India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు ఆశ్రం ఆసుపత్రి స్థాపించి నేటికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పేదలకు ఏడాది పాటు ఉచిత వైద్య సేవలు అందించనున్నామని డైరెక్టర్ గోకరాజు రతీదేవి చెప్పారు. ఉమ్మడి ప.గో.జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే 100 ఉచిత శస్త్ర చికిత్సలు, మరో 100 ఉచిత డెలివరీలు నిర్వహిస్తామన్నారు.
చెట్టుకొమ్మ విరిగిపడి మహిళ మృతిచెందిన ఘటన జంగారెడ్డిగూడెంలో జరిగింది. SI జ్యోతిబసు తెలిపిన వివరాలు.. స్థానిక రాజీవ్ నగర్‌కు చెందిన గుత్తుల వీరమణి (54) శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వస్తున్న క్రమంలో రోడ్డుపక్కన ఉన్న జామాయిల్ చెట్టుకొమ్మ విరిగి ఆమెపై పడింది. తొలుత స్థానిక ప్రాంతీయాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. కేసు నమోదైంది.
ఉమ్మడి ప.గో జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమ కుమార్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించినట్లు ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలు, సాక్షుల విచారణ, ఖైదీలను ఆన్‌లైన్ ద్వారా ప్రవేశపెట్టడం, యన్- స్టెప్ ద్వారా సమన్లు అమలు చేయడం మొదలైన విషయాలపై సూచనలు చేశారన్నారు.
ఏలూరు టీడీపీ కార్యాలయంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విద్యుత్ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఏలూరు కేంద్రంగా పరిశ్రమల జోన్ వస్తుందని, దానికి కావాల్సిన విద్యుత్ ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. జిల్లాలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు.
పెరవలి మండలం ఖండవల్లిలోని పౌల్ట్రీ వద్ద చెట్టు విరిగి పడటంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చాగల్లుకు చెందిన కువలేశ్ ఇరగవరం మండలం పేకేరులోని బంధువుల ఇంటికెళ్లాడు. తిరిగి బైక్‌పై ఇంటికి వస్తుండగా ఖండవల్లి వద్ద చెట్టు విరిగి అతడిపై పడింది. తలకు తీవ్ర గాయాలైన కువలేశ్‌ను తణుకు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప.గో, ఏలూరు జిల్లాల ఎస్పీలు అజిత వేజెండ్ల, మేరీ ప్రశాంతి బదిలీ అయ్యారు. కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్న ఆద్నాన్ నయీం అస్మీ పశ్చిమ గోదావరి జిల్లాకు.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ASPగా ఉన్న ప్రతాప్ శివకిషోర్ ఏలూరు ఎస్పీగా నియమితులయ్యారు. కాగా.. ప.గో ఎస్పీ అజిత వేజెండ్ల విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్-1గా వెళ్తున్నారు.
ప.గో. జిల్లా వీరవాసరం మండలం పేర్కిపాలెం గ్రామానికి చెందిన ఆనంద్ కుమార్(19) శుక్రవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో ఉంటున్నారు. నాయనమ్మ వద్ద ఉంటున్న ఆనంద్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వశిష్ట వారధి టెండర్లు ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసినట్లు జాతీయ రహదారుల శాఖ ఈఈ శ్రీనివాసులు చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మధ్య రామేశ్వరం- నరసాపురం మండలం రాజులంక వద్ద వారధి నిర్మాణానికి గత ఏడాది ఆగస్టులో టెండర్లు పిలిచారు. భూసేకరణపై కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో టెండర్లు తెరవకుండా NH అధికారులు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇదే కారణంతో వాయిదా వేయడం ఇది 11వ సారి.
తనను కస్టడీలో చంపేందుకు యత్నించారని ఉండి MLA శుక్రవారం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే. కేసులో నిందితులుగా ఉన్నది వీరే. A1: పీవీ సునీల్ కుమార్ (సీఐడీ విభాగం మాజీ చీఫ్) A2: పీఎస్ఆర్ ఆంజనేయులు (నిఘా విభాగం మాజీ చీఫ్) A3: YS జగన్ (వైసీపీ అధినేత, నాటి సీఎం) A4: ఆర్. విజయ పాల్ (నాటి అదనపు ఎస్పీ, సీబీసీఐడీ) A5: డాక్టర్ ప్రభావతి( నాటి గుంటూరు GGH సూపరింటెండెంట్), ఇతరులు.
ఏలూరుకు చెందిన ఓ వ్యక్తి కొందరితో ముఠాగా ఏర్పడి ఉమ్మడి ప.గో.లోని నిరుద్యోగులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడేనికి చెందిన డిగ్రీ చదివిన రాశికి బ్యాంక్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని రూ.7లక్షలు డిమాండ్ చేశారు. నమ్మి డబ్బు కట్టగా నకిలీ అపాయింట్ మెంట్ ఇచ్చి, శిక్షణ సైతం ఇచ్చారు. తీరా ఉద్యోగం లేదని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో దందా వెలుగులోకి వచ్చింది.
Sorry, no posts matched your criteria.