India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పదో తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. భీమవరం డివిజన్‌లో 66, ఏలూరు డివిజన్‌లో 48 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం-రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం-రూ.10 వేలు+అలవెన్సులు ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
☞ SHARE IT..
ఏలూరు జిల్లాలో ఘోరం జరిగింది. లింగపాలెం మండలం పాశ్చానగరంలో CRPF కానిస్టేబుల్ సీహెచ్.బాలాజీ 2 నెలల పసిబాబును హతమార్చాడు. పాత కేసు విషయంలో సోమవారం ఏలూరు కోర్టుకు వచ్చిన బాలాజీ.. అక్కడ భార్య, ఆమె తండ్రిని చితకబాదాడు. అనంతరం పాశ్చానగరంలోని ఇంటికెళ్లి మరదలు, అత్తను తీవ్రంగా కొట్టి, మరదలి 2 నెలల బాబు పీక నులుమి చంపాడు. దీంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. ధర్మాజీగూడెం పోలీసులు కేసు నమోదు చేశారు.
ప.గో.జిల్లా తాడేపల్లిగూడెం వాసి సత్యశ్రీనివాస్ బర్త్‌డే సందర్భంగా తల్లిదండ్రులు, సోదరితో కలిసి ద్వారకాతిరుమలకు దర్శనానికి కారులో వెళ్లారు. తిరిగి వస్తుండగా నల్లజర్ల మండలం అచ్చన్నపాలెంలో మూవీ చూశారు. సోదరిని అత్తవారింట్లో దించి వస్తానని వారిని అక్కడే ఉండమని చెప్పాడు. ఈ క్రమంలో తల్లి సుబ్బలక్ష్మి, తండ్రి బసవరాజు రోడ్డు దాడుతుండగా వారిని కారు ఢీకొంది. ఆసుపత్రికి తరలిస్తుండగా సుబ్బలక్ష్మి చనిపోయింది.
మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో ఆదివారం పురుషోత్తం(19) అనే యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. ఆ యువకుడి ఫొటో బయటకు వచ్చింది. స్నేహితులతో సరదాగా సముద్రం వద్దకు వెళ్లిన పురుషోత్తం నీటిలో గల్లంతవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
భీమవరంలో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద వరద నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. పట్టణంలోని డిమార్ట్ సమీపంలో, బస్టాండ్ ప్రాంతం, మెంటేవారితోట ప్రాంతాల్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్‌ల ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో 2 అడుగుల మేర నీరు నిలిచిపోతుంటుందని, నడిచి వెళ్లే అవకాశం కూడా ఉండదని వాపోతున్నారు.
ఏలూరు జిల్లా దెందులూరు మండలం ముప్పవరం శివారులోని ఫ్యాక్టరీలో ఆదివారం ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు మాంజీ(24) భార్యపై అనుమానంతో ఫ్యాక్టరీలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మాంజీ స్వస్థలం బిహార్‌లోని గాయ్‌ఘాట్.
ప.గో జిల్లా పెనుగొండలో వెలిసిన వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి కోటేశ్వరరావు (కోటి) ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం కోటిని సన్మానించారు. అమ్మవారి ప్రసాదం, ఫొటో అందజేశారు.
ప.గో జిల్లా మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్‌కు ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు విచ్చేశారు. ఒక పక్క చిరు జల్లులు పడ్డా వాటిని లెక్క చేయకుండా కుటుంబ సభ్యులతో కలిసి సందడిగా గడిపారు. సముద్ర స్నానాలు చేసి ఇసుక తిన్నెలపై ఆడుకుంటూ కనిపించారు.
ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఏలూరు జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఏలూరు మండలం కొత్తూరు ఇందిరమ్మ కాలనీకు చెందిన రాజు విహారి (32) భార్య ఏడాది క్రితం అతణ్ని వదిలేసి వెళ్లిపోయింది. మనస్తాపంతో రాజు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మంటలతోనే కొంతదూరం నడిచి బంధువుల ఇంటి వద్ద పడిపోయాడు. విజయవాడ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ తనయుడి పెళ్లికి డిప్యూటీ సీఎం, పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీతో పవన్ చర్చించారు. సంబంధిత ఫొటోలను జనసేన ‘X’లో పోస్ట్ చేసింది.
Sorry, no posts matched your criteria.