౌట్

image

పాలకొల్లు పట్టణం లాకు సెంటర్లో ఏర్పాటుచేసిన మంత్రి నిమ్మల రామానాయుడు భారీ కటౌట్ అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది. కటౌట్‌పైన ‘పాలకొల్లు మంత్రి గారి తాలూకా’ అని ప్రత్యేకంగా రాయించారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ, ప్రజల మన్ననలు పొంది 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించిన నేపథ్యంలో అభిమానులు ఈ కటౌట్ ను ఏర్పాటుచేశారు.

News July 16, 2024

ప.గో.: గురుకులాల్లో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ప.గో. జిల్లా సమన్వయ అధికారి భారతి తెలిపారు. పురుష అభ్యర్థులు గణితం-5, సోషల్-1, బోటనీ-1, ఇంగ్లిష్-1, హిందీ-1, హెల్త్ సూపర్వైజర్-1, పీఈటీ-2, మహిళా అభ్యర్థులు హిందీ-1,బోటనీ-1, జువాలజీ-1,ఇంగ్లీషు-2 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నెల 18 లోగా సర్టిఫికెట్ల జిరాక్స్‌లను జిల్లా సమన్వయ అధికారి, AP సాంఘిక సంక్షేమ శాఖ ఏలూరుకు పంపాలి.

News July 16, 2024

ప.గో.: విద్యుత్ శాఖలో నలుగురికి పదోన్నతులు

image

ఉమ్మడి ప.గో. జిల్లాకు సంబంధించి విద్యుత్ శాఖలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు నలుగురికి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు SE సాల్మన్ రాజు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.వేణుగోపాల్‌ను తాడేపల్లిగూడెం నుంచి తణుకు, ఎం.శ్రీనివాసరాజును భీమవరం, చంద్రకళను నిడదవోలు నుంచి ఏలూరు టౌన్, యూవీవీ భాస్కరరావును తాడేపల్లిగూడెం నుంచి నిడదవోలు జేఏవోగా నియమించారు.

News July 16, 2024

ప.గో.: ఇన్‌స్టాగ్రాంలో అమ్మాయిల రీల్స్.. నగ్నంగా మార్ఫింగ్

image

ఓ వ్యక్తి తమ ఫొటోలను మార్ఫింగ్ చేశాడని తాడేపల్లిగూడేనికి చెందిన అక్కాచెల్లెళ్లు విజయవాడ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇన్‌స్టాలో తమ వీడియోలు డౌన్‌లోడ్ చేసి నగ్నచిత్రాలుగా మార్చి కృష్ణా జిల్లాకు చెందిన గంగాధర్ వేధిస్తున్నాడని తెలిపారు. నిందితుడి జిల్లా కృష్ణా కావడంతో ఆన్‌లైన్‌లో సైబర్ విభాగంలో ఫిర్యాదుచేయాలని పోలీసులు సూచించారు. వారు ఆన్లైన్లో ఫిర్యాదుచేయగా ఫిర్యాదు అవనిగడ్డ PSకు వెళ్లింది.

News July 16, 2024

రాష్ట్రంలోనే నిమ్మల 2nd

image

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు సాధించిన ఓట్ల శాతాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ADR) సంస్థ వెల్లడించింది. పాలకొల్లు MLAగా విజయం సాధించిన నిమ్మల అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. రాష్ట్రంలో అత్యధిక ఓట్లశాతం పొందిన వారిలో 2వ స్థానంలో నిలిచారు. నియోజకవర్గంలోని మొత్తం ఓట్లలో 69.30 శాతం ఓట్లు సాధించి ఘనవిజయం సాధించారు. మొదటి స్థానంలో 70.24 శాతం ఓట్లతో విశాఖ దక్షిణ MLA వంశీకృష్ణ ఉన్నారు.

News July 16, 2024

ఏలూరు: 16 ఏళ్ల మైనర్‌పై అత్యాచారం

image

ఏలూరు జిల్లాలో ఓ మైనర్‌పై అత్యాచారం జరిగింది. పోలీసుల వివరాలు..టి.నరసాపురం మండలానికి చెందిన ఓ బాలిక జంగారెడ్డిగూడెంలో ఇంటర్ చదువుతూ హాస్టల్‌లో ఉంటుంది. ఓసారి ఆమె ఇంటికి వచ్చినపుడు గ్రామానికి చెందిన తాడి నాగకుమార్ అత్యాచారం చేశాడు. మళ్లీ ఈ నెల 6న బెదిరించి గ్రామశివారుకు పిలిపించి బలవంతంగా మరోముగ్గురితో కలిసి విశాఖపట్నం తీసుకెళ్లి హోటల్‌లో అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో వారిపై కేసునమోదైంది.

News July 16, 2024

ప.గో.: ప్రేమించిన యువతి వేధింపులు.. యువకుడు సూసైడ్

image

ఏలూరు జిల్లా నూజివీడు మండలం బోర్వంచకు చెందిన సతీష్ కుమార్ (29) ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. కొద్దిరోజుల క్రితం రెడ్డిగూడెం మండలానికి చెందిన ఓ యువతి పరిచయమైంది. కాగా ఈ నెల 13న ఉరేసుకొన్నాడు. అంత్యక్రియల తర్వాత సతీష్- యువతి చాటింగ్ వెలుగులోకి వచ్చింది. కుమారుడి మృతికి యువతి, శ్రీకాంత్, మల్లికార్జున రెడ్డి వేధింపులే కారణమని తల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో మృతదేహం వెలికితీసి పంచనామా నిర్వహించారు.

News July 16, 2024

ప.గో.: ఆశాజనకంగా రూప్‌చంద్‌ చేప ధరలు

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రూప్‌చంద్‌, శీలావతి చేపల రేట్లు పెరగడంతో చేపల మార్కెట్లు కళకళలాడుతున్నాయి. సాధారణంగా కేజీ రూప్‌చంద్‌ చేపల పెంపకానికి రైతుకు అన్నీ కలిపి రూ.90 నుంచి రూ.95 వరకు ఖర్చవుతుంది. మార్కెట్‌లో ధర పెరగడంతో కేజీ చేప ధర రూ.114 పలుకుతోంది. దీంతో రూ.15 నుంచి రూ.20 గిట్టుబాటు అవుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News July 16, 2024

ఫిర్యాదులకు పరిష్కారం చూపాలి: ఏలూరు కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ఫిర్యాదులకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక గోదావరి సమావేశ మందిరంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జిదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

News July 16, 2024

టీచర్స్‌కు గమనిక.. దరఖాస్తు గడువు పెంపు

image

ఏలూరు జిల్లాలో అర్హత కలిగిన ఉపాధ్యాయులు జాతీయ అవార్డులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచినట్లు విద్యాశాఖ అధికారి అబ్రహం తెలిపారు. http://natioonlawardstoteachers.education.gov.in వెబ్‌సైట్ నందు అప్లికేషన్స్ పొందుపరిచామన్నారు. ఆగస్టు 18 వరకు అవకాశం ఉందని తెలిపారు. SHARE IT..